Reading Time: 3 mins

స్టోరీ, స్క్రీన్‌ప్లే, డైరెక్టర్‌ చిత్రం ప్రారంభం

సినీ పరిశ్రమలోని యదార్థగాదలతో ప్రారంభమైన ‘ఎస్‌.ఎస్‌.డి’ (స్టోరీ, స్క్రీన్‌ప్లే, డైరెక్టర్‌) చిత్రం.

శ్రీ వైష్ణవి ఫిలిమ్స్‌ పతాకంపై కట్ల ఇమ్మార్టెల్‌, అమ్మ రాజశేఖర్‌, అలీషా, షాలిని,సీనియర్ నటుడు సుమన్, బ్రహ్మాజీ,అలీ, చమ్మక్‌ చంద్ర, శివారెడ్డి, నటీనటులుగా కట్ల రాజేంద్రప్రసాద్‌ దర్శకత్వంలో ఈ.డి ప్రసాద్‌ నిర్మిస్తున్న చిత్రం ‘ఎస్‌.ఎస్‌.డి’ (స్టోరీ, స్క్రీన్‌ప్లే, డైరెక్టర్‌).

ఈ చిత్రం పూజా కార్యక్రమాలు హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోలో ఘనంగా జరుపుకుంది.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చిన జీవిత, రాజశేఖర్‌లు స్క్రిప్ట్‌ను అందించి, ముహూర్తపు సన్నివేశానికి హీరో, హీరోయిన్‌లపై కెమెరా స్విచ్‌ఆన్‌ చేయగా, పసుర గ్రూప్‌ ఆఫ్‌ కంపెనీస్‌ యం.డి. ప్రశాంత్‌ కుమార్ గారు క్లాప్‌ కొట్టారు. నిర్మాతలు రామ సత్యనారాయణ, సాయి వెంకట్‌లు గౌరవ దర్శకత్వం వహించారు.

అనంతరం చిత్ర యూనిట్‌ ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో

చిత్ర నిర్మాత ఈ.డి.ప్రసాద్‌ మాట్లాడుతూ…కామెడీ, హర్రర్‌, సెన్సిబుల్‌ లవ్‌ స్టొరీ ఉన్న మంచి సబ్జెక్ట్‌ను దర్శకుడు రాజేంద్రప్రసాద్‌ చెప్పగానే కథ నచ్చి శ్రీ వైష్ణవి ఫిలిమ్స్‌ పతాకంపై నా మొదటి సినిమాను నిర్మిస్తున్నాను.ఇందులో ఇద్దరు హీరోలు, హీరోయిన్లు వుంటారు. అలాగే  చాలామంది సీనియర్‌ యాక్టర్స్‌ ఇందులో నటిస్తున్నారు. అందరూ ఫుల్‌గా నవ్వుకునే ఫ్యామిలీ సబ్జెక్ట్‌ ఇది అందరికీ కచ్చితంగా నచ్చుతుంది అన్నారు.

చిత్ర దర్శకుడు కట్ల రాజేంద్ర ప్రసాద్‌ మాట్లాడుతూ..మమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చిన  జీవిత, రాజశేఖర్‌, దర్శక, నిర్మాతలు యస్‌.వి.కృష్ణారెడ్డి, అచ్చిరెడ్డి, పసుర గ్రూప్‌ ఆఫ్‌ కంపెనీస్‌ యం.డి. ప్రశాంత్‌ కుమార్ , నిర్మాతలు రామసత్యనారాయణ, సాయి వెంకట్‌లకు ధన్యవాదాలు. ఇది సినిమాలో ఒక సినిమా వాళ్ళ కథ. సినిమా ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు ఒక డైరెక్టర్‌  ఒక ప్రొడ్యూసర్‌, హీరో, హీరోయిన్స్‌, ఆర్టిస్ట్‌గా ట్రై చేసే వారు ఇలా సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన ప్రతి క్రాఫ్ట్‌ యొక్క మనస్తత్వాలు ఎలా ఉంటాయి. వారి జీవన విధానం ఎలా ఉంటుంది. వారి జీవితంలో ఉండే కష్టాలు ఎలా ఉంటాయి.వారంతా ఏ  గోల్‌ తో సినిమా ఇండస్ట్రీకి వచ్చిన వారి  జీవితాలు ఎలా మారిపోతాయి అనే సబ్జెక్టును సినిమాగా రూపొందించడం జరుగుతుంది. ఇందులో ఒక హీరో, ఒక హీరోయిన్‌ జీవన విధానం ఎలా ఉంటుంది అనే సబ్జెక్టు అయితే, నెక్స్ట్‌ ఒక హీరో, హీరోయిన్‌ని లవ్‌ చేస్తే తను ప్రేమించిన అమ్మాయిని పొందుతాడా లేదా అనే కాన్సెప్ట్‌ తో ఒక కామెడీ ఎంటర్‌ టైన్‌మెంట్‌తో ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తాం. నిర్మాత ఈ.డి ప్రసాద్‌ గారికి ఈ కథ చెప్పడం జరిగింది. తనకు కథ నచ్చి సినిమా చేయడానికి ముందుకు వచ్చారు. వారికి నా ధన్యవాదాలు. ఇందులో రెండు క్యారెక్టర్లు కీలకంగా ఉంటాయి. అందులో నన్ను దర్శకుడిగా నిలబెట్టడానికి అమ్మ రాజశేఖర్‌ గారు నటిస్తుండగా.. ఇంకొకరు మా అబ్బాయి కట్ల ఇమ్మార్టెల్‌. నటిస్తున్నాడు. నా ఫ్రెండ్‌ అమ్మ రాజశేఖర్‌ గారు ఈ సినిమాకు కమర్షియల్‌గా యాక్ట్‌ చేయకుండా, నా కోసం ఈ సినిమా చేయడానికి ముందుకొచ్చాడు. గ్రూప్‌ డాన్సర్‌గా, డాన్సర్‌గా తను నేను హీరోగా, డైరెక్షన్‌ గారు కూడా చేశాము. కానీ ఈ రోజు తను నా కోసం ఈ సినిమా చేయడానికి ముందుకు వచ్చినందుకు చాలా హార్ట్‌ఫుల్‌గా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇందులో ఉన్న హీరోయిన్స్‌ను వీడియో కాల్‌లో ఆడిషన్‌ చేసి సెలెక్ట్‌ చేయడం జరిగింది. ఫ్యామిలీ ఎంటర్టైనర్‌గా వస్తున్న ఈ సినిమా అందరికీ నచ్చుతుంది అన్నారు.

అమ్మ రాజశేఖర్‌ మాట్లాడుతూ.. నేను డైరెక్ట్‌ చేసిన సినిమా ఈ నెలలో రిలీజ్‌కు ఉంది. చిత్ర దర్శకుడు రాజేంద్రప్రసాద్‌ నాకు మంచి ఫ్రెండ్‌. తను నేను గ్రూప్‌ డ్యాన్సర్స్‌గా కొరియోగ్రాఫర్స్‌ గా కలసి చేశాము. ఇందులో మంచి రోల్‌ ఉంది నువ్వే నటించాలి అని చెపితే కేవలం ఇందులో నేను ఫ్రెండ్‌ షిప్‌ కోసం నటిస్తున్నాను. అలాగే వారి అబ్బాయి కూడా ఇందులో హీరోగా నటిస్తున్నారు. అలాగే శివారెడ్డి, చమ్మక్‌ చంద్ర, ఆలీ, సుమన్‌ శెట్టి, అనంత్‌,ఇలా చాలా మంది ఆర్టిస్టులు ఇందులో యాక్ట్‌ చేస్తున్న ఈ సినిమా ప్రేక్షకులకు ఫుల్‌ ఎంటర్టైన్మెంట్‌ ఉఇస్తుంది అన్నారు.

హీరో కట్ల ఇమ్మార్టెల్‌  మాట్లాడుతూ ..అమ్మ రాజశేఖర్‌ గారి రణం సినిమాలో చిన్న రోల్‌ చేశాను. ఇప్పుడు ఆయన పక్కన హీరోగా చేస్తున్నందుకు చాలా గ్రేట్‌గా ఫీల్‌ అవుతున్నాను.తను మాకెంతో సహాయపడ్డాడు. తను నాకు తండ్రి తరువాత తండ్రి లాంటి వాడు. ఈ సినిమాను డైరెక్షన్‌ చేసే అవకాశం వచ్చినా నా ఫ్రెండ్‌ కు మంచి సక్సెస్‌ రావాలని ఈ ప్రాజెక్ట్‌ మా నాన్నకు త్యాగం చేశాడు అంత గొప్ప మనసున్న వ్యక్తి అమ్మ రాజశేఖర్‌. నిర్మాత గారు నా ఫోటో చూసి నన్ను హీరోగా సెలెక్ట్‌ చేశారు వారికి నా ధన్యవాదాలు. నాకు నాకు సినిమాలో అవకాశం ఇచ్చిన నిర్మాత ప్రసాద్‌ గారికి ధన్యవాదాలు.

డిఓపి గోవర్ధన్ మాట్లాడుతూ.. హర్రర్‌ కామెడీగా వస్తున్న ఈ సినిమా అందరూ కంపల్సరీ నవ్వుకుంటారు.ఇలాంటి మంచి సబ్జెక్ట్‌ ఇచ్చిన దర్శక, నిర్మాతలకు ధన్యవాదాలు అన్నారు.

మరో హీరోయిన్‌ అలీషా మాట్లాడుతూ.. ఇది నా ఫస్ట్‌ మూవీ. వీడియో కాల్‌ ద్వారా నన్ను ఆడిషన్‌ చేసి సెలెక్ట్‌ చేశారు. ఇలాంటి మంచి సినిమాలో నటించే అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు ధన్యవాదాలు అన్నారు.

హీరోయిన్‌ షాలిని మాట్లాడుతూ.. ఇది నా ఫస్ట్‌ మూవీ.ఇందులో నేను నెగిటివ్‌ రోల్‌లో నటిస్తున్నాను అన్నారు.

నటుడు కట్ల రమేష్‌ మాట్లాడుతూ.. ఇందులో నేను డిఫరెంట్‌ రోల్‌లో నటిస్తున్నాను. నాకీ అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు ధన్యవాదాలు అన్నారు.

ఎడిటర్‌ ఆనంద్‌ పవన్‌ మాట్లాడుతూ..అమ్మ రాజశేఖర్‌, కట్ల రాజేంద్రప్రసాద్‌ వంటి వారితో చేసే అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు ధన్యవాదాలు అన్నారు.

నటీనటులు :
కట్ల ఇమ్మార్టెల్‌, అమ్మ రాజశేఖర్‌, అలీషా, షాలిని,సీనియర్ నటుడు సుమన్, బ్రహ్మాజీ,అలీ, చమ్మక్‌ చంద్ర, శివారెడ్డి, సుమన్‌ శెట్టి, ఆనంద్‌, జబర్దస్త్‌ గణపతి,గౌతమ్‌ చంద్ర, కట్ల రమేష్‌, తదితరులు

సాంకేతిక నిపుణులు :
బ్యానర్‌ : శ్రీ వైష్ణవి ఫిలిమ్స్‌
ప్రొడ్యూసర్‌ : ఈ.డి ప్రసాద్‌
కొరియోగ్రఫీ, స్టోరీ, స్క్రీన్‌ ప్లే, డైలాగ్స్‌, డైరెక్షన్‌ : కట్ల రాజేంద్ర ప్రసాద్‌
మ్యూజిక్‌ :  ప్రమోద్‌ కుమార్‌ శర్మ
డి.ఓ.పి : గోవర్ధన్
ఎడిటింగ్‌ : ఆనంద్‌ పవన్‌