Reading Time: < 1 min
“A”(AD  INFINITUM) చిత్రం మోషన్ పోస్టర్ విడుదల
 
 
సరిక్రొత్త థ్రిల్లర్ “A”(AD  INFINITUM) చిత్రం మోషన్ పోస్టర్ ను విడుదల చేసిన జగపతిబాబు
 
యుగంధర్ ముని దర్శకత్వం వహించిన “A”(AD  INFINITUM) ఈ చిత్రం యెక్క మోషన్ పోస్టర్ ను  జగపతిబాబు విడుదల చేశారు. మొదటి నుంచి ఈ చిత్ర బృందం విడుదల చేసిన టైటిల్ పోస్టర్, ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రేక్షకులలో ఎంతో ఆశక్తిని పెంచుతూవచ్చాయి, ఇప్పుడు విడుదల చేసిన  మోషన్ పోస్టర్ కూడా ప్రేక్షకులలో ఎక్స్ ఫర్టేషన్ ను మరింత పెంచేలా వుంది. 
 
త్వరలోనే టీజర్ ను విడుదల చేస్తామని చిత్ర బృందం తెలిపింది. ఖచ్చితంగా రాబోయే టీజర్ కూడా ప్రేక్షకుల అంచనాలను మించి ఉండవచ్చు అనిపిస్తుంది. యుగంధర్ ముని మేకింగ్ స్టైల్ చూస్తుంటే నిజంగానే అతను లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కి ఏకలవ్య శిష్యుడు లా వున్నాడు. ఫిల్మ్ స్కూల్ నేపథ్యం నుండి వచ్చిన దర్శకుడు తన జట్టును కూడా అదే తరహాలో  ఎన్నుకున్నాడు. కెమెరా మెన్  ప్రవీణ్ కె బంగారి (ఎస్‌ఆర్‌ఎఫ్‌టిఐ), సౌండ్ డిజైన్ బినిల్ అమక్కాడు (ఎస్‌ఆర్‌ఎఫ్‌టిఐ), సౌండ్ మిక్సింగ్ సినాయ్ జోసెఫ్ (నేషనల్ ఫిల్మ్ అవార్డు విన్నర్) మరియు ఆనంద్ పవన్ & మణికందన్ ఎడిటింగ్ (ఎఫ్‌టిఐఐ).  చిత్రం లోని  అన్ని పాటలను  అనంత శ్రీరామ్ వ్రాయగా దీపు మరియూ పావని ఆలపించారు  దీనికి సంగీతం విజయ్ కూరాకుల. 
 
తన తొలి చిత్రంలోనే నితిన్ ప్రసన్న  3 విభిన్నమైన పాత్రలు పోషించే సవాలును స్వీకరించారు, మరియు మళ్ళీరావా, ప్రెషర్ కుక్కర్ లలో పక్కింటి అమ్మాయిగా కనిపించిన హీరోయిన్ ప్రీతి అశ్రాని  పూర్తిగా భిన్నమైన పాత్రను పోషిస్తుంది.