1948-సత్యమేవ జయతే షూటింగ్ దాదాపుగా పూర్తి
ఎం.వై.ఎం. క్రియేషన్స్ పతాకంపై ఈశ్వర్ బాబు.డి దర్శకత్వంలో ఎం.వై.మహర్షి నిర్మిస్తున్న చిత్రం ‘1948-సత్యమేవ జయతే’. అన్ని భారతీయ మరియు ముఖ్య అంతర్జాతీయ భాషల్లో రూపొందుతున్న ఈ చిత్రం షూటింగ్ దాదాపుగా పూర్తయ్యింది.
ఆలేఖ్య శెట్టి, రఘునందన్, (గాంధీ), ఆర్యవర్ధన్ రాజు(గాడ్సే), జెన్నీ, సమ్మెట గాంధీ, ఇంతియాజ్, శరద్ దద్భావల, పి.శ్రీనివాస్ తదితరులు ఈ చిత్రంలో ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.
మహాత్మాగాంధీ హత్యకు గురి కావడానికి 45 రోజుల ముందు నుంచి హత్య తదనంతర పరిణామాల నేపధ్యంలో ఈ చిత్రం తెరకెక్కనుందని, వివాదాలకు తావులేని రీతిలో,మరుగున పడిపోయిన వాస్తవాలు వెలికి తీయడమే లక్ష్యంగా ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నామని నిర్మాత ఎం.వై.మహర్షి తెలిపారు.
11,372 పేజీల రీసెర్చ్ పేపర్స్, 350కి పైగా పుస్తకాలు, 750కి పైచిలుకు ఇంటర్వ్యూలు పరిశోధించి 96 క్యారెక్టర్లు, 114 సీన్స్, 500కి పైగా ప్రొపర్టీస్, 370కి పైగా కాస్ట్యూమ్స్, 500కి పైగా జూనియర్ ఆర్టిస్టులు, 47 లొకేషన్స్ లో 9 షెడ్యూల్స్ లో, ఉన్నత ప్రమాణాలతో జాతీయ, అంతర్జాతీయ భాషల్లో సినిమాను పూర్తి చేశామని డాక్టర్ ఆర్యవర్ధన్ రాజ్ తెలిపారు.
ఈ చిత్రానికి ప్రొడ్యూసర్: సూర్యప్రకాష్ రెడ్డి, కెమెరా: చంద్రశేఖర్ (చెన్నై), కథ- స్క్రీన్ ప్లే- మాటలు డాక్టర్ ఆర్యవర్ధన్ రాజు, సంగీతం గులాబీ ఫేమ్ శశిప్రీతమ్, నిర్మాత: ఎం.వై.ఎం.మహర్షి, దర్శకత్వం: ఈశ్వర్ బాబు.డి