రాంగ్ నంబర్ చిత్రం ట్రైలర్ విడుదల
సినిమా డిస్ట్రిబ్యూటర్స్ సమక్షంలో ఘనంగా విడుదలైన “రాంగ్ నంబర్” ట్రైలర్
ఆర్.వి.యస్ ప్రొడక్షన్ బ్యానర్ పై మారుతిరామ్,జియో దార్ల (నూతన పరిచయం), హాసిని, అజయ్‌ఘోష్, సుమన్ శెట్టి నటీనటులుగా సాంబశివారావు దర్శకత్వంలో ఆర్.వి.యస్ రావు, ఫనా లు సంయుక్తంగా నిర్మిస్తున్న క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రం “రాంగ్ నంబర్”.ఈ చిత్రం ట్రైలర్ లాంచ్ కార్యక్రమం హైదరాబాద్ లో సినీ అతిరధుల సమక్షంలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి పలువురు సినిమా డిస్ట్రిబ్యూటర్స్ దామోదర్,వీరభద్ర ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్ తిలక్ గంగాధర్ యాదవ్, అంబికా ఫిల్మ్స్ శ్రీరాములు తదితర సినిమా డిస్ట్రిబ్యూటర్స్ పాల్గొన్నారు. ఈ చిత్ర ట్రైలర్ కార్యక్రమం అనంతరం చిత్ర ప్రీమియర్ ను వారికి ప్రదర్శించడం జరిగింది.
చిత్ర నిర్మాత ఆర్.వి.యస్ రావు, మాట్లాడుతూ..మా రాంగ్ నెంబర్ మూవీ ట్రైలర్ కు వచ్చిన పెద్దలకు ధన్యవాదాలు. మా రాంగ్ నెంబర్ లో హీరోగా చేసిన మారుతీ రామ్ కొత్త వాడైన సీనియర్ యాక్టర్ లా మంచి పర్ఫార్మెన్స్ చేశాడు. దర్శకుడు సాంబశివరావు ఈ సినిమాను అద్భుతంగా తెరకెక్కించాడు. చిన్న బడ్జెట్ తో మొదలైన ఈ సినిమా కథ బలంగా ఉండటంతో పెద్ద బడ్జెట్ సినిమాగా తెరకెక్కింది. “రాంగ్ నెంబర్” సినిమా ట్రైలర్ తెలంగాణ, ఆంద్రప్రదేశ్ సినిమా డిస్ట్రిబ్యూటర్స్ నచ్చడంతో వారు ఈ సినిమాను థియేటర్స్ లలో విడుదల చేయడానికి ముందుకు వచ్చారు.
వారందరికీ ధన్యవాదాలు.త్వరలో ప్రేక్షకుల ముందుకు వస్తున్న మా సినిమాను ప్రేక్షకులందరూ ఆదరించి ఆశీర్వదించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు
చిత్ర దర్శకుడు సాంబశివారావు మాట్లాడుతూ..ఆర్.వి.ఎస్ ప్రొడక్షన్ బ్యానర్ లో “రాంగ్ నెంబర్” మూవీని ఆర్. వి. ఎస్ రావు,ఫనా లు కలసి నిర్మిస్తున్నారు.మారుతీ రామ్,జియోడార్లను నూతన నటీనటులుగా పరిచయం చేస్తున్నాము.ఈ సినిమాకు ఏమి కావాలన్నా మాకు సమకూర్చుతూ ఖర్చుకు వెనకాడకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు.ఈ చిత్రంలో అజయ్ ఘోస్ ప్రధాన విలన్ గా నటిస్తుండగా అలనాటి ప్రముఖ నటులు,దివంగత ఆర్.నాగేశ్వర రావు గారి అన్నగారి (సత్యనారాయణ) మనవడు రాజనాల సతీష్ నాయుడు ను రెండో విలన్ గా తెలుగు తెరకు పరిచయం చేస్తున్నాము.అందరూ ట్రైలర్ బాగుందని మెచ్చు కుంటున్నారు.ట్రైలర్ కంటే పదిరెట్లు ఈ సినిమా ఉంటుంది. గతంలో మెగాస్టార్ బ్రదర్ నాగబాబు గారు ఈ మూవీ సాంగ్ & పోస్టర్‌ను విడుదల చేయడం మాకు చాలా ఆనందాన్నిచ్చింది. మా సినిమా ట్రైలర్ చూసి మా సినిమాను తీసుకోవడానికి ముందుకు వచ్చిన డిస్ట్రిబ్యూటర్లు అందరికీ నా ధన్యవాదాలు.మంచి కాన్సెప్ట్ తో వస్తున్న ఈ సినిమా ప్రేక్షకుల అందరికీ కచ్చితంగా నచ్చుతుందని ఆశిస్తూ ఆ చిత్రాన్ని ఆదరించాలని మనస్పూర్తిగా కోరుతున్నాం అని అన్నారు
సీనియర్ డిస్ట్రిబ్యూటర్ దామోదర్, మాట్లాడుతూ..”రాంగ్ నెంబర్” ట్రైలర్ చాలా బాగుంది. ట్రైలర్ కంటే సినిమా కూడా చాలా బాగుంది.నటీనటులు చాలా చక్కగా నటించారు. ఫుల్ యాక్షన్ మూవీ గా తెరకెక్కిన ఈ చిత్రం గొప్ప విజయం సాదించాలి అన్నారు
వీరభద్ర ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్ తిలక్ గంగాధర్ యాదవ్ మాట్లాడుతూ… ఈ హీరో, దర్శక ,నిర్మాతలతో నేను గత సంవత్సరం నుండి ట్రావెల్ అవుతున్నాను ఈరోజు మీరు తీసిన ఈ సినిమా ట్రైలర్ కు తగ్గట్టే సినిమా ఉన్నందుకు చాలా సంతోషంగా ఉంది.ఈ సినిమా అందరికీ కచ్చితంగా నచ్చుతుంది అన్నారు
అంబికా ఫిలిమ్స్ డిస్ట్రిబ్యూటర్ శ్రీరాములు మాట్లాడుతూ.. మంచి కాన్సెప్ట్ తో వస్తున్న ఈ సినిమా గొప్ప విజయం సాదించాలి అన్నారు
శర్మ మాట్లాడుతూ..టైలర్ బాగుంది సినిమా కూడా చాలా బాగుండాలని ఆశిస్తున్నాను అని అన్నారు
హీరో మారుతి రామ్ మాట్లాడుతూ..ఇలాంటి మంచి సినిమాలు నటించే అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు ధన్యవాదాలు అని అని అన్నారు
హీరోయిన్ హాసిని మాట్లాడుతూ.. ఆర్ వి ఎస్ ప్రొటెక్షన్ బ్యానర్ పై వస్తున్న “రాంగ్ నెంబర్” సినిమా మా అందరికీ మొదటి చిత్రం. అందరూ సినిమాకు చాలా కష్టపడ్డాం అందరి సపోర్ట్ నాకు కావాలని మనస్పూర్తిగా కోరుతున్నాం అని అన్నారు
కో డైరెక్టర్ సర్వేశ్ మాట్లాడుతూ.. నాకు ఈ అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు ధన్యవాదాలు. కరోనా ద్వారా ఎన్నో కష్టాలు వచ్చినా వాటిని అధిగమించి ఈ సినిమా చేయడం జరిగింది.ఈ సినిమాకు మంచి అవుట్ పుట్ వచ్చింది హీరో మారుతి రామ్ చాలా బాగా చేశాడు. కమర్షియల్ హీరో కు ఉండే లక్షణాలు అన్నీ ఆయనకు ఉన్నాయి అలాగే హీరోయిన్ జియోడార్ల కూడా చక్కగా నటించింది అని అన్నారు
నటీనటులు
మారుతిరామ్,జియోడార్ల (నూతన పరిచయం), హాసిని,అజయ్‌ఘోష్, సుమన్ శెట్టి తదితరులు
సాంకేతిక నిపుణులు
బ్యానర్ : ఆర్.వి.యస్ ప్రొడక్షన్
నిర్మాతలు :ఆర్.వి.యస్ రావు, ఫనా
దర్శకత్వం : సాంబశివారావు
కో డైరెక్టర్ : సర్వేశ్
సినిమాటోగ్రాఫర్ – ఆనంద్ మరకుర్తి