కృష్ణ వ్రి౦ద విహారి చిత్రం టీజర్ లాంఛ్ కార్యక్రమం
కృష్ణ వ్రి౦ద విహారి సినిమా ఛలో కంటే పెద్ద హిట్ అవ్వాలి- టీజర్ లాంఛ్ లో సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి
యంగ్ టాలెంటెడ్ హీరో నాగశౌర్య హీరోగా షెర్లి సెటియా హీరోయిన్ గా అనిష్ ఆర్.కృష్ణ దర్శకత్వంలో ఐరా క్రియేషన్ పతాకంపై శంకర్ ప్రసాద్ మూల్పూరి సమర్పణలో అభిరుచి గల నిర్మాత ఉష మూల్పూరి నిర్మించిన చిత్రం కృష్ణ వ్రి౦ద విహారి. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలను పూర్తిచేసుకుని ఏప్రిల్ 22న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది.
ఈ చిత్రం టీజర్ రిలీజ్ కార్యక్రమం మార్చి 28న హైదరాబాద్ రామానాయుడు స్టూడియోలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి ముఖ్యఅతిధిగా విచ్చేసి టీజర్ లాంచ్ చేశారు.
అనంతరం ఏర్పాటైన సమావేశంలో అనిల్ రావిపూడి, బివియస్ రవి, హీరో నాగ శౌర్య, హీరోయిన్ షెర్లి సెటియా, దర్శకుడు అనిష్ ఆర్. కృష్ణ, నిర్మాత ఉష మూల్పూరి పాల్గొన్నారు..
చిత్ర దర్శకుడు అనిష్ ఆర్. కృష్ణ మాట్లాడుతూ… కృష్ణ వ్రి౦ద విహారి ఇట్స్ ఏ కూల్ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైన్మెంట్ ఫిల్మ్. 2018 లో నాగశౌర్య తో నా జెర్నీ స్టార్ట్ అయింది. అప్పుడు ఈ స్టోరీ చెప్పాను.. ఇమ్మీడియెట్ గా ఒకే మనం చేద్దాం అన్నారు. డిసెంబర్ లో షూట్ స్టార్ట్ చేసి కరోన ఉన్న కూడా మధ్య మధ్యలో గ్యాప్ చూసుకొని ఈ సినిమా షూటింగ్ ఫినిష్ చేశాం. టీజర్ లో కృష్ణ ,వ్రి౦ద ల రొమాన్స్ చూసుంటారు.. మూవీలో దీనికి మించి ఉంటుంది. ఓన్లీ రొమాన్స్ కాకుండా లాట్ ఆఫ్ కామెడీ ఉంటుంది..వెన్నెల కిషోర్, రాహుల్ రామకృష్ణ, సత్య, బ్రహ్మాజీ అందరూ ప్రేక్షకుల్ని కడుపుబ్బా నవ్వించడానికి ఏప్రిల్ 22న రాబోతుంది. అందర్నీ అలరిస్తుంది అని కాన్ఫిడెంట్ గా ఉన్నాం. అన్నారు.
చిత్ర నిర్మాత ఉష మూల్పూరి మాట్లాడుతూ.. అనిల్ రావిపూడి సినిమాలకే కాకుండా ఆయన మనసుకి కూడా పెద్ద ఫాన్ ని. ఆయన దగ్గర వర్క్ చేసిన టెక్నీషియన్స్ అందరూ మా దగ్గర కూడా వర్క్ చేస్తున్నారు. ఆయన గురించి అందరూ మంచిగా చెప్తుంటారు. అందరికీ ఏం కావాలి అని అందర్నీ అడిగి ప్రొవైడ్ చేస్తుంటారంట. అందుకు నేను ఆయనకి పెద్ద అభిమానిని. అలాగే మచ్చ రవి కూడా మా ఫ్యామిలీ మెంబర్. మా టీజర్ రిలీజ్ చేసి బ్లెస్సింగ్స్ ఇవ్వడానికి వారిఇద్దరిని పిలిచాను. మంచి మనసుతో వాళ్ళు వచ్చి టీజర్ లాంచ్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. అనిల్ రావిపూడి ఎఫ్3 సినిమా పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నాను. ఇక మా సినిమా గురించి నాగ శౌర్య చెప్తాడు అన్నారు.
హీరోయిన్ షెర్లిన్ సెటియా మాట్లాడుతూ.. తెలుగులో ఇది నా ఫస్ట్ ఫిల్మ్. చాలా చాలా హ్యాపీగా ఉంది.. ఐరా క్రియేషన్ హోమ్ ప్రొడక్షన్ లా ఉంది. చాలా కేర్ తీసుకొని చూసుకున్నారు.. ఈ సినిమాలో ఓన్ గా డబ్బింగ్ చెప్పాను. అమేజింగ్ ఎక్స్ పీరియెన్స్ కలిగింది. మ్యూజిక్ ఫెంటాస్టిక్ గా ఉంది. సాయి శ్రీరామ్ విజువల్స్ సూపర్బ్ గా ఉన్నాయి అన్నారు.
రచయిత బి వి యస్ రవి మాట్లాడుతూ.. ఐరా క్రియేషన్ అంటే ఫ్యామిలీ బేనర్ లాంటిది. ఎందుకంటే వారికి సినిమా మీద ఉండే ప్యాషన్. సినిమాకి ఎంత కావాలో అంత ఖర్చు పెట్టే ప్రొడ్యూసర్స్ కలకాలం వుంటారు. ఉష గారు, ప్రసాద్ గారు, బుజ్జిగారు సినిమా కోసం చాలా తాపత్రయ పడుతుంటారు. ఒకరకంగా చెప్పాలంటే నాగశౌర్య కంటే కూడా సినిమా అంటేనే ఎక్కువ ఇష్టం. శౌర్య ప్రతీ సినిమాకి హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్స్ పెడుతూ ఒక్కొక్క మెట్టు ఎక్కి పైకి వెళ్తున్నాడు. ఈ టీజర్ చూడగానే మంచి హిట్ అవుతుందనిపించింది. స్వర సాగర్ మ్యూజిక్ హంటింగ్ గా ఉంది.అనిష్ క్లాస్ టచ్ తో ఈ సినిమా తీసాడు. సాయి శ్రీరామ్ ఫోటోగ్రఫీ కూడా చాలా బాగుంది. ఇటీవల వస్తోన్న హ్యూజ్ మాస్ మూవీస్ లో ఇదొక మల్లె తీగ లాంటి సినిమా అవుతుంది.ఇట్స్ ఏ కూల్ సమ్మర్ ఫిల్మ్. ఎంటైర్ టీమ్ అందరికి ఆల్ ది బెస్ట్. ఈ సినిమా గ్రేట్ సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను. అన్నారు.
హీరో నాగశౌర్య మాట్లాడుతూ.. సినిమా చాలా బాగా వచ్చింది.. సెట్లో టీమ్ అందరితో చాలా బాగా ఎంజాయ్ చేసాను. ఒకప్పుడు ఇండస్ట్రీలో రీ షూట్ తీస్తే సినిమా పోయింది అనేవాళ్ళు. ఇప్పుడు రీ షూట్ తీయకపోతే సినిమా పోయేలా ఉంది. పర్ఫెక్షన్ కోసం అలా తీసుకొచ్చారు. మా డైరెక్టర్ అనిష్, మా అమ్మ సినిమాకి ఎంతకావలంటే అంత ఖర్చుపెట్టి కాంప్రమైజ్ అవకుండా ఈ సినిమా తీశారు. అందరికీ సినిమా నచ్చేంత వరకు తీస్తూనే ఉన్నాం. ఫైనల్ గా ఔట్ ఫుట్ చాలా బాగా వచ్చింది. ఐరా క్రియేషన్స్ నుండి సినిమా వస్తుంది.. గ్యారెంటీగా చాలా పెద్ద హిట్ కొట్టాలి అని కసితో ఈ సినిమా చేసింది. ఆ విషయంలో అచీప్ చేసింది మా అమ్మ. సినిమా చూసాను.. చాలా చాలా బాగుంది. మా అమ్మకి నేనంటే ఎంత ఇష్టమో నాకు హిట్ పడాలి అనేది ఇంకా ఇష్టం. అనిష్ మంచి కథతో చెప్పింది చెప్పినట్టు తీశారు. అనిల్ రావిపూడి గారి సినిమాలో ఎంత కామిడి ఉంటుందో నేను ఈ సినిమాలో అంత కామిడి చూశాను. అడవాళ్ళతో ఏదొ రకంగా సత్ సంబంధాలు ఉంటాయి. ఆ కాన్సెప్ట్ తో ఫుల్ ఎంటర్టైన్మెంట్ తో సినిమా ఉంటుంది. సాయి శ్రీరామ్ ఫోటోగ్రఫీ సినిమాకి ప్రాణం. ఎలాగైనా ఈ సినిమాని పెద్ద బ్లాక్ బస్టర్ చేయాలని కంకణం కట్టుకున్నారు. ఆయనే అనిష్ ని పంపించి కథ వినమన్నారు.మంచి సినిమా చేశారు. సాగర్ వండర్ ఫుల్ మ్యూజిక్ డైరెక్టర్ తనతో 5సినిమాలు చేశాను. షెర్లిన్ చేసిన మస్క మూవీ చూసి ఈ సినిమాలో పెట్టడం జరిగింది. బ్యూటిఫుల్ గా చేసింది. బ్రైట్ ఫ్యూచర్ ఉంటుంది తనకి. ఏప్రిల్ 22న ఈ సినిమా విడుదలవుతుంది. అన్నారు.
సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి మాట్లాడుతూ.. ఆర్ ఆర్ ఆర్ సినిమా తో థియేటర్స్ అన్నీ కళకళలాడుతున్నాయి. ఇలాగే ఇండస్ట్రీలో సినిమాలు ప్రశాంతంగా ఆడాలని కోరుకుంటున్నాను. ఐరా క్రియేషన్ బ్యానర్ అంటే సినిమాలు లవ్ చేస్తారు. ఆ సినిమాకి పనిచేసే టెక్నీషియన్స్ ని కూడా అంతే బాగా చూసుకుంటారు. సొంత కుటుంబ సబ్యుల్లా చూసుకుంటారు. అది మంచి ఆలోచన. అదే కంటిన్యూ చేయాలి. మంచి సినిమాలు తీయాలని ఎప్పుడు ప్రయత్నిస్తూనే వుంటారు. తీస్తూనే వున్నారు. ఈ సినిమా కూడా చలో కంటే పెద్ద సక్సెస్ అవ్వాలని నా బెస్ట్ విషెస్ తెలియజేస్తున్నాను. అనిష్ నాకు బాగా తెలుసు. మంచి టాలెంట్ ఉంది. కచ్చతంగా ఈ సినిమాతో పెద్ద హిట్ కొట్టబోతున్నాడు. సాయి శ్రీరామ్ చక్కటి విజువల్స్ ఇచ్చాడు. సాగర్ మంచి మ్యూజిక్ ఇచ్చాడు. శౌర్య ఎవరి సపోర్ట్ లేకుండా ఎంతో హార్డ్ వర్క్ చేసి ఈ స్థాయికి రీచ్ అయ్యాడు. డెఫినెట్ గా శౌర్య ఇంకా నెక్స్ట్ లెవెల్ కి వెళ్తాడని అనుకుంటున్నాను. ఈ సినిమా పెద్ద హిట్ అయి అందరికీ మంచి పేరు తీసుకు రావాలి. అన్నారు..