ఉగ్రం మూవీ టీజర్ లాంచ్ ఈవెంట్
అల్లరి నరేష్, విజయ్ కనకమేడల, షైన్ స్క్రీన్స్ ఉగ్రం టీజర్ లాంచ్ చేసిన అక్కినేని నాగ చైతన్య
ఉగ్రం టీజర్ నెక్స్ట్ లెవల్ లో వుంది సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ కావాలి టీజర్ లాంచ్ ఈవెంట్ లో నాగ చైతన్య
అల్లరి నరేష్ హీరోగా విజయ్ కనకమేడల దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ఉగ్రం. నాంది వంటి సూపర్ హిట్ తర్వాత ఈ ఇద్దరి క్రేజీ కాంబినేషన్ లో వస్తున్న రెండో చిత్రమిది. షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మిస్తున్నారు. సమ్మర్ లో సినిమాను విడుదలకు సన్నాహాలు చేస్తున్న మేకర్స్ ఈరోజు టీజర్ను విడుదల చేసి ప్రమోషన్స్ను ప్రారంభించారు. టీజర్ లాంచ్ ఈవెంట్ కి ముఖ్య అతిథిగా విచ్చేసిన హీరో నాగ చైతన్య టీజర్ ని లాంచ్ చేశారు.
నరేష్ పవర్ ఫుల్ పోలీసుగా ఎంట్రీ ఇవ్వడం , అడవిలో చట్టాన్ని ఉల్లంఘించేవారిని కొట్టడం వంటి ఆసక్తికరమైన సన్నివేశాలతో టీజర్ ప్రారంభమైయింది. వంటి మీద యూనిఫాం ఉందనేగా ఈ పొగరు. ఈ రోజు నీదే నాకూ ఓ రోజు వస్తుంది అని విలన్ చెప్పగా నాది కానీ రోజు కూడా నేను ఇలాగే నిలబడతా అర్ధమైయిందా అని నరేష్ బదులివ్వడం నరేష్ పాత్ర ఉగ్రంలోఎంత ఫెరోషియస్ గా వుంటుందో తెలియజేస్తుంది.
విలన్స్ తన కుటుంబం జోలికి వచ్చినపుడు పోలీసుగా వున్న నరేష్ ఎలాంటి ఉగ్రరూపం చూపిస్తాడో అనేది క్యురియాసిటీ పెంచేలా చూపించారు. అల్లరి నరేష్ పాత్రను విజయ్ కనకమేడల కొత్తగా, ఇంటెన్స్ గా డిజైన్ చేశారు. సిన్సియర్ పోలీస్ ఆఫీసర్గా నరేష్ సరిగ్గా సరిపోవడమే కాకుండా ప్రేక్షకులని ఎంగేజ్ చేసేలా ఆకట్టుకున్నారు. నరేష్ భార్య పాత్రలో మిర్నా కనిపించింది.
తూమ్ వెంకట్ కథ అందించగా, అబ్బూరి రవి కొన్ని పవర్ ఫుల్ డైలాగ్స్ రాశారు. షైన్ స్క్రీన్స్ ప్రొడక్షన్ డిజైన్ గ్రాండ్గా ఉంది. ఈ ఇంటెన్స్ యాక్షన్కి సిద్ సినిమాటోగ్రఫీ అత్యద్భుతంగా ఉంది, శ్రీచరణ్ పాకాల తన బ్యాక్గ్రౌండ్ స్కోర్తో అదనపు బలాన్ని తెచ్చారు. ఛోటా కె ప్రసాద్ ఈ చిత్రానికి ఎడిటర్, బ్రహ్మ కడలి ప్రొడక్షన్ డిజైనర్.
టీజర్ లాంచ్ ఈవెంట్ లో నాగచైతన్య మాట్లాడుతూ ఉగ్రం టీజర్ చూసిన వెంటనే అదిరిపోయిందనిపించింది. నరేష్ గారిని చూసి స్టన్ అయిపోయాను. నాంది తర్వాత నరేష్ మళ్ళీ అలాంటి ఇంటెన్స్ రోల్ చేయడం చాలా ఆనందంగా వుంది. అల్లరి తో మొదలుపెట్టి ఈ రోజు ఉగ్రంతో వస్తున్నారు. ఇదొక అద్భుతమైన ప్రయాణం. నరేష్ కి అభినందనలు. విజయ్ నరేష్ కాంబినేషన్ ఒక బ్రాండ్ లా పడిపోయింది. ఉగ్రం టీజర్ చూస్తే నెక్స్ట్ లెవల్ అనిపించింది. విజయ్ కి కూడా అభినందనలు. వీరి కాంబినేషన్ లో మరిన్ని సినిమాలు రావాలి. అన్ని డిపార్ట్ మెంట్ అద్భుతంగా పని చేశారు. సాహు హరీష్ వండర్ ఫుల్ ప్రోడ్యుసర్స్. మజిలీ నా కెరీర్ లో బెస్ట్ మూవీ. వాళ్ళు ఆ సినిమాని సపోర్ట్ చేసిన విధానం మర్చిపోలేను. ఉగ్రంలో కూడా ఆ క్యాలిటీ కనిపిస్తోంది. టీం అందరికీ ఆల్ ది బెస్ట్. ఈ సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ కావాలి అని కోరారు.
నరేష్ మాట్లాడుతూ ఈ వేడుకకు అతిధిగా వచ్చిన నాగ చైతన్య గారికి కృతజ్ఞతలు. చైతు నాకు చాలా ఇష్టమైన వ్యక్తి. ఆయన చేతుల మీదగా ఈ ఈవెంట్ జరగడం అనందంగా వుంది. ఒక నటుడిని దర్శకుడు ఎంత నమ్మితే అన్ని మంచి విజయాలు వస్తాయి. మా నాన్నగారు నన్ను నమ్మినపుడు వరుస విజయాలు వచ్చాయి. క్రిష్ నమ్మినపుడు గమ్యం, సముద్రఖని నమ్మినపుడు శంభో శివ శంభో ఇలా మంచి సినిమాలు వచ్చాయి. దిని తర్వాత నాందితో విజయ్ గారు నాకు కొత్త రూటు చూపించారు. నాది కానీ రోజు కూడా నేను ఇలానే నిలబడతా అనే మాట ఉగ్రం టీజర్ లో వుంది. విజయ్ కూడా నాది కాని రోజు నిలబడ్డారు. నేను అలానే నిలబడతా. మా కాంబినేషన్ లో సినిమాలు వస్తూనే వుంటాయి. అంత నమ్మకంగా వున్నాం. అబ్బూరి రవి, చోటా ప్రసాద్, బ్రహ్మకడలి, సిద్ అందరూ బాగా కష్టపడి ఈ సినిమా చేశాం. నాంది సమయంలో బడ్జెట్ విషయంలో కొన్ని పరిమితులు వున్నాయి. కానీ ఈ సినిమాకి పరిమితులు ఏమీ పెట్టకుండా సాహు గారు హరీష్ గారు ఎక్కడా రాజీపడకుండా నిర్మించారు. ఈ సినిమా పెద్ద హిట్ అయి మా కాంబినేషన్ ఇలాగే కొనసాగాలి. అని కోరారు.
విజయ్ కనకమేడల మాట్లాడుతూ నిజాయితీగా సినిమా తీస్తే ప్రేక్షకులు ఎంతగొప్పగా ఆదరిస్తారో నాంది విజయం చూపించింది. ఉగ్రం కూడా అంతే నిజాయితీగా వుంటుంది. ఒక నిజాయితీ గల పోలీసు అధికారి కుటుంబాన్ని టచ్ చేస్తే ఎలా వుంటుందో ఉగ్రంలో చూపిస్తున్నాం. నరేష్ గారి నటనతో మేము అనుకున్న ఎమోషన్ డబల్ అయ్యింది. మరోసారి నమ్మి అవకాశం ఇచ్చిన నరేష్ గారి ప్రత్యేక కృతజ్ఞతలు. కథని నమ్మి ఎక్కడా రాజీ పడకుండా సినిమా నిర్మిస్తున్న సాహుగారికి, హరీష్ గారు జీవితాంతం థాంక్స్ చెబుతున్నాను. కథ ఇచ్చి వెంకట్ కి, సంగీతం అందించిన శ్రీ చరణ్ కి, డైలాగ్స్ రాసిన అబ్బూరి రవి గారికి, డీవోపీ సిద్ కి, ఆర్ట్ బ్రహ్మకడలి గారికి టీమ్ అందరికీ థాంక్స్.
అబ్బూరి రవి మాట్లాడుతూ ఉగ్రం ప్రేక్షకులకు ఒక అద్భుతమైన అనుభూతిని ఇచ్చే సినిమా. మనకు తెలియకుండానే కన్నీళ్ళు వచ్చే సినిమా, ఆనందం ఇచ్చే సినిమా మ్ కోపం తెప్పించే సినిమా. ఈ సినిమాకి మాటలు రాసే అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు నరేష్ గారికి కృతజ్ఞతలు తెలిపారు.
మిర్నా మాట్లాడుతూ ఉగ్రం చాలా స్పెషల్ మూవీ. ఈ అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు కృతజ్ఞతలు. నా అందరికీ థాంక్స్. టీజర్ మీ అందరికీ నచ్చడం ఆనందంగా వుంది. సినిమా ఖచ్చితంగా పెద్ద బ్లాక్ బస్టర్ అవుతుంది. అన్నారు. ఈ ఈవెంట్లో సాహు గారపాటి వెంకట్, చోటా కే ప్రసాద్, బ్రహ్మ కడలి, సిద్, శ్రీ చరణ్ తదితరులు పాల్గొన్నారు.