బొమ్మ బ్లాక్ బస్టర్ చిత్రo ఫస్ట్ లుక్ విడుదల
హీరో నందు పుట్టినరోజు సందర్భంగా బొమ్మ బ్లాక్ బస్టర్ చిత్ర ఫస్ట్ లుక్ విడుదల చేసిన విశ్వక్ సేన్
యంగ్ టాలెంటెడ్ హీరో నందు విజయ కృష్ణ మరియు రష్మీ గౌతమ్ కలయికలో వస్తున్న తాజా చిత్రం “బొమ్మ బ్లాక్ బస్టర్ష. ఈ రోజు నందు పుట్టిన రోజు సందర్భంగా నందు ని ‘పోతురాజు’ గా పరిచయం చేస్తూ ‘మాస్ కా దాస్’ విశ్వక్ సేన్ ఈ చిత్ర ఫస్ట్ లుక్ ను విడుదల చేసారు. విజయీభవ ఆర్ట్స్ పతాకంపై నిర్మించబడిన ఈ చిత్రంలో హీరో నందు ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ కి అభిమానిగా నటిస్తున్నారు. ఈ క్యారెక్టర్ చాలా వైవిధ్యంగా ఉండబోతుందని చిత్ర వర్గాలు చెబుతున్నాయి. పోతురాజుగా కనిపించబోతున్న నందు క్యారెక్టర్ కి ధిటుగానే హీరోయిన్ రష్మీ గౌతమ్ క్యారెక్టర్ ఉంటుందని, దీనికి సంబంధించిన వివరాల్ని అతి త్వరలోనే ప్రకటించబోతున్నారు. ఈ సినిమాతో రాజ్ విరాట్ దర్శకునిగా చిత్ర సీమకు పరిచయం అవుతున్నారు. ఈ చిత్రం షూటింగ్ తో అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని విడదులకు సిద్ధంగా ఉందిని చిత్ర నిర్మాతలు ప్రవీణ్ పగడాల, బోసుబాబు నిడుమోలు, ఆనంద్ రెడ్డి మద్ది, మనోహర్ రెడ్డి యెడ తెలిపారు.
నటీనటులు
నందు ఆనంద్ కృష్ణ, రష్మీ గౌతమ్
సాంకేతిక వర్గం
పీ.ఆర్.ఓ : ఏలూరు శ్రీను
పబ్లిసిటీ డిజైన్స్ : ధని ఏలే
ఎడిటర్ : బి. సుభాష్కర్
సినిమాటోగ్రఫీ : సుజాతా సిద్ధార్థ్
మ్యూజిక్ : ప్రశాంత్ ఆర్. విహారి
నిర్మాతలు : ప్రవీణ్ పగడాల, బోసుబాబు నిడుమోలు, ఆనంద్ రెడ్డి మద్ది, మనోహర్ రెడ్డి యెడ
రచన – దర్శకత్వం : రాజ్ విరాట్