Reading Time: 3 mins

డి జె టిల్లు మూవీ రివ్యూ

DJ Tillu:’డీజే టిల్లు’ రివ్యూ

Emotional Engagement Emoji (EEE)

 
?

ఈ సినిమా చెప్పుకోవాటనికి చిన్న చిత్రమే కానీ మార్కెటింగ్ పరంగా,బిజినెస్ పరంగా భారీతనమే. త్రివిక్రమ్ వంటి దర్శక,రచయిత నిర్మాణ సంస్ద నుంచి వచ్చిన సినిమా కావటంతో బజ్ బాగా క్రియేట్ అయ్యింది. దానికి తోడు బూతు అనిపించుకున్నా యూత్ కు నచ్చే హైదరాబాదీ డైలాగులతో ట్రైలర్స్ కట్ చేసి వదిలారు.’ జాతిరత్నాలు’ స్దాయి ఫన్ సినిమా అని ప్రచారం చేసారు. అయితే ఆ స్దాయి నిజంగానే ఈ సినిమాకు ఉందా…ఈ సినిమా కథేంటి వంటి విషయాలు చూద్దాం.స్టోరీ లైన్హైదరాబాద్ గల్లీ కుర్రాడు డీజే టిల్లు (సిద్ధు జొన్న‌ల‌గ‌డ్డ‌).  కాస్త బిల్డడ్ ఎక్కువ బిజినెస్ తక్కువ బ్యాచే. మాట్లాడితే బన్నీతో సినిమా ఓకే అయ్యిందని చెప్పుకుని తిరుగుతూంటాడు. ఓ పెద్ద మ్యూజిక్ డైరక్టర్ ని అవుతానని అందరినీ నమ్మించే ప్రయత్నం చేస్తూంటాడు. అయితే రొటీషన్ కోసం తన బస్తీలలో,గల్లీలలో పెళ్లిళ్లలకు, పంక్షన్స్ కు డీజే నిర్వహిస్తూంటాడు. లోకల్ గా కొద్దిగా ఫేమసే. ఇలా తన జీవితం గడిపేస్తున్న ఈ కుర్రాడికి ఓ పబ్  లో సింగర్ రాధిక (నేహాశెట్టి) పరిచయం అవుతుంది. ఆమెతో తొలి ప్రేమ గీతాలు పాడేసుకుని, పీకల్లోతు ప్రేమలో పడిపోయానని అర్దం చేసుకుంటాడు. అయితే రాధిక సామాన్యమైనది కాదు. ఆమెకు ఆల్రెడీ బోయ్ ప్రెండ్ ఉన్నాడు. ఆ బోయ్ ప్రెండ్ కు ఆల్రెడీ మరో గర్ల్ ప్రెండ్ ఉంది. దాంతో టిల్లూతో రాధిక కూడా చనువుగా ఉంటుంది. ఈ విషయం తెలిసిన ఆమె బోయ్ ప్రెండ్ ఆమెతో తగువుపడతాడు. ఆ క్రమంలో అనుకోకుండా ఆమె చేతిలో చనిపోతాడు. అయితే ఈ మర్డర్ కేసులో ఊహించని విధంగా టిల్లు కూడా ఇరుక్కుంటాడు. ఇప్పుడు ఆమెను బయిటపడేయాలని ప్రయత్నం చేస్తూ తను ఇరుక్కుపోతూంటాడు. ఈ క్రమంలో జరిగే సంఘటనలు ఏమిటి..చివరకు ఏమైంది… వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

స్క్రీన్ ప్లే విశ్లేషణ

ఈ సినిమా కథను పూర్తిగా క్యారక్టర్ బేస్ చేసుకుని, సపోర్ట్ గా కొన్ని  సిల్లీ సీన్స్ రాసుకుని తెరకెక్కించిన సినిమా ఇది. ఈ సినిమా క్రైమ్ జానర్ లో నడుస్తుంది. అలాగని పూర్తిగా ఆ జానర్ గా అంకితం అయ్యిపోదు. సినిమా ప్రారంభంలో మనకు ఈ సినిమా ఓ  సరదా కుర్రాడి  కథలా అనిపిస్తుంది. టేకాఫ్ బాగుంది కదా అనుకుంటే తర్వాత మెల్లిగా క్రైమ్ లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తూ తడపడతాడు.   ఫస్ట్ హాఫ్ ని చాలా ఫన్ గా లాకొచ్చాడు దర్శకుడు సెకండాఫ్ కు వచ్చే సరికి దాన్ని కంటిన్యూ చేయలేకపోయారు. టిల్లు క్యారక్టర్ ఇంట్రడక్షన్, టిల్లు చుట్టూ వున్న ఎట్మాస్మియర్, క్యారక్టర్స్, సిట్యువేషన్స్ నవ్వులు తెప్పిస్తాయి. రాధిక పాత్ర ఎంటర్ కావడంతో కథ మొదలౌతుంది. ఇంటర్వెల్ వరకూ సాఫీగ సాగుతుంది. అక్కడే గండిపడుతుంది. సెకెండ్ హాఫ్ వచ్చేసరికి సినిమా హీరో ఎలాగైతే కష్టాల్లో పడ్డాడో అలాగే సినిమాకు కూడా కష్టాలు మొదలయ్యాయి. ఫస్ట్ హాఫ్ లో పండిన ఎంటర్టైన్మెంట్  సెకెండ్ హాఫ్ లో కొంచెం కూడా పండలేదు. కారణం.. ఈ కథ అక్కడే ఆగిపోవటమే. ఈ స్టోరీ లైన్ ముందుకు తీసుకెళ్లడానికి సరపడ ట్రీట్మెంట్ సరిగ్గా రాసుకోకపోవటమే.ఇలాంటి హాఫ్ బేకెడ్ కథలు, లైన్స్ తీసుకున్నపుడే వచ్చే సమస్యే ఇది. ఎంటర్టైన్మెంట్  అంతా ఫస్టాఫ్ లో వుంటుంది. తర్వాత నడపటనికి పాయింటే వుండదు.  సెకండ్ హాఫ్ లో మెమొరిలాస్, కోర్టు డ్రామా చుట్టూ తిరిగే సీన్స్ ఫన్ రాదు. విసుగు వస్తుంది. సినిమా మొత్తం స్టోరీ లేకుండా నడపటానికి ఇదేమన్నా టిల్లూ డీజేనా?

సిద్దు, మిగతా వాళ్లు ఎలా చేసారంటే..

సిద్దు జొన్నలగడ్డ సినిమాగానే మొదటి నుంచి ప్రచారం జరిగింది. అది నిజం కూడా. అతని వన్ మ్యాన్ షో ఇది. డీజే టిల్లుగా   యాస, నటన చక్కగా పండించాడు.   నేహ శెట్టి అందంగా వుంది. నటన జస్ట్ ఓకే. ప్రిన్స్ ది కీలక పాత్ర. బాగా చేసాడు. బ్రహ్మాజీ ఎప్పటిలానే తన అనుభవంతో లాక్కెళ్లిపోయాడు. మిగతా ఆర్టిస్ట్ లు  పరిధి మేర చేశారు

టెక్నికల్ గా…

దర్శకుడుకు ఇప్పటి యూత్, ట్రెండ్స్ పై మంచి అవగాహన ఉంది. హైదరాబాదీ లైఫ్ స్టైల్ పై కమాండ్ ఉంది. కానీ స్క్రిప్టు పై సరైన అవగాహన లేదు. దాంతో  సెకండ్ హాఫ్  తేలిపోయి…డిజే టిల్లు ని పడేసింది. మ్యూజిక్ విషయానికి వస్తే…రామ్ మిరియాల, శ్రీ చరణ్ అందించిన మ్యూజిక్ ట్రెండీగానే వుంది. టైటిల్ ట్రాక్ సూపర్ క్యాచిగా వుంది. తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కాస్త ఎక్కువైనా ఉన్నంతలో సింక్ అయ్యింది.   కెమరాపనితనం కూడా బావుంది.  ప్రొడక్షన్ వాల్యూస్ బాగా ఖర్చు పెట్టారు. ఎడిటర్ రన్ టైమ్ తక్కువ పెట్టడంతో చాలా ఉపకారం చేసారు చూసే వాళ్ళకు.

చూడచ్చా?

చూడచ్చు కానీ సెకండాఫ్ బాగుండాలనే రూల్ పెట్టుకోకుండా ఉంటే..

ఎవరెవరు..
నటీనటులు: సిద్ధూ జొన్నలగడ్డ, నేహా శెట్టి, ప్రిన్స్‌, బ్రహ్మాజీ, ప్రగతి, తదితరులు;
సినిమాటోగ్రఫీ: సాయిప్రకాశ్‌;
ఎడిటర్‌: నవీన్‌ నూలీ;
నేపథ్య సంగీతం: తమన్‌;
నిర్మాత:  సూర్యదేవర నాగవంశీ;
సంస్థ: సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌;
కథ, రచన: విమల్‌ కృష్ణ, సిద్ధూ జొన్నలగడ్డ;
దర్శకత్వం: విమల్‌ కృష్ణ;
Run Time: 2 hr 04 Mins
విడుదల తేదీ: 12-02-2022