Reading Time: 4 mins

తారంగా మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్

తారంగా చిత్ర టీజర్ & ట్రైలర్ ను విడుదల చేసిన వరంగల్ ఎంపీ దయాకర్ బాబు, నవీన్ యాదవ్, దర్శకుడు శివ నాగు, స్వాతిరెడ్డి

ఎస్ ఆర్ కె ప్రొడక్షన్స్ పతాకంపై కట్ల ఇమ్మోర్టల్, కట్ల డాండి,పూజ నాగేశ్వర్ హీరో, హీరోయిన్స్ గా సంపత్ కుమార్ దర్శకత్వంలో నిర్మాత శ్రీనివాస రెడ్డి కర్రి,
నిర్మించిన చిత్రం తారంగా.అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని విడుదలకు సిద్దమైంది. సెప్టెంబర్ 2 న పవన్ కళ్యాణ్ బర్త్ డే ను పురస్కరించుకొని చిత్ర టీజర్, గ్లిమ్స్, ట్రైలర్ ను విడుదల చేశారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా వచ్చిన వరంగల్ ఎంపీ దయాకర్ బాబు గారు చిత్ర టీజర్ ను విడుదల చేయగా, జూబ్లీహిల్స్ కన్స్టెన్సీ ఎమ్మెల్యే అభ్యర్థి నవీన్ యాదవ్ గ్లిమ్స్ ను విడుదల చేశారు.యూసఫ్ గూడా జనసేన మహిళా అధ్యక్షురాలు స్వాతి రెడ్డి, శత చిత్రాల నిర్మాత తుమ్మలపల్లి రామ సత్య నారాయణ, దర్శకుడు శివ నాగు, నైజాం డిస్ట్రిబ్యూటర్ రాజేంద్ర ప్రసాద్ తదితరులు చిత్ర ట్రైలర్స్ ను విడుదల చేశారు. అనంతరం చిత్ర యూనిట్ ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో

వరంగల్ ఎంపీ దయాకర్ బాబు మాట్లాడుతూఈ తారంగా చిత్ర ట్రైలర్ చూస్తుంటే ఇందులో బలమైన కథ, సహజమైన పాత్రలతో దర్శకుడు చాలా చక్కగా తెరకెక్కించాడు. ఇందులోని నటీ నటులు అందరూ చాలా బాగా నటించారు. కొత్త ట్యాలెంట్ ను ఎంకరేజ్ చేస్తూ చిత్ర నిర్మాత శ్రీనివాస రెడ్డి నూతన నటీనటులతో ఈ తారంగా చిత్రాన్ని ఎక్కడా కాంప్రమైజ్ అవకుండా క్వాలిటీగా రూపొందించిన్నట్లు తెలుస్తుంది. మంచి సినిమాలను ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారని ఈ మధ్య వచ్చిన సినిమాలు నిరూపించాయి , చిన్న సినిమాగా తెరకెక్కిన ఈ సినిమా విడుదల తర్వాత మంచి విజయం సాధించి పెద్ద సినిమాగా నిలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు.

నవీన్ యాదవ్ మాట్లాడుతూ ఆర్పీ( కట్ల రాజేంద్ర ప్రసాద్) నాకు బాగా తెలుసు. తను చాలా కష్టపట్టాడు.ఇప్పుడు తన కొడుకును పెట్టి హీరో చేస్తున్నందున ఈ ఫంక్షన్ కు రావడం జరిగింది. ఈ సినిమా ట్రైలర్ బాగుంది. హీరో చాలా బాగా నటించాడు. మంచి కాన్సెప్ట్ తో చేస్తున్న ఈ సినిమా దర్శక, నిర్మాతలకు బిగ్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు.

చిత్రం దర్శకుడు సంపత్ కుమార్ మాట్లాడుతూ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు బర్త్ డే శుభాకాంక్షలు. ఈ రోజు తన పుట్టిన రోజున పెద్దలు వచ్చి చిత్ర టీజర్, ట్రైలర్ ను విడుదల చేసుకోవడం చాలా హ్యాపీగా ఉంది. ఈ సినిమా తెరపైకి రావడానికి శ్రీనివాస్ రెడ్డిగారే ప్రధాన కారణం. ఎందుకంటే ఇంతకుముందు మేము మూడు షార్ట్ ఫిల్మ్స్ తీశాము. వాటికీ అవార్డ్స్ కూడా వచ్చాయి. ఆతరువాత నేను యు.యస్ కు వెళ్లడం జరిగింది.అక్కడ నేను మంచి కథ రాసుకోవడం జరిగింది లో ఉన్న నేను సస్పెన్స్ థ్రిల్లర్ గా సాగే లవ్ స్టోరీ తో మాఫియా బ్యాక్ డ్రాప్ లో మంచి కథ రాసుకొని శ్రీనివాస్ రెడ్డి గారికి చెపితే సినిమా చేద్దాం అన్నారు. హీరో కొరకు చూస్తున్న మాకు ఆర్పీ గారు గుర్తుకొచ్చారు. ఎందుకంటే తన కొడుకు కట్ల ఇమ్మోటల్ తో హృదయ స్పందన షార్ట్ ఫిల్మ్ కు అవార్డు రావడం జరిగిందని తన కొడుకు అయితే బాగుంటుందని ఈ సినిమా చేయడం జరిగింది. చిత్ర హీరో కూడా పవన్ కళ్యాణ్ వీరాభిమాని అవ్వడం అలాగే ఈ రోజు పవన్ కళ్యాణ్ బర్త్ డే అవ్వడంతో పాటు ఈ చిత్ర టీజర్, ట్రైలర్ ను విడుదల చేసుకోవడం చాలా సంతోషంగా ఉందని అన్నారు.

నిర్మాత శ్రీనివాస రెడ్డి కర్రి మాట్లాడుతూ వరంగల్ ఎంపీ దయాకర్ బాబు, జూబ్లీహిల్స్ కన్స్టెన్సీ ఎమ్మెల్యే అభ్యర్థి నవీన్ యాదవ్, యూసఫ్ గూడా జనసేన మహిళా అధ్యక్షురాలు స్వాతి రెడ్డి, నిర్మాత తుమ్మలపల్లి రామ సత్య నారాయణ, దర్శకుడు శివ నాగు, నైజాం డిస్ట్రిబ్యూటర్ రాజేంద్ర ప్రసాద్ తదితరులు వచ్చి మా చిత్ర టీజర్, ట్రైలర్ ను విడుదల చేసిన వారందరికీ నా ధన్యవాదములు.
దర్శకుడు సంపత్ కుమార్ చెప్పిన కథ నచ్చడంతో కర్చుకు వెనుకాడ కుండా ఈ చిత్రాన్ని నిర్మించడం జరిగింది. సస్పెన్స్ థ్రిల్లర్ గా సాగే లవ్ స్టోరీ తో మాఫియా బ్యాక్ డ్రాప్ లో వస్తున్న తారంగా సినిమాను ప్రేక్షకులందరూ ఆదరించి ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు.

కట్ల రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూతెరపై వినిపించే డైలాగ్ తో పాటు కనిపించే ప్రతి దృశ్యం బాగా తెరకేక్కించారు దర్శకులు సంపంత్ గారు. శంకరపల్లి లోని టెంపుల్ దగ్గర జరిగే జాతరను రియలిస్టిక్ గా తీయడం జరిగింది. ఇలా ప్రతిది నిర్మాత ఖర్చుకు వెనుకడకుండా ఈ సినిమా తీయడం జరిగింది. మా సినిమాకు వచ్చి చుడండి పెద్ద సినిమాలలో లేనిది మా సినిమాలో ఉందనే విధంగా ప్రతి సీన్స్ సస్పెన్స్ గరయ్యేలా మిమ్మల్ని అలరిస్తుంది. మేమంతా ఈ సినిమాను చాలా కష్టపడుతూ ఇష్టపడి చేశాము. చూసిన ప్రతి ఒక్కరికీ ఈ సినిమా కచ్చితంగా నచ్చుతుందని ఆశిస్తున్నాను అన్నారు.

చిత్ర హీరో కట్ల ఇమ్మోటల్ మాట్లాడుతూపవన్ కళ్యాణ్ పుట్టిన రోజు వస్తే నేను అస్సలు ఇంట్లో ఉండను.కేక్ కటింగ్ అంటూ బయట తిరుగుతూనే ఉంటాను. అలాంటిది నేను ఎంతో అభిమానించే నా అన్న, మనందరి అన్న పవన్ కళ్యాణ్ పుట్టిన రోజున నేను నటించిన చిత్ర టీజర్, ట్రైలర్ ను విడుదల చేయడం చాలా సంతోషంగా ఉంది.ఇది నాకు మా నాన్న, దర్శక, నిర్మాతలు ఇచ్చిన పెద్ద గిఫ్ట్. నాకున్న ఏకైక కోరిక ఏంటంటే మా నాన్నతో కలసి పవన్ కళ్యాణ్ అన్నతో ఫోటో దిగడం. ఆ క్షణం కోసం నేను కష్టపడుతూనే ఉంటాను.పవన్ అన్న గారికి ఉస్సేన్ సాగర్ అంతటి పెద్ద మనసున్న మీరు మా లాంటి అభిమానుల బాధలు తెలుసు కోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.నన్ను నమ్మి ఇలాంటి మంచి కథ ఉన్న సినిమాలో నటించే అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు ధన్యవాదములు అన్నారు.

నిర్మాత రామసత్యనారాయణ మాట్లాడుతూరియల్ ఎస్టేట్ లో సక్సెస్ అయిన శ్రీనివాస్ రెడ్డి ఈ సినిమాతో ఇండస్ట్రీ కు రావడం చాలా సంతోషం. అక్కడ సక్సెస్ అయినట్లే సినీ ఇండస్ట్రీ లో కూడా తను బిగ్ సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇందులో నటించిన వారంతా చాలా బాగా నటించారు .ఇందులోని పాటలకు మంచి మ్యూజిక్ ఇచ్చాడు సంగీత దర్శకుడు. ఈ సినిమా ద్వారా కొత్త టెక్నిషియకన్స్ రావడం సంతోషం. కట్ల రాజేంద్ర ప్రసాద్ చాలా కష్ట పడే వ్యక్తి. తన సపోర్ట్ తో దర్శకుడు చాలా బాగా తీశాడు.మంచి కథతో వస్తున్న ఈ సినిమా బిగ్ హిట్ అవ్వాలని అన్నారు.

యూసఫ్ గూడ జనసేన అధ్యక్షురాలు స్వాతి రెడ్డి మాట్లాడుతూఈ రోజు ఉదయం నుండి సాయంత్రం వరకు తీరిక లేకుండా పవన్ కళ్యాణ్ బర్త్ డే వేడుకలు జరుపుకుంటున్నాము. అలాంటిది తన పుట్టినరోజున ఈ సినిమా టీజర్ ను విడుదల చేస్తున్నందున ఈ సినిమా టీం అందరికీ బెస్ట్ విషెష్ తెలుపుతున్నాము. దర్శక, నిర్మాతలు కొత్తవారైనా చాలా బాగా తీశారు.మంచి కాన్సెప్ట్ తో తీసిన ఈ సినిమా బిగ్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు

దర్శకులు శివ నాగేశ్వరరావు మాట్లాడుతూమంచి ప్రయత్నంతో తారంగ సినిమా ద్వారా కొత్త వారికి అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు ధన్యవాదములు తెలుపుతున్నాను.సినిమా మేకింగ్ బాగుంది. ట్రైలర్ బాగుంది. ఇందులో అందరూ బాగా నటించారు.నేను చిరంజీవి కి వీరాభిమానిని హీరో కట్ల ఇమ్మోటల్ గెటప్ చూస్తుంటే పున్నమి నాగు లో చిరంజీవి లా కనిపిస్తున్నాడు.
మంచి కథతో వస్తున్న ఈ సినిమా బిగ్ హిట్ అవ్వాలని అన్నారు.

డి ఓ పి ప్రసాద్ మాట్లాడుతూ చిరంజీవి గారితో 40 సినిమాలకు, మరియు పవన్ కళ్యాణ్ సినిమాలకు అసిస్టెంట్ కెమెరామెన్ గా చేశాను.ఆ తరువాత ఈ సినిమా చెయ్యడానికి ప్రధాన కారణం కట్ల రాజేంద్ర ప్రసాద్ గారే సినిమా బాగా వచ్చింది. పెద్ద విజయం సాదించాలి అన్నారు.

ఇంకా ఈ కార్యక్రమంలో సముద్రుడు హీరో రమాకాంత్, జనసేన కార్యకర్తలు తదితరులు పాల్గొని మంచి కథతో వస్తున్న ఈ సినిమా బిగ్ హిట్ అవ్వాలని అన్నారు.

నటీ నటులు :

కట్ల ఇమ్మోర్టల్,కట్ల డాండి,పూజ నాగేశ్వర్,శ్రీనివాస్ రెడ్డి, మరియు కోటి,మల్లేష్,కట్ల రాజేంద్ర ప్రసాద్

సాంకేతిక నిపుణులు :

నిర్మాతలు : శ్రీనివాస్ రెడ్డి కర్రి, అభిలాష్,
స్టంట్స్ : కోరియోగ్రఫీ, మ్యూజిక్, స్క్రీన్ ప్లే: కే రాజేంద్ర ప్రసాద్,
స్టోరీ,డైలాగ్స్, డైరెక్టర్: సంపత్ కుమార్ .
డి. ఓ. పి : కొల్లి ప్రసాద్,