అల్లు వారి అల్లు స్టూడియోస్ నిర్మాణానికి శ్రీకారం
అక్టోబర్ 1న పద్మశ్రీ డాక్టర్ శ్రీ అల్లు రామలింగయ్య గారి 99 వ పుట్టినరోజు సందర్బంగా అల్లు వారి అల్లు స్టూడియోస్ ప్రారంభం
తెలుగు ప్రేక్షకులకు… తెలుగు సినిమా బతికున్నంతకాలం గుర్తుండిపోయే పేరు పద్మశ్రీ డాక్టర్ శ్రీ అల్లు రామలింగయ్య గారు. హాస్యం ఆయన కేరాఫ్ ఆడ్రస్, హాస్యానికే ప్రాణం పోసిన బ్రహ్మ ఆయన.. అన్ని రసాల్లో హస్యానికి పెద్దపీట వేశారు కాని ఏ పాత్రనైనా అలఓకగా చేసి చూపించిన గొప్ప నటుడు అల్లు రామలింగయ్య గారు. 1000 కి పైగా చిత్రాల్లో నటించి తెలుగు సినిమా పరిశ్రమకి మార్గదర్శకుడయ్యాడు.
ఆయన తెరపై కనిపిస్తే పాత్ర కనపిస్తుందికాని ఆయన కనిపించరు. నటనకి నిలువెత్తు రూపం శ్రీ అల్లు రామలింగయ్య గారు అంటే అతిశయెక్తికాదు. తెలుగు సినిమా చరిత్ర లో గర్వించదగ్గ గొప్ప క్లాసిక్స్ లో అల్లు రామలింగయ్య గారి పాత్రలు వుండటం విశేషం. హోమియోపతి డాక్టర్ గా పలు సేవాకార్యక్రమాలు అందించారు, తరువాత తెలుగు సినీ పరిశ్రమలో నటుడుగా ఎంత బిజీ గా వున్నా కూడా తన వృత్తి హోమియోపతి ని మాత్రం వదల్లేదు. వీలున్నప్పుడల్లా సినిమా నటీనటులకి కూడా తన వైద్యాన్ని అందించారు.
శ్రీ అల్లు రామలింగయ్య గారికి ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు. అల్లు రామలింగయ్య కుమారుడు శ్రీ అల్లు అరవింద్ గారు నిర్మాతగా ఇండియాలోనే పేరుప్రఖ్యాతలు సాధించారు. ఆయన మనవడు అల్లు అర్జున్ తెలుగు వారి గుండెల్లో స్టైలిస్‌స్టార్ గా చెరగని స్థానం సంపాదించారు.
తెలుగు సినిమా ప్రతిష్ట కి అల్లు ఫ్యామిలీ ఒక మూలస్థంభం అని చెప్పాలి.
ఇంతటి ఘనచరిత్ర కలిగిన శ్రీ అల్లు రామలింగయ్య గారు 1 అక్టోబర్ 1922 న జన్మించారు. ఆయన ఈ సంవత్సరం తో 99 సంవత్సరాలు పూర్తిచేసుకుని 2021 సంవత్సరంలో 100 సంవత్సరాల మైల్ స్టోన్ లోకి అడుగుపెడతారు.
అయితే ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకుని కుమారుడు శ్రీ అల్లు అరవింద్ గారు, మనవళ్ళు అల్లు వెంకటేష్, అల్లు అర్జున్ మరియు అల్లు శిరీష్ లు, శ్రీ అల్లు రామలింగయ్య గారి చిత్రపటానికి నివాళులు అర్పించారు, అలానే వీరందరి నిర్వహణ లో అల్లు స్టూడియోస్ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. శ్రీ అల్లురామలింగయ్య గారి వ్యవస్ధాపకులుగా స్టాపించిన గీతాఆర్ట్స్ బ్యానర్ లో గత 48 సంవత్సరాలుగా అనేక చిత్రాలు నిర్మించారు. ఇప్పడు అల్లు వారు మరో స్టెప్ ముందుకేసి అల్లు స్టూడియోస్ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. అల్లు స్టూడియోలో ఎలాంటి లెటెస్ట్ టెక్నాలజి వుండబోతుంది, ఎంలాంటి సదుపాయాలు వుండబోతున్నాయి అనే విషయాలు త్వరలో తెలియజేస్తారు.