Reading Time: < 1 min
మెగాస్టార్ చిరంజీవి 152  మూవీ రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభం
 
 
మెగాస్టార్ చిరంజీవి 152వ చిత్రం రెగ్యుల‌ర్ షూటింగ్ గురువారం హైద‌రాబాద్‌లో ప్రారంభ‌మైంది. స్టార్ డైరెక్ట‌ర్ కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో కొణిదెల ప్రొడ‌క్ష‌న్ కంపెనీ, మ్యాట్నీ ఎంట‌ర్‌టైన్‌మెంట్ ప‌తాకాల‌పై రామ్‌చ‌ర‌ణ్‌, నిరంజ‌న్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 
 
మెలోడీ బ్రహ్మ మణి శర్మ ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి సంగీతం అందించనున్నారు. ప్ర‌ముఖ సినిమాటోగ్రాఫ‌ర్ తిరు సినిమాటోగ్ర‌ఫీ అందిస్తోన్న ఈ చిత్రానికి శ్రీక‌ర్ ప్ర‌సాద్ ఎడిట‌ర్‌. సురేష్ సెల్వ‌రాజ‌న్ ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. సినిమాకు సంబంధించిన న‌టీన‌టులు, ఇత‌ర సాంకేతిక నిపుణుల వివ‌రాల‌ను త్వ‌ర‌లోనే తెలియ‌జేస్తామ‌ని చిత్ర యూనిట్ ప్ర‌క‌టించింది.