వాలాట్టి మూవీ ఫస్ట్ లుక్ విడుదల
డిఫరెంట్ కథాంశంతో రూపొందిన వాలాట్టి చిత్రాన్నితెలుగులో ప్రేక్షకులకు అందిస్తోన్న స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు
ఎన్నో సక్సెస్‌ఫుల్ చిత్రాలను తెలుగు ప్రేక్షకులకు అందించి హిట్ చిత్రాల నిర్మాతగా తనదైన గుర్తింపును పొందిన వ్యక్తి దిల్ రాజు. ఆయన ఇప్పుడు మరో వైవిధ్యమైన సినిమాను తెలుగు ప్రేక్షకులకు అందించటానికి సిద్ధమయ్యారు ఆ చిత్రమే వాలాట్టి. సాధారణంగా మనుషులు సాహసాలు చేయటాన్ని చూసుంటాం. వాటి ఆధారంగా రూపొందిన సినిమాలను చూసుంటాం. కానీ తొలిసారి కొన్ని పెంపుడు కుక్కులన్నీ కలిసి ఓ సాహసాన్ని చేస్తే ఎలా ఉంటుంది? అదొక అద్భుతమనే చెప్పాలి. అలాంటి హృదయానికి హత్తుకునే కథతో రూపొందిన సినిమానే వాలాట్టి. రోషన్ మాథ్యు, శోభు షాహిర్, ఇంద్రన్స్, సన్నీ వానే, సజ్జు కురుప్ తదితరులు ఇందులోని పెంపుడు కుక్కల పాత్రలకు వాయిస్ ఓవర్‌ను అందించారు. భారతీయ సినిమా చరిత్రలో తొలిసారి కుక్కలు, ఇతర పెంపుడు జంతువులు ఉన్న సినిమాలో మనుషులు భాగం అయ్యారని చెప్పాలి.
లవ్, కామెడీ, అడ్వెంచర్ అన్నీ కలగలసి ఓ సరికొత్త కోణంలో వాలాట్టి సినిమా సాగుతుంది. కేరళ మినహాఈ సినిమా వరల్డ్ వైడ్ థియేట్రికల్ హక్కులను కె.ఆర్.జి స్టూడియోస్ అధినే కార్తీక్ గౌడ దక్కించుకున్నారు. ఈ సందర్భంగావిలక్షణమైన కథ, కథనాలు, పాత్రలతో రూపొందిన వాలాట్టి చిత్రం ఇటు యూత్‌తో పాటు పెద్దలకు కూడా నచ్చుతుందని కె.ఆర్.జి స్టూడియోస్ అధినేత కార్తీక్ గౌడ తెలిపారు. తెలుగులో ఈ చిత్రాన్ని దిల్ రాజు, హిందీలో అనిల్ తడాని, హోం స్క్రీన్ ఎంటర్‌టైన్మెంట్ బ్యానర్ ఓవర్ సీస్‌లో సినిమాను ప్రేక్షకులకు అందిస్తున్నారని కార్తీక్ గౌడ తెలియజేశారు.
వాలాట్టి చిత్రాన్ని విజయ్ బాబు సమర్పణలో ఫ్రైడే ఫిల్మ్ హౌస్ బ్యానర్ నిర్మించింది. దేవన్ ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. జూలై 14న మలయాళంలో విడుదలవుతున్న ఈ చిత్రాన్ని వారం రోజుల తర్వాత తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తున్నారు నిర్మాతలు.