Reading Time: < 1 min

భార్గవ దర్శకత్వంలో మైథలాజికల్ సోషల్ కామెడీ చిత్రం “శూర్పణఖ”

తెలుగులో మొట్టమొదటి యానిమేషన్ చిత్రం “కిట్టు ” (2006) తో జాతీయ అవార్డు గెలుచుకున్న నిర్మాత  భార్గవ దర్శకత్వంలో  “శూర్పణఖ ” పేరుతో ఒక చిత్రం రూపొందనుంది .  భార్గవ పిక్చర్స్ , కాస్మిక్ రే ప్రొడక్షన్స్ బ్యానర్లపై భార్గవ , D.R రెడ్డి సంయుక్తంగా  నిర్మించనున్నారు .  ఈ సందర్భంగా  రచయిత , దర్శకుడు భార్గవ మాట్లాడుతూ  ”మైథలాజికల్  సోషల్ కామెడీ చిత్రం ఇది .  రామాయణంలో కీలకమైన మలుపులు  శూర్పణఖ వల్లనే  సంభవించాయి  . శూర్పణఖ ప్రస్తుత సమకాలీన సమాజంలో కి  వస్తే  పరిణామాలు ఎలా ఉంటాయి అనే  కధాంశం తో ఈ చిత్రం రూపొందుతుంది . అసలు శూర్పణఖ ఇప్పుడు ఎలా వచ్చింది ? అసలు వచ్చి  ఏం చేసింది ? అనేది చాలా ఆసక్తికరంగా ఉంటుంది  . ఒక విధంగా చెప్పాలంటే ఈ చిత్రం శూర్పణఖ దృక్కోణం నుండి రామాయణం చెప్పడమే ! శూర్పణఖ ఏ విధంగా  అప్పటి లంకను , ఇప్పటి సమాజంతో ,అలాగే  అప్పటి ప్రజల్ని ఇప్పటి ప్రజలతో ఎలా పోలుస్తుందో ఈ చిత్రంలో కథ గా అల్లడం జరిగింది” అని తెలిపారు. 
చిత్ర నిర్మాతలలో  ఒకరైన D.R  రెడ్డి  మాట్లాడుతూ ”శూర్పణఖ పాత్ర ని ఒక ప్రముఖ నటి చేయబోతుంది . ఆ  వివరాలు మరియు మిగిలిన నటీనటులు , సాంకేతిక నిపుణులు తదితర వివరాలను త్వరలో వెల్లడిస్తాం . ఈ చిత్రం లో vfx కు అధిక ప్రాధాన్యత ఉండడం వలన  ప్రీ ప్రొడక్షన్ పకడ్బందీగా చేసుకుంటున్నాం . వచ్చే నెలలో మొదటి షెడ్యూల్ ప్రారంభం కానుంది ” అని   తెలిపారు . 

ఈ చిత్రానికి కథ , మాటలు, కథనం , దర్శకత్వము – భార్గవ . 

నిర్మాతలు: భార్గవ, D.R  రెడ్డి 
బ్యానర్స్ : భార్గవ పిక్చర్స్, కాస్మిక్ రే ప్రొడక్షన్స్