శర్వానంద్ హీరోగా అజయ్ భూపతి దర్శకత్వంలో మహాసముద్రం చిత్రం
శర్వానంద్ హీరోగా, అజయ్ భూపతి దర్శకత్వంలో ఎ.కె. ఎంటర్‌టైన్‌మెంట్స్ చిత్రం మహాసముద్రం
‘ప్రస్థానం’, ‘గమ్యం’ చిత్రాల తర్వాత వెర్సటైల్ యాక్టర్ శర్వానంద్ చిరకాలం గుర్తుండిపోయే ఉద్వేగభరితమైన, బలమైన పాత్రను చేసేందుకు సిద్ధమవుతున్నారు. అజయ్ భూపతి డైరెక్ట్ చేసే ఆ క్రేజీ ఫిల్మ్ టైటిల్ ‘మహా సముద్రం’. ఇందులో ఛాలెంజింగ్ రోల్‌ను చేయబోతున్నందుకు శర్వానంద్ అమితోత్సాహంతో ఉన్నారు.
‘మహాసముద్రం’ చిత్రాన్ని సోమవారం అధికారికంగా ప్రకటించారు. ఆసక్తికరంగా అనిపిస్తున్న టైటిల్‌తో ఈ సినిమా నవరసభరితమైన ఎంటర్‌టైనర్‌గా రూపొందనున్నది.
సూపర్‌స్టార్ మహేష్‌బాబుతో ‘సరిలేరు నీకెవ్వరు’ లాంటి భారీ బ్లాక్‌బస్టర్‌ను నిర్మించిన ఎ.కె. ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ ‘మహాసముద్రం’ చిత్రాన్ని నిర్మిస్తోంది.
తొలి చిత్రం ‘ఆర్ఎక్స్ 100’తో ప్రేక్షకులను ఆశ్చర్యపరిచిన అజయ్ భూపతి, మరోసారి ఆడియెన్స్‌ను అబ్బురపరిచే పవర్‌ఫుల్ స్క్రిప్టును ఈ సినిమా కోసం రెడీ చేశారు.
ఇంటెన్స్ లవ్-యాక్షన్ డ్రామాగా తయారయ్యే ఈ చిత్రాన్ని సుంకర రామబ్రహ్మం తెలుగు, తమిళ ద్విభాషా చిత్రంగా నిర్మిస్తున్నారు.
ఈ సినిమాకు సంబంధించి ప్రతి వారం ఆశ్చర్యపరిచే ఏదో ఒక సంచలన ప్రకటన వెలువడనున్నది.