Reading Time: 2 mins

మొక్కలు నాటిన హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను స్వీకరించి మొక్కలు నాటిన ప్రముఖ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ మూడో విడత కార్యక్రమం చాలా అద్భుతంగా ముందుకు పోతుంది తెలుగు చిత్ర పరిశ్రమకు సంబంధించిన ప్రముఖులే  కాకుండా హాలీవుడ్; బాలీవుడ్ చిత్ర పరిశ్రమకు సంబంధించిన ప్రముఖులు ఈ ఛాలెంజ్ ను స్వీకరించి మొక్కలు నాటడానికి ఉత్సాహంగా ముందుకు వచ్చి తము మొక్కలు నాటిన విషయాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకోవడం జరుగుతుంది.

అందులో భాగంగానే ప్రముఖ హీరోయిన్ కళ్యాణి ప్రియదర్శిని ఇచ్చిన చాలెంజ్ ను స్వీకరించిన అనుపమ పరమేశ్వరన్ ఈరోజు కేరళలోని తిరుచూరు లో తన నివాసంలో ఒక మొక్కను నాటడం జరిగింది.

ఈ సందర్భంగా తన అభిప్రాయాన్ని  ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లో చెప్పడం జరిగింది. నేను గత కొన్ని రోజుల క్రితమే 25 మొక్కలు నాటడం జరిగింది అని అందులో 23 మొక్కలు మంచిగా బతికాయి అని రెండు మొక్కలు మాత్రం చనిపోవడం జరిగింది అని ఆ రెండు మొక్కలు చనిపోయినప్పుడు నాకు చాలా బాధ కలిగిందని. ఇంతలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ద్వారా నాకు మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు అని. చాలా సంతోషంగా ఈ చాలెంజ్ ను స్వీకరించి ఈరోజు మా ఇంటి ఆవరణంలో ఒక మొక్క నాటడం జరిగిందని. మా ఇంటి ఆవరణంలో ఎక్కువ ఖాళీ స్థలం లేని కారణంగా ఒక మొక్కను మాత్రమే నాటడం జరిగింది అని. తప్పకుండా నీను ప్రమాణం చేస్తున్నాను మిగతా మొక్కలను కూడా త్వరలోనే నాటడం జరుగుతుంది అని తెలిపాది. ఇంతమంచి కార్యక్రమం చేపట్టిన రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ గారికి కృతజ్ఞతలు తెలిపారు. ఇదేవిధంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్  ముందుకు కొనసాగాలని అందరు బాధ్యతగా మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు.  నీను ఈ సందర్భంగా మరొక 12 మందిని మొక్కలు నాటాలని చాలెంజ్ లో  కోరుతున్నానని కాళిదాస్ జయరామ్; నివితా థామస్;ఆహన  కృష్ణ ;  రాజీష్ విజయాన్; పద్మ సౌర్య; పిరలే మాన్య; గౌరీ కృష్ణ; గౌతమి నైరి; సిజ్జు విల్సన్;అను సితార; సితార కృష్ణ శంకర్; లక్ష్మీ ప్రియ విశాకు లను గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స్వీకరించి మొక్కలు నాటాలని అదే విధంగా ఈ చాలెంజ్ ను ముందుకు తీసుకుపోవాలని విజ్ఞప్తి చేశారు.