పోయే ఏనుగు పోయే మూవీ లిరికల్ సాంగ్ విడుదల
మాసివ్ మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ సిసిరోలియో సంగీతాన్ని అందించిన పోయే ఏనుగు పోయే నుండి లిరికల్ సాంగ్ లాంచ్
బాహుబలి ప్రభాకర్ ప్రధాన పాత్రలో కె.శరవణన్ స్వీయ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం పోయే ఏనుగు పోయే. ధమాక, బలగం చిత్రాలతో మోస్ట్ వాంటెడ్ మ్యూజిక్ డైరక్టర్ పేరు తెచ్చుకున్న భీమ్స్ సిసిరోలియో ఈ చిత్రానికి సంగీతాన్ని సమకూర్చారు. ఈ చిత్రంలోని ఈడొచ్చి పైటేసిన చిన్నదాన్ని అనే లిరికల్ వీడియో సాంగ్ ని ఈ రోజు సిల్లీ మాంక్స్ ఆడియో ద్వారా విడుదల చేశారు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో తెరకెక్కుతోన్న ఈ పాన్ ఇండియా చిత్రం ప్రస్తుతం సెన్సార్ పనుల్లో బిజీగా ఉంది. త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది.
ఈ సందర్భంగా దర్శక నిర్మాత కె.శరవణన్ మాట్లాడుతూమాసివ్ మ్యూజిక్ డైరక్టర్ భీమ్స్ సిసిరోలియో గారు సంగీతాన్ని అందించిన మా చిత్రంలోని ఐటెమ్ లిరికల్ వీడియో ఈ రోజు లాంచ్ చేశాము. శ్రీ సిరాగ్ ఈ పాటను రచించారు. మా సినిమా కథ విషయానికొస్తేనిధిని దక్కించుకోవడానికి కొంత మంది ఒక ఏనుగు పిల్లని బలి ఇవ్వాలనుకుంటారు దాన్ని ఒక కుర్రాడు ఎలా ఆపాడు? తన తల్లి దగ్గరకు ఎలా చేర్చాడు అన్నది కథాంశం. ఇందులో బాహుబలి ప్రభాకర్, ధన్ రాజ్, రఘు బాబు, తమిళ నటుడు మనోబాల కీలక పాత్రల్లో నటించారు. అలాగే అద్భుతమైన గ్రాఫిక్స్ తో విజువల్ వండర్ గా సినిమాను తీర్చి దిద్దాము. ఎంతో వినోదభరితంగా, భారీ తారాగణంతో తెరకెక్కించిన ఈ చిత్రం అతి త్వరలో అన్ని భాషల్లో విడుదలై ఆదరణ పొందుతుందన్న నమ్మకం ఉందని తెలిపారు.