ఆచార్య చిత్రం ఏప్రిల్ 29 విడుదల
మెగా‘స్టార్ చిరంజీవి, మెగాపవర్‌స్టార్ రామ్‌చరణ్ హీరోలుగా స్టార్ డైరెక్టర్ కొరటాల శివ రూపొందిస్తోన్న చిత్రం ‘ఆచార్య ’ ఏప్రిల్ 29న గ్రాండ్ రిలీజ్
మెగాస్టార్ చిరంజీవి. మెగాపవర్‌స్టార్ రామ్‌చరణ్ హీరోలుగా డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘ఆచార్య’. శ్రీమతి సురేఖ కొణిదెల సమర్పణలో కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ పతాకాలపై నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా ఏప్రిల్ 29 విడుదల చేస్తున్నారు.
ఈ సందర్బంగా …
చిత్ర నిర్మాతలు నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి మాట్లాడుతూ ‘‘మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా స్టార్ డైరెక్టర్ కొరటాల శివగారు రూపొందిస్తోన్న చిత్రం ‘ఆచార్య’. ఈ చిత్రాన్ని కోవిడ్ థర్డ్ వేవ్ కారణంగా ఫిబ్రవరి రిలీజ్ కాకుండా వాయిదా వేశాం. ఉగాది సందర్భంగా ఏప్రిల్ 1న విడుదల చేయాలని అనుకున్నాం. అయితే మార్చి 25న మరో భారీ బడ్జెట్ పాన్ఇండియా మూవీ RRR విడుదలవుతుంది. భారీ అంచనాలున్న రెండు భారీ చిత్రాలు ఇలా తక్కువ గ్యాప్‌లో విడుదల కావడం సరికాదనే భావనతో RRR నిర్మాతలు, మేము సినిమా రిలీజ్ డేట్స విషయంలో చర్చలు జరిపాం. సానుకూల వాతావరణంలో జరిగిన చర్చల కారణంగా RRR మూవీ మార్చి 25న రిలీజ్ అవుతుంది. అలాగే మా ‘ఆచార్య’ సినిమాను ఏప్రిల్ 29న విడుదల చేయడానికి నిర్ణయించుకున్నాం.
ఆచార్య సినిమా వాయిదా పడటం అనేది మెగా ఫ్యాన్స్‌కు నిరాశ కలిగించే అంశమే. అయితే, ఈ వెయిటింగ్‌కు తగ్గ ఫలితం ఉంటుందని గ్యారంటీగా చెప్పగలం. ప్రేక్షకులు, ఫ్యాన్స్ ఎంత ఎగ్జయిటింగ్‌గా వెయిట్ చేస్తున్నారో మేం కూడా అంతే ఎగ్జయిట్‌మెంట్‌తో వెయిట్ చేస్తున్నాం’’ అన్నారు.