జైత్ర సినిమా ట్రైలర్ విడుదల
అల్లం శ్రీతన్మయి సమర్పణలో ఎయిమ్స్ మోషన్ పిక్చర్స్ నిర్మిస్తున్న చిత్రం జైత్ర. సన్నీ నవీన్, రోహిణీ రేచల్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. తోట మల్లికార్జున దర్శకునిగా పరిచయం అవుతున్న ఈ చిత్రానికి అల్లం సుభాష్ నిర్మాత. మే 26న థియేటర్స్ లో ఈ చిత్రం గ్రాండ్ గా విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ ట్రైలర్ ను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా దర్శకుడు మల్లికార్జున తోట మాట్లాడుతూ
రాయలసీమ స్లాంగ్ , నేటివిటీతో తెరకెక్కిన ఈ సినిమా మట్టితో చుట్టరికం చేసే ఒక రైతు కథను అందంగా తెరకెక్కించడం జరిగింది. మే 26న రాబోతున్న మా సినిమాను అందరూ ఆదరిస్తారన్న నమ్మకం ఉందని తెలిపారు.
నిర్మాత అల్లం సుభాష్ మాట్లాడుతూ
ఇటీవల విడుదలైన ఈ చిత్ర సాంగ్స్, టీజర్ కు యూట్యూబ్ లో మంచి రెస్పాన్స్ లభించింది. అలాగే ట్రైలర్ కు కూడా మంచి ఆదరణ లభిస్తోంది. జైత్ర సినిమా ఒక రైతు కథతో చాలా సహజంగా మంచి స్లాంగ్ తో రాబోతోందని తెలిపారు.
హీరో సన్నీ నవీన్ మాట్లాడుతూ
రాయలసీమ నేపథ్యంలో సినిమా అంటే ఫ్యాక్షన్ తప్పకుండా ఉంటుంది, కానీ జైత్ర సినిమా అందుకు భిన్నంగా రాయలసీమలో నివసించే ఒక రైతు కుటుంబానికి చెందిన కథ కథనాలతో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మా చిత్ర టీజర్, ట్రైలర్, సాంగ్స్ చూడండి, మీకు తప్పకుండా నచ్చుతాయి. అలాగే సినిమాకు వచ్చిన మీకు మా సినిమా మరింత నచ్చుతుందని తెలిపారు.
నటీనటులు :
సన్నీ నవీన్, రోహిణి రేచల్, వంశీ నెక్కంటి, సునీత మనోహర్ తదితరులు
సాంకేతికవర్గం :
కెమెరా: మోహన్ చారి
పాటలు : కిట్టు విస్సా ప్రగడ
సంగీతం : ఫణికళ్యాణ్
ఎడిటర్: విప్లవ్ నైషదం
దర్శకత్వం : తోట మల్లిఖార్జున్
నిర్మాత: అల్లం సుభాష్.