రావికొండల రావు గారికి ఆర్థిక సహాయం
సీనియర్ నటులు శ్రీ రావికొండల రావు గారికి దాత, నిర్మాత శ్రీ చదలవాడ శ్రీనివాసరావు 50,000/- ఆర్థిక సహాయం.
దాత, నిర్మాత శ్రీ చదలవాడ శ్రీనివాసరావు గారు ఇదివరకు ఈ కరోన సమయంలో ఇబ్బందులు పడుతున్న అనేక మంది నిర్మాతలకు, సినీ కార్మికులకు, మీడియా వారికి, యూనియన్ కార్డ్ లేని ఆర్టిస్టులకు సహాయం చెయ్యడం జరిగింది. అందులో భాగంగా సీనియర్ నటులు మరియు విజయ ప్రొడక్షన్స్ లో ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా పని చేసిన రావికొండల రావు ఆర్థిక పరిస్తితులు తెలుసుకొని అతనికి వెంటనే సహాయం చెయ్యాలని శ్రీ ప్రసన్నకుమార్ గారిని, నిర్మాత తుమ్ములపల్లి రామసత్యనారాయణ గారిని పంపించి రావికొండల రావు గారికి 50,000/- ఇప్పించడం జరిగింది.
ఈ సందర్భంగా రావికొండల శ్రీ చదలవాడ శ్రీనివాసరావు గారికి ధన్యవాదాలు తెలిపారు. త్వరలో తనను పర్సనల్ గా కలుస్తానని తెలిపారు. నా ఆపదను తెలుసుకొని నాకు ప్రొడ్యూసర్స్ శ్రీ ప్రసన్న కుమార్, తుమ్ములపల్లి రామసత్యనారాయణ గార్ల ద్వారా చెక్ ఇప్పించి పంపి నన్ను ఆదుకున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు. శ్రీ రావికొండల రావు గారు భైరవదీపం, కృష్ణార్జున యుద్ధం సినిమాలకు కో ప్రొడ్యూసర్ గా చెయ్యడం విశేషం.