తలుచుకుంటేనే మనస్సు ఖుషి
‘నన్ను చూడు, ప్రేమా గీమా లాంటి తొక్కలో సెంటిమెంట్లు పెట్టుకోలేదు, అందుకే, ఎంత ఆనందంగా ఉన్నానో…’
‘నువ్వు గుడుంబా సత్తి గారు కావొచ్చు తొక్కలో సత్తి గారు కావచ్చు… బట్ ఐ డోంట్ కేర్…బికాజ్ ఐ యామ్ సిద్దు ..సిద్దార్ద రాయ్… .’
ఇరవై ఏళ్ల క్రితం ఈ డైలాగ్స్ జనంలోకి ఒక్కసారిగా దూసుకొచ్చింది. అప్పటినుంచి ఇప్పటిదాకా దాన్ని తెలుగు వాళ్లు గుర్తు పెట్టుకుని అలవోకగా తమ సొంత డైలాగుల్లా చెప్పేస్తూనే ఉన్నారు. అవునూ ఈ సినిమా ఏదో గుర్తు వచ్చిందా..మర్చిపోయింది ఎప్పుడూ అంటారా..ఓకే ఆ ఖుషీ గురించే ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం. పవన్ కళ్యాణ్ సినీ కెరీర్ మొదలయ్యి పాతిక సంవత్సరాలు అవుతున్న సందర్బంగా ఆయన కెరీర్ లో సూపర్ హిట్స్ ని ఓ సారి గుర్తు చేసుకుందాం. అందులో భాగంగా ఖుషీ ని మనసారా మరోసారి నింపుకుందాం.
పవర్ స్టార్ కళ్యాణ్ కెరీర్ లో పెద్ద హిట్ ఖుషీ సినిమా…ఈ సినిమా సృష్టించిన రికార్డులు లెక్క పెట్టలేనివి. పవన్ తన నటనతో ప్రేక్షకులను కట్టిపడేశాడని అనేలోగా… భూమిక నేను పోటీ ఇచ్చాను కదా అంటుంది. ఈ సినిమాను ఎస్‌జే సూర్య దర్శకత్వం వహించారు. 2001 సంవత్సరం ఏప్రిల్ 27 తేదీ రిలీజ్ అయ్యిన ఈ చిత్రం సూపర్ హిట్ తమిళ మూవీ “ఖుషి” కి తెలుగు రీమేక్ . “ఖుషి”మూవీ లో హీరో పవన్ కళ్యాణ్ స్టైల్ , మేనరిజం ఆనాటి యూత్ పై బలమైన ముద్ర వేశాయి. హీరోగా పవన్ కళ్యాణ్ కు “ఖుషి “మూవీ ట్రెండ్ సెట్టర్ గా నిలిచింది. అప్పటిదాకా పవన్ కళ్యాణ్ అంటే చిరంజీవి తమ్ముడుగానే గుర్తించేవారు. కానీ ఈ సినిమా తర్వాత పవన్ కళ్యాణ్ యూత్ ఐకాన్ గా మారిపోయారు. ఓ జనరేషన్ మొత్తాన్ని తనదైన స్టైల్స్ తో ఇన్ఫూలియన్స్ చేయగలిగారు. ఈ సినిమాలో భూమిక బొడ్డు చూపించే సీన్ ఎంత పాపులర్ అంటే… ఇప్పటికీ కొన్ని సినిమాల్లో ఇమేటేట్ చేస్తున్నారు.
ఈ సినిమా స్టోరీ లైన్ ఏంటంటే…కలకత్తా లోని ఒక డబ్బున్న ఫ్యామిలీకి చెందిన సిద్ధూ సిద్ధార్థ రాయ్(పవన్ కళ్యాణ్)…పెద్ద చదువుల కోసం కెనడా బయలు దేరుతాడు. కానీ విధికు అలా వెళ్లటం ఇష్టం లేదు. ఎయిర్ పోర్ట్ కి వెళ్ళే దారిలో రోడ్డు ప్రమాదానికి గురవుతాడు. దీంతో హైదరాబాదులోని ఉస్మానియా విశ్వవిద్యాలయంలో జాయిన్ అవ్వాల్సి వస్తుంది. అలాగే కైకలూరు లోని ఉన్నత కుటుంబానికి చెందిన మధుమిత(భూమిక)కి పెళ్లిచూపులు జరుగుతుంటాయి. కానీ, ఆ పెళ్లి కొడుకు తాను ప్రేమించిన అమ్మాయితో వెళ్తున్నానని లేఖ రాయటంతో.. ఆ పెళ్ళి చూపులు కాన్సిల్ అవుతాయి. దీంతో మధు కూడా హయ్యిర్ స్టడీస్ కోసం అదే విశ్వవిద్యాలయంలో చేరుతుంది. అలా ఆ క్యాంపస్ లో పరిచయమైన సిద్ధు, మధులు స్నేహితులుగా మారిపోతారు. వీరిద్దరికు ఇద్దరు ప్రెండ్స్. వాళ్లిద్దరు ప్రేమికులు కావటంతో.. వారికి సాయం చేయడం కోసం సిద్ధూ- మధు ఒకరికొకరు దగ్గరవుతారు. అయితే ఈ క్రమంలో వీళ్లిద్దరూ ప్రేమలో పడతారు. తమ మనసులో ఒకరి పై ఒకరికి ప్రేమ ఉన్నా దానిని చెప్పడానికి ఆలోచిస్తుంటారు. ఇద్దరిదీ దూకుడు మనస్తత్వమే. దాంతో ఇద్దరు ఎప్పుడూ గిల్లికజ్జాలు, దెబ్బలాటలు. ఈ క్రమంలో ఆ యూనివర్శిటీ వదిలేలోగా వీళ్లద్దరూ మరలా ఎలా కలిశారు? ఒకటయ్యారు…అనేదే ఈ సినిమాలో క్లైమాక్స్.
అమ్మాయే సన్నగా
యే మేరా జహా
చెలియ చెలియ
ప్రేమంటే సులువు కాదురా
గజ్జె ఘల్లు మన్నాదిరో
ఇలా ఈ సినిమాకు మణిశర్మ స్వరకల్పన చేసిన సాంగ్స్ అన్నీ సూపర్ హిట్. అవి ప్రేక్షకులకు వీనుల విందు చేశాయనటంలో సందేహం లేదు. హైలెట్ లో ..“ఖుషి “మూవీ లో హీరోయిన్ నడుముని చూసే సీన్ ప్రధానం.
ఈ సినిమా విశేషాలకు వస్తే…. తమిళ వెర్షన్ ని తెలుగులో పవన్ కళ్యాణ్ పాయింటాఫ్ లో కొన్ని సీన్స్ మార్చిరాసారు. అలాగే కేకేతో మణి శర్మ మొదటి సారి పాడించిన హిందీ సాంగ్ `యే మేరా జహాన్ ..` తెలుగు చిత్ర రంగంలో నే తొలి ప్రయోగంగా చెప్తారు. ఈ పాట పెద్ద హిట్. అలాగే సెకాండాఫ్ లో వచ్చే కార్నివాల్ ఫైట్ సీన్స్‌కి పవన్ కళ్యాణ్ స్వయంగా కొరియోగ్రఫీ చేసారు. ఓల్ట్ క్లాసిక్ మిస్సమ్మ లోని ఆడువారి మాటలకు అర్ధాలే వేరులే పాటను ఈ చిత్రంలో రీ-మిక్స్ చేశారు. అలాగే బై బై యే బంగారు రమణమ్మ, రంగబోతి ఓ రంగబోతి వంటి జానపద గీతాలను ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ స్వయంగా పాడటం విశేషం. ఈ సినిమాలో కీలకమైన పాత్రలో డైరక్టర్ ఎస్. జే. సూర్య కనిపిస్తాడు. తమిళం, తెలుగులోనూ ఆయన నటించారు. ఈ చిత్రానికి కాస్ట్యూమ్ లను రేణు దేశాయ్ రూపొందించారు.
కలెక్షన్ల పరంగా చూస్తే.. అయితే పవన్ కళ్యాణ్ ఖుషి మొత్తంగా 21 కోట్లపైగా షేర్ కలెక్ట్ చేసింది. 79 సెంటర్లలో 100 రోజులు ఆడింది. అలాగే 8 కేంద్రాల్లో 175 రోజులు ఆడింది. ఇలా మరెన్నో రికార్డులను క్రియోట్ చేసి పవన్ కెరీర్ లో బెస్ట్ మూవీగా నిలిచిపోయింది.