Reading Time: < 1 min

శ‌ర్వానంద్‌ కొత్త చిత్రం ప్రారంభం

శ‌ర్వానంద్‌, స‌మంత హీరో హీరోయిన్లుగా శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ నుండి ఫ్యామిలీ ఆడియెన్స్ మెప్పు పొందేలా విజ‌య‌వంత‌మైన‌ చిత్రాల‌ను అందించిన ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్ .. ఈ ఏడాది సంక్రాంతికి `ఎఫ్ 2.. ఫ‌న్ అండ్ ఫ్ర‌స్టేష‌న్‌`తో బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్‌ను సాధించింది. ఇలాంటి ప్ర‌తిష్టాత్మ‌క‌మైన బ్యాన‌ర్‌లో హిట్ చిత్రాల నిర్మాత దిల్‌రాజు నిర్మాణంలో 34వ చిత్రంగా రూపొంద‌నున్న చిత్రంలో శ‌ర్వానంద్‌, స‌మ‌త హీరో హీరోయిన్లుగా న‌టించ‌నున్నారు. త‌మిళంలో విజ‌య్ సేతుప‌తి, త్రిష న‌టించి ఘ‌న విజ‌యం సాధించిన చిత్రం `96`కు రీమేక్‌గా ఈ చిత్రం తెర‌కెక్క‌నుంది. `96` చిత్రాన్ని డైరెక్ట్ చేసిన సి.ప్రేమ‌కుమార్ తెలుగు రీమేక్‌ను కూడా తెర‌కెక్కించ‌బోతున్నారు. ప్ర‌స్తుతం ప్రీ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. మార్చి నుండి సినిమా చిత్రీక‌ర‌ణ ప్రారంభం కానుంది. ఈ సినిమాలో న‌టించ‌బోయే న‌టీన‌టులు, సాంకేతిక నిపుణుల వివ‌రాల‌ను త్వ‌ర‌లోనే ప్ర‌క‌టిస్తామ‌ని చిత్ర యూనిట్ తెలియ‌జేసింది.

Attachments area