ప్రేమం పూజ్యం చిత్రం ఫస్ట్ షెడ్యూల్ పూర్తి
కెదంబరి క్రియేషన్స్ బ్యానర్ లో డాక్టర్ రక్షిత్ నిర్మాతగా. రాఘవేంద్ర బి.ఎస్. దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ప్రేమ0 పూజ్యం. ఒక జోర్నీలో జరిగే బ్యూటిఫుల్ లవ్ స్టొరీతో ఊటీ, చిక్ మంగళూరు, కోడై కెనాల్. డార్జిలింగ్ వంటి అద్భుతమైన లొకేషన్స్ లో ఈ మూవీ చిత్రీకరణ జరుపుకుంది. వియత్నంలో మొదటిసారి షూటింగ్ జరుపుకున్నఇదే అవ్వడం విశేషం. అలాగే మున్నార్ వంటి అందమైన లొకేషన్స్ లో కీలక సన్నివేశాలు షూట్ చేశారు. ఈ చిత్ర హీరో ప్రేమ్ కి ఇది 25.వ సినిమా కావడంతో ఈ చిత్రం పై ప్రేక్షకులకు భారీ అంచనాలు ఉన్నాయి. కన్నడలో మంచి గుర్తింపు ఉన్న హీరో ..ప్రేమ్ ఈ చిత్రం తో తెలుగు ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ చిత్రంలో హీరో ప్రేమ్ కి జోడిగా బిద్ర ఆచార్య. ఆంద్రీత రాయ్ హీరోయిన్స్ నటిస్తున్నారు. అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే విధంగా మంచి టెక్నీషియన్లతో ఈ చిత్రం కొత్త పాయింట్ తో బ్యూటీఫుల్ లవ్ స్టోరీగా తెరకెక్కిందని దర్శకుడు తెలిపారు.
మొదటి షెడ్యూల్ లో 70 శాతం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా మరో షెడ్యూల్ షూటింగ్ పూర్తి చేస్తా ము. ఈ చిత్రం గురించి మరిన్ని విశేషాలు చిత్ర యూనిట్ త్వరలో మీడియాకు తెలియపరుస్తాము.తెలుగు కన్నడలో భాషల్లో ఫిబ్రవరిలో విడుదల రిలీజ్ చేస్తామని నిర్మాతలు తెలిపారు
బ్యానర్: కెదంబరి క్రియేషన్స్
నటీనటులు: ప్రేమ్, బ్రిద ఆచార్య, అన్ద్రిత రాయ్, సుమన్, మాళవిక, అవినాష్, ఆనంద్
నిర్మాతలు: డాక్టర్ రక్షిత్, రాజకుమార్, జనకిరమన్ దేవదాస్
డైరెక్టర్ & మ్యూజిక్: డాక్టర్ రాఘవేంద్ర బి.ఎస్.
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: మాధవ్ కిరణ్
కెమెరామెన్: నవీన్ కుమార్