పద్మశ్రీ అవార్డు గ్రహీత చింతకింది మల్లేశం జీవితకథను ఆధారంగా చేసుకుని రూపొందుతున్న చిత్రం `మల్లేశం`. వెండితెరపై ఈయన పాత్రలో ప్రియదర్శి కనిపించనున్నాడు. రాజ్.ఆర్ దర్శకుడు. రాజ్.ఆర్, శ్రీఅధికారి నిర్మాతలు. సురేష్ ప్రొడక్షన్స్ సమర్పణలో మే 21న సినిమా విడుదలవుతుంది. ఈ సినిమా ట్రైలర్‌ను బుధవారం హైదరాబాద్‌లో విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో పద్మశ్రీ అవార్డు గ్రహీత చింతకింది మల్లేశం, పల్లెసృజన నిర్వాహకులు గణేశం, తరుణ్ భాస్కర్, సందీప్‌కిషన్, ప్రియదర్శి, రాజ్.ఆర్, శ్రీఅధికారి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా…
గణేశం మాట్లాడుతూ – “నేను సినిమాలు చూస్తాను కానీ.. ఇండస్ట్రీ గురించి పెద్దగా తెలియదు. రెండేళ్ల క్రితం రాజ్‌గారు నన్ను కలసి ఇలా మల్లేశంగారి సినిమా తీద్దామనుకుంటున్నాను అని చెప్పారు. నిజమైన కథను తక్కువ సమయంలో చెప్పడమనేది చాలా గొప్ప విషయం“ అన్నారు.
చింతకింది మల్లేశం మాట్లాడుతూ – “ఒకరోజు రాజ్‌గారు ఫోన్ చేసి యూ ట్యూబ్‌లో మీరు మాట్లాడింది చూశాను. దాని గురించి సినిమా తీయాలని అనుకుంటూ ఉన్నాను అన్నారు. రెండున్నరేళ్లు కష్టపడి కథను సిద్ధం చేసుకున్నారు. ఫైనల్‌గా ఈరోజు సినిమా చూస్తున్నాను. సామాన్య మానవుడి జీవితాన్ని సినిమాగా తీయడం చాలా గొప్ప విషయం. ప్రపంచానికి మల్లేశం గురించి చెప్పాలనే రాజ్‌గారి సంకల్పం నేరవేరింది. సినిమా చూశాను ప్రియదర్శిగారు అద్భుతంగా నటించారు. ఝాన్సీ గారు మా అమ్మగారి పాత్రలో నటించారు. సినిమాలో ఆమెను చూస్తే మా అమ్మగారిని చూసిన ఫీలింగే కలిగింది. అలాగే చక్రపాణిగారు మా నాన్నపాత్రలో అద్భుతంగా నటించారు. సినిమా చూసే సందర్భంలో ఓసారి కళ్లలో నీళ్లు కూడా తిరిగాయి. నా కథను నేను తెరపై చూసుకోవడం నా అదృష్టంగా భావిస్తున్నాను“ అన్నారు.
వెంకట సిద్ధారెడ్డి మాట్లాడుతూ – “80 బ్యాక్‌డ్రాప్‌లో సినిమా తీయడం అంటే ఎంత కష్టమో నాకు తెలుసు. యూనిట్ అందరూ చాలా కష్టపడి చేసిన సినిమా ఇది. జూన్ 21న విడుదలవుతున్న ఈ సినిమా మంచి విజయాన్ని సాధించాలని కోరుకుంటున్నాను“ అన్నారు.
గొరేటి ఎంకన్న మాట్లాడుతూ – “ఈ సినిమాలో రెండు అద్భుతమైన పాటలు రాసే అవకాశం కలిగింది. ఆదర్శవంతమైన వ్యక్తి బయోపిక్ ఇది. ట్రెండ్ సెట్టర్ మూవీ అవుతుంది“ అన్నారు.
మ్యూజిక్ డైరెక్టర్ మార్క్ కె.రాబిన్స్ మాట్లాడుతూ – “రాజ్‌గారితో సినిమా చేసే క్రమంలో చాలా దూరం ట్రావెల్ చేశాం. దర్శిలో మల్లేశంగారు కనపడ్డారు. దర్శక నిర్మాతలకు థాంక్స్. ఎంటైర్ యూనిట్‌కు అభినందనలు“ అన్నారు.
మధుర శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ – “అ సినిమా చూసిన తొలి ప్రేక్షకుడిని నేనే. దీన్ని తెలుగు సినిమా అనడం కంటే ఇండియన్ మూవీ అంటే కరెక్ట్. బయోపిక్ కా బాప్. ఆర్ట్ మూవీ కాదు. పక్కా కమర్షియల్ మూవీ“ అన్నారు.
తరుణ్ భాస్కర్ మాట్లాడుతూ – “యూనిట్‌లో ప్రతి ఒక్కరికి అభినందనలు. సినిమా ట్రైలర్ చూస్తుంటే చాలా ప్రేమతో సినిమా చేసినట్లుగా అనిపించింది. దర్శక నిర్మాతలు ఎంత ప్యాషనేట్‌గా సినిమా చేశారో చూస్తేనే అర్థమైపోతుంది.
వెంకటసిద్ధారెడ్డిగారు క్రూసేడర్. ఎన్నో మంచి సినిమాలకు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్. ఈ సినిమాకు డైరెక్షన్ చేసే అవకాశం నాకు దక్కింది. కానీ నేను వదులుకున్నాను. మల్లేశంగారి కథ విన్నప్పుడు తెలుగు ప్రేక్షకులకే కాదు.. ప్యాన్ ఇండియా ప్రేక్షకులకు చెప్పాల్సిన చిత్రమది అనిపించింది. ఇండస్ట్రీలో మనం చేసే వర్క్‌కి మీడియా అటెన్షన్ రాగానే దేవుళ్లం అయిపోతాం. నిజానికి మల్లేశంగారిలాంటి వ్యక్తులు ఇన్‌స్పిరేషన్. చాలా మంది ఇన్‌స్పైరింగ్ స్టోరీస్ రాక అలాగే ఉండిపోతున్నారు. మన పక్కింట్లోనే, ఊర్లోనే జరిగే ఇలాంటి కథను తెరకెక్కించడం అనేది ఓ బాధ్యత. స్టీరియో టైప్ వంటి సిని వర్గీకరణలు ఫేడ్ అవుట్ అయిపోతున్నాయి. నేను భయపడలేదు. భయపడను.. ఫ్యూచర్ జనరేషన్ కూడా భయపడదు. ఎందుకంటే.. మాకు కథలు కావాలి. ఎన్నో విభిన్నమైన కథలను వినాలని ప్రేక్షకులుగా అనుకుంటున్నాం. మన తాతలాంటి సినిమాలను వేరే భాషల్లో చేస్తున్నారు. మనం ఆగే పరిస్థితి రాకూడదు కూడా. ఏ కథనైనా మూవీ మేకర్స్‌గా వెతికి పట్టుకుని బయటకు తెస్తాం. ఇది ఆర్ట్ సినిమానా,కమర్షియల్ సినిమానా? హీరరో ఉన్నాడా? కమెడియన్ ఉన్నాడా? అని చూడొద్దు. ట్యాగ్ లైన్ ఫేడ్ అవుట్ అయిపోవాలి. హీరో, కమెడియన్ అనే ట్యాగ్‌లైన్ యాక్టర్ అనే ట్యాగ్‌లైన్ వస్తుందో ఆరోజు చాలా ముందుకు వెళతాం. మన భవిష్యత్ తరాలకు ఎన్నో విలువలను అందిస్తాం. సినిమా అనేది ఒక వ్యక్తిని గ్లోరిఫై చేయదు.. సోసైటీని గ్లోరిఫై చేస్తుంది. స్టోరీ ఆఫ్ ఫ్యూచర్. సినిమా అనేది ట్రూ ఫామ్ ఆఫ్ డెమోక్రసీ. ప్రియదర్శి ఒక్కొక్క పాత్రలో ఎంతో కష్టపడి జీవం పోసుకుంటున్నాడు. `పెళ్లిచూపులు` సమయంలో తనకు బెస్ట్ కమెడియన్ అవార్డ్ రాగానే, బయటకు వచ్చేశాను. తను కమెడియన్ అనే మోడ్ నుండి ఈరోజు బయటకు వచ్చేశాడు. `మల్లేశం` ఓ గ్రేట్ ఫిలిం. దీన్ని ప్రమోట్ చేయడానికి ఎలాంటి స్టార్స్ అవసరం లేదు“ అన్నారు.
సందీప్‌కిషన్ మాట్లాడుతూ – “మల్లేశంగారిలాంటి గొప్ప వ్యక్తి బయోపిక్‌ను ప్రియదర్శి తన రెండు భుజాలపై మోశాడు. తన స్నేహితుడిగా నేను ఇక్కడికి రావడం ఆనందంగా ఉంది. రాజ్‌గారికి పెద్ద ఫ్యాన్‌ని అయ్యాను. ఆయన ఇన్‌టెన్స్, నిజాయతీతో కూడిన ఆయన ఆలోచనకు నేను ఫ్యాన్‌గా మారాను. ఈ సినిమాకు నా కాంట్రీబ్యూషన్ ఏదీ లేదే అని బాధగా కూడా ఉంది. మనం తెలుగు ఇండస్ట్రీలో ఉన్నామని గర్వంగా చెప్పుకోవచ్చు. మన ప్రేక్షకులు పెళ్లిచూపులు చూస్తారు..ఒక అర్జున్ రెడ్డి చూస్తారు.. ఒక గూఢచారి చూస్తారు.. ఒక బాహుబలి చూస్తారు. అదే సమయంలో వేరే భాష నుండి డబ్ చేసుకుని వస్తే కె.జి.యఫ్ బ్లాక్ బస్టర్ చేస్తారు. కంటెంట్ బావుంటే చూడటానికి మన జనాలంతా గొప్ప జనాలు లేరు. నాకు ఈ సినిమా పరంగా ఏదైనా చేయాలని అనుకుంటున్నాను. అందుకని తొలి వంద టికెట్లను నేనే కొంటాను“ అన్నారు.
దర్శక నిర్మాత రాజ్.ఆర్ మాట్లాడుతూ – “సినిమా చేయడానికి పర్మిషన్ ఇచ్చిన పల్లెసృజన నిర్వాహకులు గణేశంగారికి, మల్లేశంగారికి థాంక్స్. బయోపిక్ అంటే ఓ బాధ్యత దాన్ని ఎంతో సమర్ధవంతంగా నిర్వర్తించాం. టీం అందరం నిజాయతీతో సినిమాను పూర్తి చేశాం. ఇది ఆర్ట్ ఫిలిం కాదు. కమర్షియల్ మూవీ. ముందు ఇందులో విజయ్ దేవరకొండ, నానిలను హీరోలుగా అనుకున్నాను. కానీ డేట్స సమస్య రావడంతో ప్రియదర్శిని తీసుకున్నాం. అలాగే తరుణ్ భాస్కర్‌ను సినిమాను డైరెక్ట్ చేయమని అడిగాను కానీ కుదరలేదు. ఇంటర్మీడియట్ విద్యార్థులు పరీక్షల్లో ఫెయిల్ అయ్యామని ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. కానీ ఆరో తరగతి డ్రాప్ అవుట్ అయి .. పద్మశ్రీ అవార్డు అందుకోవడం వరకు ఎదిగిన మల్లేశం గారిని స్ఫూరిగా తీసుకోవాలి. నా ప్రయాణంలో సహకారం అందించిన ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ వెంకట్ సిద్ధారెడ్డిగారికి, ఆర్ట్ డైరెక్టర్ లక్ష్మణ్ ఏలే, మహేష్ సహా ఎంటైర్ యూనిట్‌కు థాంక్స్“ అన్నారు