Reading Time: 2 mins
సంతోషం అవార్డ్స్ ఫంక్షన్ కాస్త ఆలస్యం
 
ఈసారి తక్కువ మంది తోనే సంతోషం అవార్డ్స్ ఫంక్షన్ : సురేష్ కొండేటి
(19వ సంవత్సరం లోకి ఎంటరైన ‘సంతోషం’ విజ‌య ప్ర‌యాణం)
 
ఈ క‌రోనా సంక్షోభంలో అసలు సంతోషం అవార్డ్స్ ఫంక్షన్ ఉంటుందా అనేది అందరికీ ఓ ప్రశ్నార్థకంగా మిగిలింది  ఈ విషయమై సురేష్ కొండేటి స్పందిస్తూ “ప్రతి ఏడాది సంతోషం అవార్డ్స్ ఫంక్షన్ ఎప్పుడు అనేది ఆగస్టు 2వ తేదీన ప్రకటించడం జరిగేది అదే రోజు కర్టెన్ రైజర్ ఫంక్షన్ కూడా చేసుకోవడం జరిగేది. ఈ కరోనా మహమ్మారి కారణంగా ఈసారి సంతోషం అవార్డ్స్ ఫంక్షన్ కాస్త ఆలస్యం అవుతుంది. సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ తక్కువ మంది తో ఫంక్షన్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాం. ఎప్పుడు ఎక్కడ ఎలా అనేది అతి త్వరలోనే ప్రకటిస్తాం. ప్రతి ఏడాది సంతోషం అవార్డ్స్ ఫంక్షన్ లో పేద కళాకారులకు సహాయం చేస్తూ రావడం జరిగింది ఈ  కరోనా మహమ్మారి కారణంగా చాలామంది ఇబ్బంది పడుతున్నారు అనే విషయాన్ని దృష్టిలో ఉంచుకొని కేవలం సంబరాలకే పరిమితం కాకుండా పరిశ్రమలోని కొంతమందికి సహాయం చేసే విధంగా ఈసారి ఈవెంట్ చేయాలనుకుంటున్నాం” అన్నారు.
 
ఆయన ఇంకా మాట్లాడుతూ “‘సంతోషం’ సినీ వార‌ప‌త్రిక 18 సంవ‌త్సరాలు పూర్తి చేసుకుని 19వ సంవ‌త్స‌రంలోకి ఆదివారం రోజు రెండవ తేదీ ఆగస్టు 2020న  అడుగుపెడుతున్న శుభ‌వేళ‌ మైనారిటీ తీరి, ఇక మేజ‌ర్లు అయిపోయాం -. ప‌త్రిక పేరులో ఎంత ‘సంతోషం’ ఉందో, ఈ ప‌త్రిక‌కి  ఇంట‌ర్వ్యూలు ఇచ్చిన‌వాళ్ళు, వార్త‌లు ఇచ్చిన‌వాళ్ళు, ప్ర‌క‌ట‌న‌లు ఇచ్చిన‌వాళ్ళు అంతే ‘సంతోషం’గా ఉండాలి. సినిమా వార్త‌లు చ‌దివిన పాఠ‌కులు, ప్రేక్ష‌కులు ఆ క‌బుర్లు, ముచ్చ‌ట్లతో సంతోష ప‌డాలి. పాజిటివ్ ఎన‌ర్జీ, పాజిటివ్ థాట్స్‌, పాజిటివ్ వైబ్స్‌, ప‌దిమందితో పంచుకోవాల‌నే ఏకైక సంక‌ల్పంతో ‘సంతోషం’ ప‌త్రిక 18 సంవ‌త్స‌రాల నుంచి ముందుకు సాగుతోంది. ఈరోజు 19 వ సంవత్సరంలోకి అడుగుపెట్టింది.  ఈ క‌రోనా సంక్షోభంలో ప్రారంభించిన సంతోషం టుడే టాప్ ఫిలిమ్ న్యూస్‌లో తెలుగు సినిమా రంగం వార్త‌ల‌తో పాటు త‌మిళ‌, మ‌ళ‌యాళ‌, క‌న్న‌డ, హిందీ సినిమా వార్త‌లు అప్‌డేట్‌గా అందిస్తున్నాం.
 
‘సంతోషం’‌  ఓ స‌మాచారం కాదు త‌ర‌త‌రాల‌కు నిల‌బ‌డే ఓ సినిమా స‌త్యం. ‘సంతోషం’‌  సినీ వార‌ప‌త్రిక కేవలం ఓ వ్యాపారం కాదు  సినీ ప‌రిశ్ర‌మ‌కు, అభిమానుల‌కు మ‌ధ్య వార‌ధి.
ప‌ద్దెనిమిదేళ్ళు కాదు – పాతికేళ్ళు, యాభై ఏళ్ళు తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ ఎంత‌కాలం ఉంటుందో అంత‌కాలం సినిమా నీడ‌గా ‘సంతోషం’‌  ప‌త్రిక ఉంటుంది. ఇది త‌థ్యం. ఇది మా ఆశ‌యం – ఇది మీ ఆశీర్వ‌చ‌నం” అన్నారు.