Reading Time: < 1 min

అస‌లేం జ‌రిగింది షూటింగ్ పూర్తి

శ్రీరాం, సంచితా ప‌డుకుణే హీరోహీరోయిన్లుగా ఎక్సోడ‌స్ మీడియా నిర్మిస్తున్న అస‌లేం జ‌రిగింది సినిమా షూటింగ్ విజ‌య‌వంతంగా పూర్త‌య్యింది. హైద‌రాబాద్‌, మెద‌క్‌, ఆదిలాబాద్‌, నిర్మ‌ల్ వంటి ప్రాంతాల్లో.. దాదాపు న‌ల‌భై రోజుల పాటు సాగిన షూటింగులో టాకీ పార్టు, పాట‌లు, భారీ ఫైట్ల‌ను చిత్రీక‌రించారు. ఫైట్ మాస్ట‌ర్ శంక‌ర్ నేతృత్వంలో భారీ స్థాయిలో ఫైట్ల‌ను తెర‌కెక్కించారు. 

సినిమాలోని యాక్ష‌న్ సీక్వెన్స్ ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ‌గా నిలుస్తాయ‌ని కో- ప్రొడ్యూస‌ర్ కింగ్ జాన్స‌న్ కొయ్య‌డ తెలిపారు. మాస్ట‌ర్ ఈశ్వ‌ర్ ఈ సినిమా ద్వారా  కొరియోగ్రాఫ‌ర్గాప‌రిచ‌య‌మ‌వుతున్నార‌ని.. యూత్‌ని ఆక‌ట్టుకునే విధంగా డాన్స్ సీక్వెన్స్‌ల‌ను స‌మ‌కూర్చార‌ని అన్నారు. సినిమాలో ఒక మాస్ సాంగ్‌ని దాదాపు రెండు వంద‌ల మంది ఆర్టిస్టుల‌తో చిత్రీక‌రించ‌గా.. మ‌రో పాట‌ను నాలుగు వంద‌ల మందితో చిత్రీక‌రించామ‌ని వెల్ల‌డించారు. కొరియోగ్రాఫ‌ర్ మాస్ట‌ర్ హ‌రి నేతృత్వంలో ఐటెం సాంగ్‌ను ఆక‌ర్ష‌ణీయంగా షూట్ చేశామ‌న్నారు. 

సినిమా నాణ్య‌త‌లో కాంప్ర‌మైజ్ కాకుండా ఉండ‌టానికి.. 8కె రెజ‌ల్యూష‌న్ గ‌ల రెడ్ మాన్‌స్ట్రో కెమెరాను ఈ సినిమా చిత్రీక‌ర‌ణ కోసం వినియోగించామ‌ని తెలిపారు. ల‌వ్‌, స‌స్పెన్స్‌, యాక్ష‌న్ ఎంట‌ర్‌టైనర్‌గా నిర్మించిన అస‌లేం జ‌రిగింది సినిమా ప్రేక్ష‌కుల‌కు త‌ప్ప‌కుండా న‌చ్చుతుంద‌న్నారు. తాము అనుకున్న‌దానికంటే మెరుగ్గా ఈ సినిమాను డైరెక్ట‌ర్ ఎన్‌వీఆర్ తెర‌కెక్కించార‌ని చెప్పారు. విజువ‌ల్ ఎఫెక్ట్స్‌, పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నుల‌ను శ‌ర‌వేగంగా పూర్తి చేసి మే నెల‌లో సినిమాను విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నామ‌ని తెలిపారు. ఇందుకు సంబంధించిన ప‌నులు చివ‌రి ద‌శ‌లో ఉన్నాయ‌న్నారు.