Reading Time: < 1 min

కృష్ణమ్మ చిత్రం టీజ‌ర్‌

‘కృష్ణమ్మ’ టీజ‌ర్‌.. ఇన్‌టెన్స్ అండ్ టెరిఫిక్ అవ‌తార్‌లో మెప్పిస్తోన్న స‌త్య‌దేవ్‌

యంగ్ అండ్ ప్రామిసింగ్ యాక్ట‌ర్ స‌త్య‌దేవ్ గురించి టాలీవుడ్ ప్రేక్ష‌కులకు ప్ర‌త్యేక‌మైన ప‌రిచ‌యం అక్క‌ర్లేదు.డిఫరెంట్ రోల్స్‌తో మెప్పిస్తూ త‌న‌దైన స్థానాన్ని ద‌క్కించుకున్న వెర్స‌టైల్ హీరో ఆయ‌న‌. రీసెంట్‌గా గాడ్సే చిత్రంతో ప్రేక్ష‌కుల‌ను అల‌రించారు.

చాలా క్రేజీ ప్రాజెక్ట్స్‌లో భాగ‌మైన స‌త్య‌దేవ్ . చిరంజీవి ‘గాడ్ ఫాదర్’ చిత్రంలో కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నారు.

ఆయ‌న హీరోగా న‌టిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘కృష్ణమ్మ’. రీసెంట్‌గా ఆ సినిమా నుంచి రిలీజైన్ ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌లో ఇన్‌టెన్స్ లుక్‌కి అమేజింగ్ రెస్పాన్స్ వ‌చ్చింది.

గురువారం కృష్ణ‌మ్మ టీజ‌ర్‌ను హీరో సాయి ధ‌ర‌మ్ తేజ్ విడుద‌ల చేసి చిత్ర యూనిట్‌కి అభినంద‌న‌లు తెలిపారు.

కృష్ణమ్మ టీజ‌ర్ 1 నిమిషం 19 సెకన్లు ఉంది. ఇందులో సినిమా ఎంత ఇన్‌టెన్స్‌గా, ర‌స్టిక్‌గా ఉండ‌నుంద‌నే విష‌యాన్ని రివీల్ చేశారు. టీజ‌ర్‌లో స‌త్య‌దేవ్ వాయిస్ ఓవ‌ర్‌తో క‌థ‌ను వివ‌రిస్తున్నారు. త‌న వాయిస్ తెలియ‌ని ఓ భ‌యాన్ని క్రియేట్ చేస్తోంది. ‘ఈ కృష్ణ‌మ్మ‌లాగే మేము ఎప్పుడు పుట్టామో ఎక్క‌డ పుట్టామో ఎవ‌రికీ తెలియ‌దు’ అనే ప‌వ‌ర్ ఫుల్ డైలాగ్‌తో టైటిల్ పెట్ట‌డానికి గ‌ల కార‌ణాన్ని టీజ‌ర్‌లో చూపించారు.

ఓ చిన్న ప‌ట్టణంలో ఉండే ముగ్గురు స్నేహితులు, ఓ విల‌న్‌కి మ‌ధ్య జ‌రిగే సంఘ‌ర్ష‌ణే కృష్ణ‌మ్మ సినిమా. ఓ చిన్న ఘ‌ట‌న వారి ముగ్గురి జీవితాల‌ను ఎలా వారి జీవితాల్లో ఎలాంటి మ‌లుపు తిప్పింద‌నేదే సినిమా. కాల భైర‌వ బ్యాగ్రౌండ్ స్కోర్‌, టీజ‌ర్‌లో చూపించిన స‌త్య‌దేవ్ ఆవేశం సినిమాపై ఉన్న అంచ‌నాల‌ను మ‌రింతగా పెంచాయి. టీజర్ చూస్తుంటే ఇదొక యాక్ష‌న్ డ్రామా అని తెలుస్తోంది. సినిమా విడుద‌ల కోసం స‌త్య‌దేవ్ ఫ్యాన్స్ చాలా ఆతృత‌గా ఎదురు చూస్తున్నారు. ఫుల్ లెంగ్త్ యాక్ష‌న్ మూవీలో త‌మ అభిమాన హీరోను చూడాల‌నే వారి కోరిక కృష్ణ‌మ్మ చిత్రంతో తీర‌నుంది.

ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు కొర‌టాల శివ స‌మ‌ర్ప‌ణ‌లో అరుణాచ‌ల క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై వి.వి.గోపాల కృష్ణ దర్శకత్వంలో కృష్ణ కొమ్మ‌ల‌పాటి.. కృష్ణ‌మ్మ‌ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. త్వ‌ర‌లోనే సినిమాను థియేట‌ర్స్‌లో విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు జ‌రుగుతున్నాయి. కాల భైర‌వ సంగీతం అందించిన ఈ సినిమా పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి.