నిశ్శబ్దం మూవీ రివ్యూ
అనుష్క ‘నిశ్శబ్దం’ రివ్యూ
Rating:2/5
సాక్షి (అనుష్క) తన కాబోయే భర్త ఆంథోని (మాధవన్) తో కలిసి రిలాక్స్ అవటానికి వెకేషన్ కు వెళ్తుంది. అయితే సాక్షి ఆర్టిస్ట్ అవటంతో …ఆ జర్నీలో ఓ హాంటెడ్ హౌస్ లో ఉన్న ఓ పెయింటింగ్ తెచ్చుకోవాలని ఆశ పడుతుంది. సర్లే అని కాబోయే భార్య కోరిక తీరుద్దామని ఆంథోని ,ఆమెను తీసుకుని ఆ ఇంట్లోకి వెళ్తాడు. అయితే ఆ హాంటెడ్ హౌస్ లో గతంలో చాలా ఏళ్ల క్రితం జరిగిన సీనే రిపీట్ అవుతుంది. ఆంథోని దారుణంగా ఆ ఇంట్లో హత్య చేయబడతాడు. లక్కీగా సాక్షి అక్కడ నుంచి తప్పించుకుంటుంది. ఆంథోని పెద్ద సెలబ్రిటీ మ్యుజీషియన్.. మిలియనీర్ కావటంతో ఈ కేసు సెన్సేషన్ అవుతుంది. అక్కడేం జరిగిందో చెప్పలేకపోతుంది సాక్షి.
ఆమె మూగ, చెవుడు అయినా ఆమె నుంచి ఇన్ఫర్మేషన్ లాగటానికి పోలీస్ లు ప్రయత్నిస్తారు. ఆ తర్వాత ఆ కేసుని పోలీస్ డిపార్టమెంట్ లో డిటెక్టివ్ గా పనిచేస్తున్న తెలుగు అమ్మాయి మహా (అంజలి) ఇన్విస్టిగేట్ చేయటం మొదలెడుతుంది. మహా కి తోడుగా కెప్టెన్ రిచ్చర్డ్ (హాలీవుడ్ బ్లాక్ బస్టర్ ‘కిల్ బిల్’ ఫేమ్ మైఖేల్ మ్యాడ్సన్ )తోడుగా ఉంటాడు. వీళ్దిద్దరూ కలిసి ఈ కేసుని ఎలా డీల్ చేసి ఆంథోని హత్యను ఎలా ఛేదించారు. ఇందులో సాక్షి పాత్ర ఏమిటి…సాక్షి స్నేహితురాలు సోనాలి (షాలినీ పాండే) క్యారక్టర్ ఏమటి వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
స్క్రీన్ ప్లే ఎనాలసిస్ …
హారర్ గా బిల్డప్ ఇస్తూ థ్రిల్లర్ గా టర్న్ తీసుకున్న కథ ఇది. ఇలాంటి స్క్రిప్టులకు టైట్ గా ఉండే స్క్రీన్ ప్లే అవసరం. కథలో ఒక్కో పొర నైపుణ్యంగా తీస్తూ ముందుకు వెళ్లాలి. ఈ కథలో ట్విస్ట్ లు అయితే బాగున్నాయి కానీ వాటిని పేర్చిన విధానం..ఇంట్రస్టింగ్ గా అనిపించదు. సినిమా థ్రిల్లింగ్ గా ఎక్కడా అనిపించదు. ముఖ్యంగా కథని డైరక్టర్ పాయింటాఫ్ వ్యూలో చెప్దామన్న ప్రయత్నం బెడిసికొట్టినట్లు అర్దమవుతుంది. అనుష్క ఎంటర్ అవగానే ఆమె వైపుకు మన దృష్టి మరిలి..ఆమెను ఫాలో అవటం మొదలెడతాము. అయితే ఆమె మనస్సులో ఏముందో..ఏమనుకుంటుందో..అసలు ఏం జరుగుతోందో ఆమె కు కూడా తెలియదు అన్నట్లు నిశ్శబ్దంగా ఉండిపోతుంది. దాంతో ఆమెను ఫాలో అవటం కష్టమనిపిస్తుంది. అనుష్కని ప్రక్కన పెట్టి అంజలిని ఫాలో అవుదామంటే ఆమె వాయిస్ ఓవర్ లో కథను చెప్తూంటుంది. ఇలా చాలా కంగాళిగా స్క్రిప్టుని వండారు. అనుష్క వంటి టెర్రఫిక్ ఆర్టిస్ట్ ని మూగ సాక్షిగా పెట్టుకున్నారే..కానీ ఆమెను కథలో భాగంగా ఉపయోగించుకోలేదు.ఆమె నిశ్శబ్ద ప్రపంచంలోకి మనని ప్రవేశించనివ్వరు.
అంజలి చేసిన మహా పాత్ర చాలా తెలివైన పోలీస్ డిటెక్టివ్ అని చెప్తారు.అయితే ఆమె చర్యలు ఏమీ దాన్ని ఎస్టాబ్లిష్ చేయవు. ఆమె వాయిస్ ఓవర్ తో కథను ముందుకు నడిపించటానికి ప్రయత్నం చేసారే కానీ ఆమె పాత్రతో సాధించిందేమీ లేదు. ఇక శ్రీనివాస్ అవసరాల ఎందుకు సినిమాలో కనిపించారో ఆ దర్శకుడుకే తెలియాలి. షాలినీపాండే మాత్రం తన నటనతో ఉన్నంతసేపు దృష్టిని తనవైపు తిప్పుకుంది. చాలా ఆశ్చర్యంగా మాధవన్ పాత్ర సాగుతుంది. సెలబ్రెటీ మ్యూజిషియన్ గా మాధవన్ ఆ పాత్రకు న్యాయం చేసినా, డబ్బింగ్ దెబ్బకొట్టింది.
టెక్నికల్ గా ..
గోపి సుందర్ స్వరపరిచిన పాటల్లో రెండు బాగున్నాయి. గిరిష్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా సినిమాకు బాగా ప్లస్ అయ్యింది. షానిల్ డియో సినిమాటోగ్రఫి ..సినిమాకు హాలీవుడ్ స్టైల్ తెచ్చిపెట్టింది. కోన వెంకట్ రాసిన డైలాగ్స్ కొన్ని చోట్ల బాగున్నాయి.ప్రవీణ్ పూడి ఎడిటింగ్ ..ఫెరఫెక్ట్.
చూడచ్చా
మీకు సహనం, ఓపిక ఎక్కువ అయితే… ఓ లుక్కేయచ్చు
తెర వెనక ముందు..
బ్యానర్స్: కోన ఫిల్మ్ కార్పొరేషన్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ
నటీనటులు: అనుష్క, మాధవన్, అంజలి, షాలినిపాండే, సుబ్బరాజ్, మైకేల్ మ్యాడ్సన్, అవసరాల శ్రీనివాస్ తదితరులు
సంగీతం: గోపీ సుందర్
బ్యాక్గ్రౌండ్ స్కోర్: గిరీష్.జి
సినిమాటోగ్రఫీ: షానియల్ డియో
ఎడిటింగ్: ప్రవీణ్ పూడి
స్క్రీన్ప్లే, డైలాగ్స్: కోనవెంకట్
కో ప్రొడ్యూసర్: వివేక్ కూచిబొట్ల
నిర్మాత: టీజీ విశ్వప్రసాద్
కథ, దర్శకత్వం: హేమంత్ మధుకర్
ఓటీటి: అమెజాన్ ప్రైమ్ వీడియో
రన్ టైమ్:2 గంటల 5 నిముషాలు
విడుదల తేది: అక్టోబర్ 2