గౌతమ్ క్రియేషన్స్ చిత్రం ప్రారంభo
లేడీ సైకో థ్రిల్లర్ కథతో
ఒక లేడీ సైకోగా మారితే పరిణామాలు ఎలా ఉంటాయి ? అనే కథాంశంతో ముప్పిడి క్రియేషన్స్ నిర్మాణ సారథ్యంలో గౌతమ్ క్రియేషన్స్ సంస్థ ఓ చిత్రాన్ని నిర్మిస్తోంది. ప్రియాంషా, ముప్పిడి వాసు, ఘటికాచలం ప్రధాన పాత్రధారులుగా నటించే ఈ చిత్రం షూటింగ్ బుధవారం హైదరాబాద్‌లోని సంస్థ కార్యాలయంలో ప్రారంభమైంది. శ్రీనివాస్ జి. దర్శకత్వంలో రూపొందే ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ఈ నెల మూడవ వారం నుండి జరుగుతుంది. గ్రామీణ నేపథ్యంలో సాగుతుంది. సమ్మక్క సారాలమ్మ జాతర ప్రాంతంతో పాటుగా జగిత్యాల ఫారెస్ట్, నెల్లూరు, వరంగల్ జలపాతాల లొకేషన్స్‌లో చిత్రీకరణ జరుపుతామని చిత్ర నిర్మాత ముప్పిడి వాసుదేవరావు తెలిపారు.

”ఇది థ్రిల్లర్ కథాంశం చిత్రమని, లేడీ సైకో వల్ల ఎదురయ్యే పరిణామాలను చూపిస్తున్నామని” చిత్ర దర్శకుడు శ్రీనివాస్ జి. చెప్పారు.
ఈ చిత్రంలో ప్రియాంషా, ముప్పిడి వాసు, ఘటికాచలం, వెంకటేష్ తాతిరాజు, మల్లాది శాస్త్రి, శీలం శ్రీను, కేవీవీ. పంతులు, ఈ.లావణ్య, టి.ప్రియాంక, సిహెచ్. సంతోష్, విష్ణు తదితరులు నటిస్తున్నారు.
ఈ చిత్రానికి కథ, మాటలు, సంగీతం: పోలూర్ ఘటికాచలం, ఎడిటింగ్, కెమెరా: వాసువర్మ, పాటలు :చిత్రవూరి విజయ్‌కుమార్, ప్రొడక్షన్ మేనేజర్: శీలం శ్రీనివాస్, సమర్పణ: ముప్పిడి మనోజ్ఞ, ఆన్లైన్ ప్రొడ్యూసర్: డా.ఎం.నరేంద్ర, సహ నిర్మాత ఎం.ఏ. సాజిద్, నిర్మాత: ముప్పిడి వాసుదేవరావు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: శ్రీనివాస్ జి.