దర్శకుడు కళ్యాణ్ కృష్ణ తదుపరి చిత్రం
అగ్ర నిర్మాణ సంస్థ స్టూడియో గ్రీన్ బేనర్లో దర్శకుడు కళ్యాణ్ కృష్ణ తదుపరి చిత్రం
నాగార్జున, నాగ చైతన్య నటించిన `బంగార్రాజు`తో సంక్రాంతి బ్లాక్‌బస్టర్ అందించిన దర్శకుడు కళ్యాణ్ కృష్ణ తన తదుపరి చిత్రం అగ్ర నిర్మాణ సంస్థ స్టూడియో గ్రీన్ ప్రొడక్షన్ లో చేయనున్నారు. కెఇ జ్ఞానవేల్ రాజా ఈ చిత్రానికి నిర్మాత.
దక్షిణాది చలనచిత్ర రంగంలో ప్రముఖ నిర్మాణ సంస్థల్లో ఒకటైన స్టూడియో గ్రీన్, స్టార్ హీరోలతో హై బడ్జెట్ ఎంటర్టైనర్లను నిర్మించడమే కాకుండా కంటెంట్ రిచ్ సినిమాలను నిర్మిస్తోంది. తెలుగులో కూడా అంతే ప్రజాదరణ పొందిన ఈ బ్యానర్‌పై నిర్మించిన పలు చిత్రాలు ఇక్కడ డబ్ చేసి విడుదలయ్యాయి.
ఈ చిత్రానికి సంబందించిన ఇతర వివరాలు త్వరలో స్టూడియో గ్రీన్ వారు వెల్లడించనున్నారు.