హీరో చేతన్ మద్దినేని ఇంటర్వ్యూ
హీరో చేతన్ మద్దినేని బర్త్ డే స్పెషల్ ఇంటర్వ్యూ
రోజులుమారాయి సినిమాతో నటుడిగా తెలుగు తెరకు పరిచయం అయిన చేతన్ మద్దినేని తరువాత గల్ఫ్ సినిమాలో నటించారు. తరువాత ఒక ఎక్సపర్మెంటల్ సినిమా బీచ్ రోడ్ చేతన్ సినిమాలో హీరోగా నటించడమే కాకుండా దర్శకత్వం వహించారు. ఒక ఐఫోన్ లో చిత్రీకరించిన ఈ మూవీ థియేటర్స్ లో విడుదలై ప్రశంశలు అందుకుంది. ఆ సినిమా తరువాత విడుదలైన ఫస్ట్ ర్యాంక్ రాజు సినిమా చేతన్ మద్దినేని కు నటుడిగా మంచి గుర్తింపు తెచ్చింది. థియేటర్స్ లో నే కాకుండా అమెజాన్ లో కూడా ఈ మూవీ బాగా కలెక్ట్ చేసింది.
థియేటర్స్ లో సినిమా చూడ్డం ఆ అనుభూతిని బాగా ఆస్వాదించే నేను థియేటర్స్ కోసమే సినిమా చెయ్యాలనే ఆలోచనలో ఉన్నాను. కోవిడ్ కారణంగా దాదాపు రెండేళ్లు సినిమా చెయ్యలేదు. ఈ గ్యాప్ లో లీస్ట్ ట్రాస్ బర్గ్ అనే ఇన్స్టిట్యూట్ కు వెళ్ళాను, లాస్ ఏంజిల్స్ లో ఉన్న ఈ ఇన్స్టిట్యూట్ లో మెథడ్ యాక్టింగ్ నేర్చుకున్నాను. ఆ తరువాత కోవిడ్ తగ్గి థియేటర్స్ మళ్లీ తెరుచుకున్నాయి.
ఫస్ట్ ర్యాంక్ రాజు తరువాత చాలా కథలు విన్నాను, కొన్ని ఆఫర్స్ వచ్చాయి అలా కథలు వింటున్న సమయంలో గోపిమోహన్ గారు చెప్పిన ఒక స్టోరీకి బాగా కనెక్ట్ అయ్యాను. రొమాంటిక్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా ఉంటుంది. ఈ కథ నచ్చి నేనె సొంతంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాను. యాభై శాతం పూర్తి అయిన ఈ సినిమాను పోలెండ్ లో షూట్ చేశాం.
అల్లరి నరేష్ తో జేమ్స్ బాండ్ సినిమాను డైరెక్ట్ చేసిన సాయి కిషోర్ గారు ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు. రెడీ, డీ, చిరునవ్వుతో సినిమాల తరహాలో ఈ మూవీ ఉండబోతొంది. గోపిసుందర్ ఈ సినిమాకు మంచి మ్యూజిక్ ఇచ్చారు. ఇదివరకే మూడు పాటలను చిత్రీకరించాము. హెబ్బ పటేల్ ఈ సినిమా కోసం మంచి మెకోవర్ అయ్యి బెస్ట్ పెర్ఫామెన్స్ ఇచ్చింది. అలాగే మేజర్ యాక్టర్స్ ఈ మూవీలో నటించారు. త్వరలో ఈ మూవీ టైటిల్ ను అనౌన్స్ చెయ్యబోతున్నాము అన్నారు.
రేవు జనవరి 29న చేతన్ మద్దినేని పుట్టినరోజు జరుపుకుంటున్నారు