హిట్ మూవీ ట్రైలర్ విడుదల
`హిట్` మూవీ ట్రైలర్‌ను విడుదల చేసిన దిల్‌రాజు
నేచురల్ స్టార్ నాని సమర్పణలో వాల్ పోస్టర్ సినిమా బ్యానర్‌పై `ఫలక్‌నుమాదాస్` వంటి సక్సెస్ఫుల్ మూవీతో హీరోగా తనకంటూ గుర్తింపును సంపాదించుకున్న విశ్వక్ సేన్ హీరోగా రూపొందుతోన్న చిత్రం `హిట్`. `ది ఫస్ట్ కేస్` ట్యాగ్ లైన్. శైలేష్ కొలను దర్శకత్వంలో ప్రశాంతి త్రిపిర్నేని ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రుహానీ శర్మ హీరోయిన్గా నటిస్తున్నారు. విశ్వక్ సేన్ ఈ చిత్రంలో విక్రమ్ రుద్రరాజు అనే ఐపీఎస్ ఆఫీసర్‌గా కనిపించబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ట్రైలర్‌ను బుధవారం హైదరాబాద్‌లో విడుదల చేశారు. ఈ సందర్భంగా….
హిట్ చిత్రాల నిర్మాత దిల్‌రాజు మాట్లాడుతూ – “ముందుగా నాని గురించి చెప్పుకోవాలి. తను హీరోగా బిజీగా ఉన్నప్పటికీ నిర్మాతగా మారి తొలి చిత్రంగా అ! వంటి డిఫరెంట్ మూవీని అందించాడు. ఇప్పుడు హిట్ లాంటి మరో సినిమాను కూడా ప్రేక్షకులకు అందిస్తున్నాడు. తన గట్స్‌కి అభినందనలు. ఇలాగే ఎక్స్పెరిమెంట్స్ సినిమాలను తను ప్రొడ్యూస్ చేయాలని కోరుకుంటున్నాను. మనలోని టేస్ట్‌ను ఇలాంటి సినిమాలతోనే బయటకు తీసుకు రాగలుగుతాం. నిర్మాతలు నాని, ప్రశాంతిగారికి అభినందనలు. డైరెక్టర్ శైలేంద్ర తండ్రి శేషగిరి రావుగారికి ఇండస్ట్రీతో మంచి అనుబంధం ఉంది. మాతో 25 సంవత్సరాల అనుబంధం ఉంది. మా పెళ్ళిపందిరి సినిమాకు ప్రొడక్షన్ మేనేజర్‌గా వర్క్ చేశారు. అలాగే ప్రసాద్ ల్యాబ్స్‌లో వర్క్ చేశారు. ఇప్పుడు మా బ్యానర్‌తో పాటు ట్రావెల్ అవుతున్నారు. తను ఆస్ట్రేలియాలో వర్క్ చేస్తుండేవాడు. తనకి సినిమా డైరెక్ట్ చేయాలనిపించి స్క్రిప్ట్ తయారు చేశాడు. ఆ విషయం తెలిసిన నాకు ముందు ఎందుకండీ.. మీకు ఇండస్ట్రీ గురించి తెలియదా? అని శేషగిరి రావుగారితో అన్నాను. కానీ లేదుసార్ వాడు వినడం లేదండీ అన్నాడు. సరేనని స్క్రిప్ట్ వినమంటే విన్నాను. నాకు స్క్రిప్ట్ చెప్పేసి ఆస్ట్రేలియా వెళ్లిపోయాడు. కట్ చేస్తే.. ఇప్పుడు ఈ సినిమాతో ముందుకు వచ్చాడు. నాని సహా అందరినీ ఎగ్జైట్ చేసేలా స్క్రిప్ట్ చెప్పి ఉంటాడనిపించింది. ట్రైలర్ చూస్తుంటే ఆసక్తికరంగా ఉంది. థియేటర్‌కు వెళ్లాలనే ఆసక్తి కలుగుతుంది. వెళ్ళిపోమాకే సినిమాను నేనే రిలీజ్ చేశాను. అప్పుడే నాకు విశ్వక్ పరిచయం. తను మంచి ఆర్టిస్ట్ అని అనిపించింది. తర్వాత ఫలక్నుమాదాస్ను డైరెక్ట్ చేసి, నిర్మించి, నటించి పెద్ద హిట్ కొట్టాడు. తను నిజంగా టాలెంటే. ట్రైలర్ ఆసక్తిరంగా ఉంది. సినిమా ప్రేక్షకులకు నచ్చాలని కోరుకుంటున్నాను. నైజాం, వైజాగ్‌లలో మేమే సినిమాను రిలీజ్ చేస్తున్నాం. ఎంటైర్ యూనిట్‌కి ఆల్ ది బెస్ట్“ అన్నారు.
హీరో విశ్వక్సేన్ మాట్లాడుతూ – “సాధారణంగా ఓ సినిమా హిట్ అయితే నెక్ట్స్ మూవీ ఏంటనేది ఓ టెన్షన్ ఉంటుంది. శైలేష్ ఈ సినిమా కథ చెప్పగానే మరేం ఆలోచించకుండా సినిమా చేయకుండా ఓకే చేసేశాను. తను నెరేట్ చేసేటప్పుడే సీట్ ఎడ్జ్ థ్రిల్లర్‌గా ఎంజాయ్ చేశాను. ప్రతి సినిమాకు ఏదో ఒక టెన్షన్ ఉండేది. యాక్టింగ్‌తో పాటు సినిమాలో మరో ఎక్స్ట్రా వర్క్ చేసేవాడిని. కానీ.. హిట్ సినిమా విషయానికి వస్తే.. యాక్టింగ్ తప్ప మరేమీ చేయలేదు. ఎందుకంటే నాకు శైలేష్ మీద అంత నమ్మకం ఉండింది. అలాగే మణికందన్‌గారు నన్ను చాలా బాగా చూపించారు. నిర్మాత ప్రశాంతిగారికి థ్యాంక్స్. సాధారణంగా హీరోయిన్స్‌ను నిర్మాతలు జాగ్రత్తగా చూసుంటారని చెబుతుంటారు. అలా ఓ హీరోయిన్లా నన్ను జాగ్రత్తగా చూసుకున్నారు. సినిమా మీద చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నాం. సినిమా థియేటర్కొస్తే మామూలుగా ఉండదు. ఇంత మంచి డైరెక్టర్ దొరికినందుకు చాలా ఆనందంగా ఉంది“ అన్నారు.
డైరెక్టర్ శైలేంద్ర మాట్లాడుతూ – “ట్రైలర్ మీ అందరికీ నచ్చి ఉంటుందని అనుకుంటున్నాను. థ్రిల్లర్ మూవీ. ట్రైలర్లో చూసిన దానికంటే సినిమాలో ఎక్కువ ఎక్స్‌పీరియెన్స్ చేస్తారు. ఫస్ట్ నుండి లాస్ట్ వరకు ఆడియన్స్‌ను సీట్ ఎడ్జ్‌లో కూర్చునిపెట్టే థ్రిల్లర్. ఈ అవకాశం ఇచ్చిన నిర్మాతలు నానిగారికి, ప్రశాంతిగారికి, మమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చిన దిల్‌రాజుగారికి థాంక్స్“ అన్నారు.
నిర్మాత ప్రశాంతి త్రిపిర్నేని మాట్లాడుతూ – “వినగానే స్క్రిప్ట్ నచ్చింది. దాదాపు రెండేళ్లు ఈ స్క్రిప్ట్ మీద వర్క్ చేశాం. సినిమా మీద చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నాం. ముఖ్యంగా కంటెంట్ అందరికీ కనెక్ట్ అవుతుందనే నమ్మకం ఉంది“ అన్నారు.
ఎడిటర్ గ్యారీ మాట్లాడుతూ – “ఈ సినిమాలో మీరు కొత్త విశ్వక్‌ను చూస్తారు. తప్పకుండా అందరికీ నచ్చుతుంది“ అన్నారు.
సినిమాటోగ్రాఫర్ మణికందన్ మాట్లాడుతూ – “సినిమా చాలా బాగా వచ్చింది. ఓ కొత్త ఎక్స్‌పీరియెన్స్‌ను ఫీల్ అవుతారు. ప్రతి సీన్ అద్భుతంగా వచ్చింది. అందరూ బాగా ఎంజాయ్ చేసే ఎడ్జ్ ఆఫ్ సీట్ మూవీ“ అన్నారు.
హీరోయిన్ రుహానీశర్మ మాట్లాడుతూ – “మాకు సపోర్ట్ చేయడానికి వచ్చిన దిల్‌రాజుగారికి థాంక్స్. ట్రైలర్లో మీరు చూసిన దానికన్నా సినిమాలో ఇంకా ఎక్కువ థ్రిల్ ఉంటుంది. విశ్వక్‌తో వర్క్ చేయడం చాలా హ్యాపీ. నాని, ప్రశాంతిగారికి పనిచేయడం సంతోషంగా అనిపించింది“ అన్నారు.
నటీనటులు:
విశ్వక్సేన్, రుహానీ శర్మ తదితరులు
సాంకేతిక నిపుణులు:
రచన, దర్శకత్వం: శైలేష్ కొలను
సమర్పణ: నాని
నిర్మాత: ప్రశాంతి త్రిపిర్నేని
మ్యూజిక్: వివేక్‌సాగర్
సినిమాటోగ్రఫీ: మణికందన్
ఆర్ట్: అవినాష్ కొల్ల
ఎడిటర్: గ్యారీ బి.హెచ్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఎస్.వెంకటరత్నం(వెంకట్)
స్టంట్స్: నభా
పబ్లిసిటీ డిజైనర్స్: అనిల్ భాను
పి.ఆర్.ఒ: వంశీ కాకా