Reading Time: 3 mins
చావు క‌బురు చ‌ల్ల‌గా చిత్రం ఐటెమ్ సాంగ్ విడుద‌ల
 
 
మెగా ప్రొడ్యూస‌ర్  అల్లు అర‌వింద్ గారి స‌మ‌ర్ప‌ణ‌లో వ‌రస విజయాలు అందుకుంటూ సక్సెస్ కు మారుపేరుగా నిలిచిన ‌బన్నీ వాసు నిర్మాత‌గా ఎన‌ర్జిటిక్ యంగ్ హీరో కార్తికేయ‌, లావ‌ణ్య త్రిపాఠి జంట‌గా నూత‌న ద‌ర్శ‌కుడు కౌశిక్ పెగ‌ళ్ల‌పాటి తెర‌కెక్కిస్తున్న చిత్రం ‘చావు క‌బురు చ‌ల్ల‌గా’. ‌
 
ఇప్పటికే విడుదలైన టైటిల్, హీరో కార్తికేయ ‘బ‌స్తి బాల‌రాజు’ ఫ‌స్ట్ లుక్, ఇంట్రో కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది, ఆ త‌రువాత విడుద‌లైన క్యారెక్ట‌ర్ వీడియో, లావణ్య త్రిపాఠి ఫస్ట్ లుక్ కి, టీజ‌ర్ గ్లిమ్ప్స్ కి, మైనేమ్ ఈజ్ రాజు, క‌దిలే కాలాన్ని అడిగా అనే పాటల‌‌కు కూడా అనూహ్య స్పంద‌న ల‌భించింది.
 
ముఖ్యంగా కార్తికేయ గెట‌ప్‌, డైలాగ్ డెలివ‌రి మాడ్యూలేష‌న్ చూస్తే మ‌ళ్లీ చూడాల‌నిపించేలా ఉందంటూ కామెంట్స్ వ‌స్తున్నాయి.
 
ఈ నేప‌థ్యంలో చావు క‌బ‌రు చ‌ల్ల‌గా సినిమా నుంచి అన‌సూయ చిందేసిన‌ ఓ మాస్ ఐటెమ్ సాంగ్ విడుద‌ల చేసారు. ఈ మధ్యే విడుదలైన ప్రోమో సాంగ్‌కు మంచి రెస్పాన్స్ వస్తుంది.
 
పైన ప‌టారం లోన లొటారం అంటూ సాగే మాస్ ఐట‌మ్ సాంగ్ లో కార్తీకేయ‌, అన‌సూయ అదిరిపోయే చిందులేసారు. ప్ర‌స్తుతం ఈ ప్రోమో అన్ని వ‌ర్గాలు ప్రేక్ష‌కుల్ని ఆక‌ట్టుకుంటూ సోష‌ల్ మీడియాలో హ‌ల్ చ‌ల్ చేస్తోంది.
 
తాజాగా మొత్తం పాటను విడుదల చేసారు మేకర్స్. లిరికల్ సాంగ్ రిలీజ్ చేసారు.
 
ఈ సంద‌ర్భంగా చిత్ర ద‌ర్శ‌కుడు కౌశిక్ పెగ‌ళ్ల‌పాటి మాట్లాడుతూ ఇప్ప‌టికే చావు క‌బురు చ‌ల్ల‌గా చిత్రం నుంచి విడుద‌ల చేసిన ప‌బ్లిసిటీ కంటెంట్ కు అనూహ్య స్పంద‌న అంద‌చేసిన మాస్ అభిమానులు అంచ‌నాల‌కు త‌గ్గ‌ట్లుగానే రాబోతున్న పైన ప‌టారం లోన లొటారం పాట‌ను సిద్ధం చేసినట్లుగా తెలిపారు. చావు క‌బురు చ‌ల్ల‌గా చిత్రాన్ని మార్చి 19న భారీ స్థాయిలో విడుద‌ల చేయ‌డానికి నిర్మాత బ‌న్నీ వాసు స‌న్నాహాలు చేస్తున్నారు.
 
ఈ సినిమా పాట‌ల‌ను ప్ర‌ముఖ ఆడియో కంపెనీ ఆదిత్య మ్యూజిక్ వారు విడుద‌ల చేస్తున్నారు.
 
నటీనటులు..
 
కార్తీకేయ‌, లావ‌ణ్య త్రిపాఠి, ఆమ‌ని,ముర‌ళి శ‌ర్మ‌, ర‌జిత‌, భ‌ద్రం, మ‌హేష్‌, ప్ర‌భు త‌దితరులు
 
సాంకేతిక వ‌ర్గం..
 
స‌మ‌ర్ప‌ణ – అల్లు అర‌వింద్
బ్యాన‌ర్ – జీఏ2 పిక్చ‌ర్స్
నిర్మాత – బ‌న్నీ వాసు
దర్శకుడు – కౌశిక్ పెగ‌ళ్ల‌పాటి
ఎడిట‌ర్‌- స‌త్య జి
ఆర్ట్‌ – జి ఎమ్ శేఖ‌ర్‌
మ్యూజిక్ – జేక్స్‌ బిజాయ్
సినిమాటోగ్రాఫ‌ర్ – క‌ర‌మ్ ఛావ్లా
అడిషిన‌ల్ డైలాగ్స్ – శివ కుమార్ భూజుల‌
ఎగ్జిక్యూటివ్ ప్రోడ్యూస‌ర్స్ – రాఘ‌వ క‌రుటూరి, శ‌ర‌త్ చంద్ర నాయిడు
పి ఆర్ ఓ – ఏలూరు శ్రీను, మేఘ‌శ్యామ్
లిరిక‌ల్ వీడియోస్ – క్రేజీ షౌట్
ప్రోడ‌క్ష‌న్ డిజైన‌ర్ – మ‌నిషా ఏ ద‌త్‌
కాస్ట్యూమ్ డిజైన‌ర్ – మౌనా గుమ్మ‌డి
 
 
Female: సాకి
 
పుట్టువేళ తల్లికి నువ్వు పురుటునొప్పివైతివి.. 
గిట్టువేళ ఆలికేమో మనసు నొప్పివైతివా
గిట్టువేళ ఆలికేమో మనసు నొప్పివైతివా..
బట్ట మరకపడితే నువ్వు కొత్త బట్టలంటివీ
ఇప్పుడేమో ఉతకలేని మట్టిబట్ట కడితివా
ఇప్పుడేమో ఉతకలేని మట్టిబట్ట కడితివా..
ఎట్టాగున్నావయ్యో పీటరన్నయ్యో..
నీది ఏదేమైనా సానా గొప్పసావయ్యో..
పుచ్చుతోసి వంగ ఏరినట్టు..
స్వచ్చమంటి నిన్నే స్వామి కోరినాడయ్యో..
 
పల్లవి:
పైన పటారం ఈడ లోన లొటారం.. 
ఇను బాసూ సెబుతానీ లోకమెవ్వారం
ఇను బాసూ సెబుతానీ లోకమెవ్వారం
పైకి బంగారం లోన గూడుపుటారం
కెలికిసూడు తెలిసిపోద్ది అసలు బండారం
కెలికిసూడు తెలిసిపోద్ది అసలు బండారం
 
చరణం 1:
మనుషులు మాయగాళ్లు మచ్చలున్న కేటుగాళ్ళు
కానీ ఎవరుకాళ్లు మనసులున్న గ్రేటుగాళ్లు
నాది నాదిఅన్న స్వార్థమున్న సెడ్డవాళ్లు
నీలా బ్రతకలేని డబ్బులున్న పేదవాళ్ళు
 
కోరస్:
నాకాడ వందుంటే నాయెంటే తిరిగేటోళ్లు
నీకాడ వెయ్యుంటే నామీదే మొరుగుతారూ
సందంట పోతాంటే సూసికూడ పలకనోళ్లు
నీకాడ సొమ్ముంటే ఇంట చేరి పొగుడుతారు
లోకమెంత లోతయ్యో పీటరన్నయ్యో
అది తొవ్వి చూడటానికే ఈ జీవితమయ్యా
 
Male:
తవ్వేకొద్ది వస్తుంటారు 
నిండా ముంచి పోతుంటారు
నాతో నీతో ఉండే సగం దొంగోళ్లేనయ్యా
 
కోరస్:
వి ఆర్ వెరీ హ్యాపీ బాసూ
నువ్వుండేదే సేఫెస్టు ప్లేసూ
వి ఆర్ వెరీ హ్యాపీ బాసూ
నువ్వుండేదే సేఫెస్టు ప్లేసూ
 
Female R పల్లవి: 
పైన పటారం ఈడ లోన లొటారం.. 
ఇను బాసూ సెబుతానీ లోకమెవ్వారం
పైకి బంగారం లోన గూడుపుటారం
కెలికిసూడు తెలిసిపోద్ది అసలు బండారం
 
Female చరణం 2:
కారు బంగళాలు వేలికున్న ఉంగరాలు
ఏవి రావంట సచ్చినాక మనవెంట
నీతో ఉన్నవాళ్లు నిన్నుమోసి కన్నవాళ్లు
వెళ్లిపోతారంట వెలిగినాక సితిమంట
మట్టిమీద నువ్వు కలిసిన బంధాలన్నీ అబద్ధం
మట్టిలోన పిచ్చిపురుగుల జట్టే చివరి ప్రపంచం
 
Male: 
మనిషి తీరు మారదయ్యా పీటరన్నయ్యా
అందుకనే సెబుతున్నా ఇనరాదయ్యా
బాధేలేని బెంగేలేని రేపేంటన్న సింతేలేని
సోటేదైనా ఉన్నాదంటే స్మశానమేరా.. అందుకే 
 
కోరస్:
వి ఆర్ వెరీ హ్యాపీ బాసూ
నువ్వుండేదే సేఫెస్టు ప్లేసూ
 
Female R పల్లవి:
హెయ్.. పైన పటారం ఈడ లోన లొటారం.. 
ఇను బాసూ సెబుతానీ లోకమెవ్వారం
పైకి బంగారం లోన గూడుపుటారం
కెలికిసూడు తెలిసిపోద్ది అసలు బండారం
కెలికిసూడు తెలిసిపోద్ది అసలు బండారం
కెలికిసూడు తెలిసిపోద్ది అసలు బండారం