ధమాకా ప్రీరిలీజ్ ఈవెంట్ లో చిత్ర యూనిట్
ధమాకా బాక్సాఫీస్ బొనాంజా డబుల్ ఇంపాక్ట్ ఎంటర్ టైన్ మెంట్ అదిరిపోయింది అంచనాలకు మించి వుంటుంది: ధమాకా ప్రీరిలీజ్ ఈవెంట్ లో చిత్ర యూనిట్
మాస్ మహారాజా రవితేజ, కమర్షియల్ మేకర్ త్రినాథరావు నక్కిన మాస్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ ధమాకా . రవితేజ సరసన టాలీవుడ్ ఫేవరేట్ హీరోయిన్ శ్రీలీల హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రాన్ని టిజి విశ్వ ప్రసాద్ భారీగా నిర్మిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ & అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ పతాకాలపై రూపొందుతున్న ఈ చిత్రానికి వివేక్ కూచిభొట్ల సహ నిర్మాత. ఇప్పటికే విడుదలైన ధమాకా పాటలు, టీజర్, ట్రైలర్ అద్భుతమైన రెస్పాన్స్ తో సినిమాపై భారీ అంచనాలు పెంచాయి. డిసెంబర్ 23న ధమాకా ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లో విడుదలౌతున్న నేపధ్యంలో ధమాకా ప్రీరిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా నిర్వహించారు. ఈ ఈవెంట్ లో రవితేజ, శ్రీలీల అండ్ ధమాకా టీం జింతాక్ పాటకు వేదికపై డ్యాన్స్ చేయడం ప్రేక్షకులని ఆకట్టుకుంది.
ప్రీరిలీజ్ ఈవెంట్ లో రవితేజ మాట్లాడుతూ ధమాకా సినిమా ఖచ్చితంగా బావుంటుంది. మా టీం అంతా చాలా నమ్మకంగా వున్నాం. ఆర్ట్ డైరెక్టర్ నాగేంద్ర, కెమరామెన్ కార్తిక్ అద్భుతమైన వర్క్ ఇచ్చారు. శేఖర్, జానీ, యశ్వంత్ సాంగ్స్ చాలా చక్కగా కొరియోగ్రఫీ చేశారు. రామ్ లక్ష్మణ్ మాస్టర్స్ ఫైట్స్ యాక్షన్ అదరగొట్టారు. ప్రసన్న హ్యుమర్ నాకు చాలా ఇష్టం. ధమాకా అద్భుతంగా రాశాడు. ఇఫ్ ఐ సీ ఎ విలన్ ఇన్ యు, యు విల్ సీ ఎ హీరో ఇన్ మీ ఇందులో నాకు ఇష్టమైన డైలాగ్. దర్శకుడు త్రినాథరావు ఇరగదీశారు. పాత చిత్రాల్లో రావు గోపాలరావు- అల్లు రామలింగయ్య కాంబినేషన్ లా ధమాకా లో రావు రమేష్, ఆది ల కాంబో సరదాగా ఉంటుంది. శ్రీలీల రెండో సినిమాకే జనాల్లోకి బాగా వెళ్ళిపోయింది. అందంతో పాటు తనలో చాలా ప్రతిభ వుంది. నెక్స్ట్ ఇయర్ కి నెక్స్ట్ లెవల్ కి వెళుతుంది. నా మాట గుర్తుపెట్టుకోండి. తర్వాత ఆమె నా సినిమాలకు డేట్స్ ఇస్తుందో లేదో (నవ్వుతూ). భీమ్స్ కూడా ధమాకా తో నెక్స్ట్ లెవల్ కి వెళ్తాడు. నన్ను ద్రుష్టిలో పెట్టుకునే మ్యూజిక్ చేసినట్లువుంది. ఒకొక్క పాట ఇరగదీశాడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాతలు చాలా పాజిటివ్ గా వుంటారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఏ ముహూర్తాన పెట్టారో గానీ అదో ఫ్యాక్టరీ అయిపొయింది. ఈ సంస్థలో నేను సినిమాలు చేస్తానే వుంటాను. విశ్వ ప్రసాద్, వివేక్ గారికి ఆల్ ది బెస్ట్. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నెక్స్ట్ లెవల్ వెళ్లాలని కోరుకుంటున్నాను. అభిషేక్ అగర్వాల్ ఎక్కడా రాజీ పడకుండా సినిమాలు తీస్తారు. ధమాకాలో పని చేసిన అందరికీ ఆల్ ది బెస్ట్. డిసెంబర్ 23న థియేటర్స్ లో కలుద్దాం అన్నారు
శ్రీలీల మాట్లాడుతూ ధమాకా లాంటి బ్యూటీఫుల్ టీంలో భాగం కావడం చాలా ఆనందంగా వుంది. దర్శకుడు త్రినాథరావు నక్కిన గారికి కృతజ్ఞతలు. పెళ్లి సందడి విడుదల కాకముందే ఈ సినిమా సైన్ చేశాను. పీపుల్ మీడియా సంస్థలో పని చేయడం సంతోషంగా వుంది. ప్రసన్న గారు చాలా మంచి డైలాగులు రాశారు. భీమ్స్ చాలా గొప్ప మ్యూజిక్ ఇచ్చారు. శేఖర్ మాస్టర్ వండర్ ఫుల్ గా కొరియోగ్రఫీ చేశారు. రవితేజ గారికి నేను ఫ్యాన్ ని. చాలా అకింత భావంతో పని చేసే హీరో రవితేజ గారు. ఒక ఫైట్ సీక్వెన్స్ లో ఆయన కాలికి గాయమైయింది. పన్నెండు కుట్లు పడ్డాయి. తర్వాత రోజు దండకడియాల్ పాట షూటింగ్ కి వచ్చారు. ఆయన గాయంతో షూటింగ్ కి వచ్చారనే సంగతి తెలిసి షాక్ అయ్యా. ఒక మెడికల్ స్టూడెంట్ గా ఆ గాయం పెయిన్ ఎలా వుంటుందో తెలుసు. కానీ అదేం లెక్క చేయకుండా ఆయన షూట్ చేశారు. మీరు ఆ పాట చూస్తున్నపుడు ఆయన కాలికి గాయమైన సంగతి మీరు పసిగట్టలేరు. అంత డెడికేషన్ తో చేశారు. ధమాకా బ్యూటీఫుల్ మూవీ. డిసెంబర్ 23న థియేటర్లోకి వస్తుంది. అందరూ సినిమాని చూసి ఎంజాయ్ చేయాలి అన్నారు.
దర్శకుడు త్రినాథరావు నక్కిన మాట్లాడుతూ ధమాకా అదిరిపోయింది. మాములుగా లేదు. నేను రవితేజ ఫ్యాన్ నే. రవితేజ గారు ఏం చేస్తే థియేటర్లో ఎగిరి గంతేస్తారో తెలుసు. ఈ సినిమా చూస్తున్నప్పుడు అలాగే ఎగిరిగెంతాను. డైలాగులు మాములుగా లేవు. ప్రసన్న ఇరగొట్టాడు. రవితేజ గారు ఎలాంటి డైలాగులు చెబితే థియేటర్ అదిరిపోతుందో అలాంటి డైలాగులు అద్భుతంగా రాశాడు. ధమాక బాక్సాఫీసు బొనాంజా. భీమ్స్ బ్లాక్ బస్టర్ మ్యూజిక్ ఇచ్చాడు. శ్రీలీల డ్యాన్స్ ఇరగదీసింది. క్లైమాక్స్ కి ముందు వచ్చే పాటలో రవితేజ, శ్రీలీల డ్యాన్స్ కుమ్మేశారు. ఆడియన్స్ కాదు సీట్లు లేస్తాయి. డబుల్ ఇంపాక్ట్ వుంటుంది. ధమాకా అంచనాలకు మించి వుంటుంది. రవితేజ గారి ఎనర్జీ డబుల్ ఇంపాక్ట్ తో వుంటుంది. డిసెంబర్ 23న మీ అందరితో కలసి థియేటర్ చూస్తా అన్నారు.
నిర్మాత టీజీ విశ్వప్రసాద్ మాట్లాడుతూ రవితేజ గారు గొప్ప స్ఫూర్తి. మేము కూడా ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండానే జర్నీ మొదలుపెట్టాం. ఒక పదిహేను సినిమాలు డిఫరెంట్ బ్యానర్స్ తో కలిసి చేశాం. మొదటిసారి సోలోగా లార్జ్ కమర్షియల్ గా ధమాకా చేశాం. దిని తర్వాత మరో పదిహేను సినిమాలు సోలోగా నిర్మించ గలిగాం. ప్రసన్న, త్రినాథరావు నక్కిన కృతజ్ఞతలు. తెలుగమ్మాయి శ్రీలీల మా సినిమాలో చేయడం ఆనందంగా వుంది. భీమ్స్ అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. కార్తిక్ వండర్ ఫుల్ వర్క్ ఇచ్చారు. ధమాకా లాంటి బిగ్ కమర్షియల్ హిట్ మూవీలో భాగమైన అందరికీ కృతజ్ఞతలు తెలిపారు.
రచయిత ప్రసన్న కుమార్ మాట్లాడుతూ పాన్ ఇండియా సినిమాలు చేస్తూ ఒక ఇరవై సినిమాలు పైప్ లైన్ లో పెట్టిన ఏకైక సంస్థ పీపుల్ మీడియా. విశ్వ ప్రసాద్ గారు, వివేక్ గారు సక్సెస్ కావడానికి కారణం టెక్నిషియన్స్ ని ఫ్యామిలీ మెంబర్స్ లా చూస్తారు. ధమాక కి ఇంత బజ్ రావడానికి మొదట ఫైట్ చేసింది భీమ్స్. రవితేజకి సరిపడే మ్యూజిక్ ఇచ్చారు. త్రినాథరావు గారితో ఎనిమిదేళ్ళ అనుబంధం. ఒకరిని ఒకరు సపోర్ట్ చేసుకుంటూ సినిమా బాగా రావాలనే ప్రయత్నిస్తాం. ఆయన లేకపోతె నా కెరీర్ ఇలా వుండేది కాదు. శ్రీలీల మన ఫేవరేట్ నటి లిస్టు లో వుంటుంది. జనరల్ గా సినిమా కథ విని హీరోలు ఫైనల్ చేస్తారు. రవితేజ గారు ఒకరిలో ప్యాషన్, ఆకలి గుర్తించి సినిమా ఇస్తారని నా అభిప్రాయం. ఇండస్ట్రీలో స్టార్ అవ్వడానికి ప్రతి మెట్టు ఎక్కి పైకి వచ్చిన స్టార్ రవితేజ గారు. ధమాకా సినిమాని రవితేజ అభిమానిగా రాసుకున్నా. ఆయన ఏం చేస్తే బావుంటుందో ఎలా చూస్తే బావుంటుందో అది రాసుకున్నా. ఈ సినిమా ఎంత హిట్ అయినా అదంతా నా కళ్ళలో ఆయన వున్న విజువల్ అని నమ్ముతాను. డిసెంబర్ 23న సినిమా విడుదలౌతుంది. ఈ ఏడాది చివరిలో పెద్ద జెండా ఎగరబోతుంది. దాని పేరు ధమాకా అన్నారు.
దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు మాట్లాడుతూ రవితేజ మామూలోడు కాదు. అల్లరి ప్రియుడులో చిన్న వేషం వేశాడు. ఆర్కెస్ట్రా లో డ్రమ్స్ కొట్టే వేషం అది. అప్పుడు రవితేజ డ్రమ్స్ వాయించే స్టయిల్ చూస్తే ఎప్పుడో ఓ రోజు ఇండస్ట్రీ వాయించేస్తాడని అనిపించింది. పెళ్లి సందడి లో శ్రీలీల ప్లూట్ వాయించింది. దెబ్బకి ఆకాశంలో తారలు నెల వాలిపోయాయి. ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయింది. కలల నా సినిమాల్లో చేసిన రవితేజ, శ్రీలీల గొప్ప స్థాయిలో వుండటం ఎంతో ఆనందంగా వుంది. వీరు మరింత గొప్ప స్థాయికి ఎదగాలి. పీపుల్ మీడియా నా మాత్రు సంస్థ లాంటింది. వివేక్ , విశ్వ, అభిషేక్ ఏ సినిమా చేసినా నన్ను పిలిస్తారు. భీమ్స్ పాటలు అద్భుతంగా వుంది. యూనిట్ అందరికీ ఆల్ ది బెస్ట్. ధమాకా పెద్ద విజయం సాధించాలి అని కోరారు.
వివేక్ కూచిభొట్ల మాట్లాడుతూ ధమాకా పెద్ద విజయం సాధిస్తుంది. అందులో అనుమానం లేదు. సక్సెస్ మీట్ ఇంకా పెద్దగా చేస్తాం అన్నారు.
అభిషేక్ అగర్వాల్ మాట్లాడుతూ మా అసోసియేషన్ లో చాలా సినిమాలు వచ్చాయి. ధమాకా కూడా పెద్ద విజయం సాధిస్తుంది. పండగ పదిహేను రోజులు ముందే వచ్చేస్తుంది అన్నారు.
భీమ్స్ సిసిరోలియో మాట్లాడుతూ బెంగాల్ టైగర్ తర్వాత గ్యాప్ వచ్చింది. కొన్ని క్షణాలు బరువుగా వుంటాయి. మనిషి చెట్టు ఐతే పాట గాలి. చెట్టు ఒకే చోట వుంటుంది. గాలి ప్రపంచమంతా తిరిగొస్తుంది. నన్ను చెట్టుగా మలిచిన ప్రజలకి కృతజ్ఞతలు. ఎండిపోయిన ఈ చెట్టుకు నీళ్ళు పోసి మళ్ళీ నిలబెట్టిన నా దేవుడు రవితేజ గారికి పాదాభివందనం. భీమ్స్ వున్నాడు, మంచి పాటలు చేస్తాడని ప్రజల్లో నాపై మళ్ళీ నమ్మకాన్ని కల్పించిన రవితేజ గారిని జీవితంలో మర్చిపోలేను. దర్శక , నిర్మాతలకు ధన్యవాదాలు తెలిపారు.
దర్శకుడు మారుతి మాట్లాడుతూ రవితేజ గారు ఎంతో మందిని ఇన్సపైర్ చేసిన హీరో. ధమాకా లో మామూలు డోసు లేదు. రవితేజ గారి ఎనర్జీకి శ్రీలీల తోడవ్వడం చాలా ప్లస్. శ్రీలీల డ్యాన్స్ చూస్తుంటే మైండ్ బ్లోయింగ్. బీమ్స్ బ్లాక్ బస్టర్ మ్యూజిక్ ఇచ్చారు. ప్రేక్షకులు మంచి ఎంటర్ టైన్ మెంట్ కోసం ఎదురుచూస్తున్నారు. ధమాకా ఓపెనింగ్స్ మాములుగా వుండవు. ధమాకా పెద్ద హిట్ అవుతుంది. టీం అందరికీ ఆల్ ది బెస్ట్ తెలిపారు.
సముద్రఖని మాట్లాడుతూ ధమాక పెద్ద హిట్ అవుతుంది. భీమ్స్ అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. ఇలాంటి సౌండ్ విని చాలా కాలమైయింది. రవితేజ గారితో పని చేయడం గొప్ప ఆనందాన్ని ఇచ్చింది. ధమాకా ఆయనకి మరో పెద్ద విజయాన్ని ఇస్తుంది. అన్నారు.
హైపర్ ఆది మాట్లాడుతూ ధమాకా సినిమా ఒక ప్రేక్షకుడి గా చూశాను. ఫుల్ ఆన్ ఎంటర్ టైన్ మెంట్. ధమాకా లో రవితేజ గారి ఎనర్జీ మాములుగా వుండదు. శ్రీలీల పిచ్చిపిచ్చిగా నచ్చేస్తుంది. తెలుగులో ఇంత మంచి హీరోయిన్ దొరకడం అదృష్టం. ప్రసన్న అద్భుతమైన మాటలు రాశారు. దర్శకుడు త్రినాథరావు నక్కిన ఒక ప్రేక్షకుడి గా సినిమాని ఎంజాయ్ చేస్తారు. ఆయన విజయ రహస్యం అదే. ఇందులో నాకు మంచి పాత్ర ఇచ్చారు. ధమాకాలో అన్ని ఎలిమెంట్స్ వున్నాయి. సినిమా చూశాను కాబట్టి రివ్యూ ఇస్తాను. ధమాకా ప్లస్ పాయింట్స్ రవితేజ ఎనర్జీ , ఎంటర్ టైన్ మెంట్, శ్రీలీల గ్లామర్ , నటన, కామెడీ, బీమ్స్ మ్యూజిక్, ప్రసన్న కుమార్ డైలాగ్స్, నక్కిన త్రినాథరావు గారి డైరెక్షన్. ఈ సినిమాకి మైనస్ పాయింట్స్ ఏమిటంటే సినిమా ఇంకాసేపు వుంటే బావున్ను అనిపిస్తుంది. ఫైనల్ వర్దిక్ట్ ఒకసారి చూడండి వీలైతే రెండోసారి చూడండి . సినిమాని థియేటర్ లో చూడండి ఎంటర్ టైన్ మెంట్ పీక్స్ అన్నారు.
దర్శకుడు శ్రీవాస్ మాట్లాడుతూ రవితేజ గొప్ప స్ఫూర్తిని ఇచ్చే వ్యక్తి. నిరంతరం ఎనర్జిటిక్ గా పని చేస్తారు. రవితేజ ఎనర్జిటిక్ గా చేసిన ఈ సినిమా డబుల్ ధమాకా. ఈ సినిమా కథ నాకు తెలుసు. ఖచ్చితంగా పెద్ద విజయం సాధిస్తుంది. పీపుల్ మీడియాకి ఈ సినిమా మంచి పేరు తీసుకొస్తుంది.ధమాకా డబుల్ ధమాకా అవుతుంది అన్నారు.