ప్రేమభిక్ష చిత్రం డబ్బింగ్ పూర్తి
ఓం సాయి పిక్చర్స్ బ్యానర్లో అనిల్, శృతి హీరోహీరోయిన్లుగా.. అశ్వత్రెడ్డి, నాగరాజు నిర్మాతలుగా, ఆర్.కె. గాంధీ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న చిత్రం ‘ప్రేమభిక్ష’. యాక్షన్తో నిండిన లవ్ స్టోరీగా తెరకెక్కిన ఈ చిత్రం ప్రస్తుతం డబ్బింగ్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. అక్టోబర్లో విడుదల చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.
ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు మాట్లాడుతూ.. ‘‘అనంతపురం జిల్లా భద్రపట్నం అనే గ్రామంలో జరిగిన యధార్ధ ఘటనను తీసుకుని దర్శకుడు గాంధీ ఓ మంచి కథను తయారు చేశారు. చక్కని లవ్ స్టోరీతో నిండిన యాక్షన్ చిత్రమిది. ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డా. దేవిశ్రీ గురూజీ ఇందులో ఓ మంచి పాత్రలో నటించారు. ఆయన ఈ చిత్రానికి ప్రధాన ఆకర్ణణ కానున్నారు. షూటింగ్ పూర్తయింది. డబ్బింగ్ కార్యక్రమాలు కూడా పూర్తయ్యాయి. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి అక్టోబర్లో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నాము..’’ అన్నారు.
దర్శకుడు ఆర్.కె.గాంధీ మాట్లాడుతూ.. ‘‘ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డా. దేవిశ్రీ గురూజీ ఓ కీలక పాత్రలో నటించారు. ఆయన ఈ చిత్రంలో నటించడం మా అదృష్టంగా భావిస్తున్నాం. అలాగే ప్రముఖ సీనియర్ నటుడు సుమన్ మా చిత్రంలో నటించడం మాకు గర్వకారణం. ఆయన ఎన్నో సలహాలు ఇచ్చారు. ఆయనతో పాటు షఫీ, కవిత, జీవా వంటి సీనియర్ నటులు ఈ చిత్రంలో నటించారు. నిర్మాతలు ఖర్చుకు వెనుకాడకుండా.. నేనడిగిన ప్రతీది సమకూర్చి, చిత్రం బాగా వచ్చేందుకు సహకరించారు. వారికి ధన్యవాదాలు. క్రూరత్వాన్ని ప్రేమతో ఎలా జయించవచ్చునని తెలియజేసే చిత్రమే ఇది. హీరో హీరోయిన్లు, టెక్నిషియన్స్ అందరిసపోర్ట్తో సినిమాను అనుకున్న సమయంలో పూర్తి చేశాం. త్వరలోనే ఆడియో విడుదల చేసి అక్టోబర్లో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తాం. అందరూ ఆదరిస్తారని కోరుకుంటున్నాము..’’ అన్నారు.
అనిల్, శృతి, సుమన్, కవిత, డా: దేవిశ్రీ గురూజీ, షఫీ, రాజేంద్ర, కింగ్ మోహన్, కిల్లర్ వెంకటేష్, జ్యోతి మొదలగు వారు నటిస్తున్న ఈ చిత్రానికి స్టంట్స్: శంకర్, కొరియోగ్రఫీ: ఎస్.ఎస్.కె. సందీప్, పాటలు: ఘంటాడి కృష్ణ, రామ్ పైడిశెట్టి; సంగీతం: ఘంటాడి కృష్ణ, కెమెరా: ప్రమోద్. ఆర్; నిర్మాతలు: అశ్వత్రెడ్డి, నాగరాజు; కథ-స్క్రీన్ప్లే-మాటలు-దర్శకత్