Reading Time: 2 mins
పలాస 1978 చిత్రం సక్సెస్ మీట్
 
 
దళిత సమస్య లపై ఒక మంచి చిత్రం తీస్తే దళితు లే పట్టించుకో పోతే ఎలా..? – “పలాస 1978” థాంక్స్ మీట్ లో  ఫైర్ అయిన  తమ్మారెడ్డి భరద్వాజ.
 
రక్షిత్, నక్షత్ర జంటగా కరుణకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘పలాస 1978’. తమ్మారెడ్డి భరద్వాజ సమర్పణలో ధ్యాన్‌ అట్లూరి నిర్మించిన ఈ చిత్రం సురేష్‌ ప్రొడక్షన్స్‌ ద్వారా మార్చి 6న విడుదలై సక్సెస్ ఫుల్ గా ప్రదర్షింపబడుతోంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ సక్సెస్ మీట్ ను ఏర్పాటు చేశారు.
 
” ఒక మంచి సినిమా కావాలి అంటారు..మంచి రివ్యూ లు కావాలి అంటారు..అవన్నీ ఉన్న సినిమా పలాస 1978. దళితులు పాత్ర లు  సినిమాల్లో ఉండవు.. దళిత కథ లు సినిమా గా మారవు అంటారు.. కానీ పలాస లో వారి పాత్రలను హీరో లను చేసాము..వారి సమస్యలను చర్చించాము.. కానీ వారి నుండే స్పందన కరువైంది. మీ సినిమాలు మీరు కూడా చూడక పోతే మీ ఖర్మ. మీరు చూసి ఆశీర్వదిస్తే..మరిన్ని సినిమాలు వస్తాయి..ఇది నా ఆవేదన..నా నలభై ఏళ్ల కెరియర్ లో ఏ సినిమా ఆడినా, అడకపోయినా బాధ పడలేదు..కానీ ఈ సినిమా విషయంలో మేము సక్సెస్ అయ్యాం..కానీ ఈ సినిమా మరింత ముందుకు తీసుకెళ్ళాల్సిన బాధ్యత దళితులదే” అన్నారు
 
డైరెక్టర్ కరుణ కుమార్ మాట్లాడుతూ…
సినిమా చూసిన అందరూ బాగుంది అన్నారు, సినిమా విశ్లేషకులు అందరూ మంచి రేటింగ్స్ ఇచ్చారు. ఈ విజయం మాకు మరిన్ని మంచి సినిమాలు చెయ్యడానికి ధైర్యం ఇచ్చింది. రానున్న రోజుల్లో ఈ సినిమా మరింత సక్సెస్ అవుతుందని భవిస్తూన్నాను అన్నారు. 
 
రఘుకుంచె మాట్లాడుతూ…
 
సినిమా చూసిన అందరూ బాగుంది అంటున్నారు. నిర్మాత మంచి ప్రయత్రం, దర్శకుడి ఆలోచన సినిమాను నిలబెట్టాయి. నటీనటులందరూ బాగా చేశారు, నా పాత్ర గురించి అందరూ ప్రశంశిస్తున్నారు. చిన్న సినిమా అయిన పలాసను పెద్ద విజయం చేసిన ప్రేక్షకులకు ధన్యవాదాలు. అందరూ ఇచ్చిన సహకారంతో ఈ సినిమా ఇంత పెద్ద స్థాయికి వచ్చింది, ఇండస్ట్రీలోని పెద్దలు ఈ సినిమాకు మరింత మాట సాయం చేస్తే బాగుంటుందని తెలిపారు.
 
 హీరోయిన్ నక్షత్ర మాట్లాడుతూ…
 
మీడియా వారందరికీ ధన్యవాదాలు, పలాస సినిమాకు మంచి రేటింగ్స్, రివ్యూస్ వస్తున్నాయి. వైజాగ్ నుండి ఫ్రెండ్స్ కాల్స్ చేసి మెచ్చుకున్నారు. ఇలాంటి సినిమాలు అరుదుగా వస్తుంటాయి, మా సినిమాను ఇంత సక్సెస్ చేసిన ప్రేక్షకులందరికి ధన్యవాదాలు తెలిపారు.
 
హీరో రక్షిత్ మాట్లాడుతూ…
 
సినిమాకు ఇంత మంచి రివ్యూస్ రావడం సంతోషంగా ఉంది, పలాస సినిమా ఇంత పెద్ద హిట్ అవ్వడానికి కారణమైన అందరికి ధన్యవాదాలు. సినిమాలో ప్రతి సీన్ గురించి మాట్లాడుకొవడం చూస్తుంటే ఆనందంగా ఉందన్నారు.
 
చిత్ర సమర్పకుడు తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ 
 
” ఒక మంచి సినిమా కావాలి అంటారు..మంచి రివ్యూ లు కావాలి అంటారు..అవన్నీ ఉన్న సినిమా పలాస 1978. దళితులు పాత్ర లు  సినిమాల్లో ఉండవు.. దళిత కథ లు సినిమా గా మారవు అంటారు.. కానీ పలాస లో వారి పాత్రలను హీరో లను చేసాము..వారి సమస్యలను చర్చించాము.. కానీ వారి నుండే స్పందన కరువైంది. మీ సినిమాలు కూడా మీరు చూడక పోతే మీ ఖర్మ. మీరు చూసి ఆశీర్వదిస్తే..మరిన్ని సినిమాలు వస్తాయి..ఇది నా ఆవేదన.నా ఆవేదన..నా నలభై ఏళ్ల కెరియర్ లో ఏ సినిమా ఆడినా, అడకపోయినా బాధ పడలేదు..కానీ ఈ సినిమా విషయంలో మేము సక్సెస్ అయ్యాం..కానీ ఈ సినిమా మరింత ముందుకు తీసుకెళ్ళాల్సిన బాధ్యత దళితులదే” అన్నారు.
 
రక్షిత్, నక్షత్ర హీరోహీరోయిన్లుగా నటించిన ఈ మూవీలో రఘు కుంచె, తిరువీర్, జనార్థన్, లక్ష్మణ్, శృతి, జగదీష్ ఇతర పాత్రల్లో నటించారు.
 
తమ్మారెడ్డి భరద్వాజ సమర్పించిన ఈ చిత్రాన్ని సురేష్ ప్రొడక్షన్స్ ద్వారా  విడుదల చేశారు.
 
పాటలు : భాస్కర భట్ల, సుద్దాల అశోక్ తేజ, లక్ష్మీ భూపాల, ఎడిటర్ : కోటగిరి వెంకటేశ్వరరావు, సినిమాటోగ్రఫీ : అరుల్ విన్సెంట్, సంగీతం : రఘు కుంచె,
కో ప్రొడ్యూసర్ : మీడియా 9 మనోజ్ 
పి.ఆర్.ఓ : జి.ఎస్.కె మీడియా, 
నిర్మాత : ధ్యాన్ అట్లూరి.  
రచన- దర్శకత్వం : కరుణ కుమార్.