కపటధారి ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ విడుదల
కపటధారి’ ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ విడుదల చేసిన యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య
మళ్ళీరావా, సుబ్రహ్మణ్యపురం, ఇదంజగత్ .. ఇలా వరుస హిట్ చిత్రాలతో హీరో సుమంత్ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. ఇప్పుడు సుమంత్ కథానాయకుడిగా క్రియేటివ్ ఎంటర్‌టైనర్ మరియు డిస్ట్రిబ్యూటర్ అధినేత జి.ధనంజయన్ సమర్పణలో లలితా ధనంజయన్ నిర్మిస్తోన్న సస్పెన్స్ థ్రిల్లర్ ‘కపటధారి’. ‘కిల్లర్’ వంటి సక్సెస్‌ఫుల్ చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు ప్రదీప్ కృష్ణమూర్తి ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నారు. సోమవారం ఈ సినిమా ఫస్ట్‌లుక్, మోషన్ పోస్టర్‌ను యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య విడుదల చేశారు. సినిమా పెద్ద సక్సెస్ కావాలని ఎంటైర్ యూనిట్‌కు అభినందనలు తెలిపారు నాగచైతన్య.
ఫస్ట్‌లుక్ చూస్తే సుమంత్ లుక్ చాలా ఇన్‌టెన్స్‌గా కనిపిస్తుంది. ఆయన ట్రాఫిక్ పోలీస్ గెటప్‌లో కనపడుతున్నారు. ఆర్టికల్ 352 అని కూడా పోస్టర్‌లో కనిపిస్తోంది. అంటే ఈ ఆర్టికల్ 352 దేని గురించి చెబుతుందనేది ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం సినిమా చిత్రీకరణ పూర్తయ్యిందని, నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయని నిర్మాతలు తెలిపారు.
సుమంత్, నాజర్, నందితా శ్వేత, జయప్రకాష్, వెన్నెలకిషోర్, సుమన్ రంగనాథ్, సంపత్ తదితరులు నటిస్తోన్న ఈ చిత్రానికి సంగీతం: సైమన్ కె.కింగ్, సినిమాటోగ్రఫీ: రాసామది, ఆర్ట్: విదేశ్, ఎడిటర్: ప్రవీణ్ కె.ఎల్, స్క్రీన్ ప్లే అడాప్షన్: డా.జి.ధనుంజయన్, డైలాగ్స్: భాష్యశ్రీ, సంట్స్: సిల్వ, కీతి వాసన్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఎన్.సుబ్రమణియన్, క్రియేటివ్ ప్రొడ్యూసర్: డా.జి.ధనంజయన్, నిర్మాత: లలితా ధనంజయన్, దర్శకత్వం: ప్రదీప్ కృష్ణమూర్తి.