నడికర్ తిలకం మూవీ రెండో షెడ్యూల్ షూటింగ్ హైదరాబాద్‌లో ప్రారంభం
టోవినో థామస్, మైత్రీ మూవీ మేకర్స్ నడికర్ తిలకం రెండో షెడ్యూల్ షూటింగ్ హైదరాబాద్‌లో ప్రారంభం
మిన్నల్ మురళి, తల్లుమల,, 2018 వంటి బ్యాక్ టు బ్యాక్ సూపర్ హిట్ చిత్రాల తర్వాత, హీరో టోవినో థామస్ ఇప్పుడు నడికర్ తిలకం షూటింగ్ షెడ్యూల్‌లో బిజీగా వున్నారు. ఆయన నటించిన మరో ప్రాజెక్ట్ అజయంతే రందం మోషణం కూడా త్వరలో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. మైత్రీ మూవీ మేకర్స్ గాడ్‌స్పీడ్ పతాకాలపై నవీన్ యెర్నేని, వై రవిశంకర్, అల్లన్ ఆంటోని, అనూప్ వేణుగోపాల్ నిర్మాతలుగా లాల్ జూనియర్ దర్శకత్వం వహిస్తున్న చిత్రం నడికర్ తిలకం.
పుష్ప, రంగస్థలం, సర్కారు వారి పాట, జనతా గ్యారేజ్ , శ్రీమంతుడు వంటి చిత్రాలను నిర్మించిన మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న మొదటి మలయాళ చిత్రం ఇది. ఇటీవలే కొచ్చిలో తొలి షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం హైదరాబాద్‌లో శరవేగంగా షెడ్యూల్ జరుపుకుంటోంది. నడికర్ తిలకం షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీ, గోల్కొండ ఫోర్ట్ , బంజారాహిల్స్‌లో జరుగుతుంది. ఆ తర్వాత షెడ్యుల్స్ లో కొచ్చి, దుబాయ్, కాశ్మీర్‌లో లొకేషన్‌లలో షూటింగ్ జరుపుకొనుంది
దాదాపు 40 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న నడికర్ తిలకం 120 రోజుల పాటు వివిధ లొకేషన్లలో షూటింగ్ జరుపుకోనుంది. టోవినో థామస్ ఈ చిత్రంలో సూపర్ స్టార్ డేవిడ్ పడిక్కల్ పాత్రను పోషిస్తున్నాడు. ఈ సినిమాలో బాలా పాత్రలో సౌబిన్ షాహిర్ కనిపించనుండగా, భావన కథానాయికగా నటిస్తుంది.
నటీనటులు :
ధ్యాన్ శ్రీనివాసన్, అనూప్ మీనన్, షైన్ టామ్ చాకో, అజు వర్గీస్, శ్రీనాథ్ భాసి, లాల్, బాలు వర్గీస్, సురేష్ కృష్ణ, ఇంద్రన్స్, మధుపాల్, గణపతి, మణికుట్టన్, శ్రీజిత్ రవి, సంజు శివరామ్, అర్జున్, దివ్య పిల్ల, ఖలీద్ రెహమాన్, ప్రమోద్ వెలియనద్, ఇడవల బాబు, బైజుకుట్టన్, షాన్ జేవియర్, రజిత్ (బిగ్ బాస్ ఫేమ్), బిపిన్ చంద్రన్, మాలా పార్వతి, దేవికా గోపాల్ నాయర్, ఆరాధ్య, అఖిల్ కన్నపన్, ఖయాస్ ముహమ్మద్, జజీర్ మహమ్మద్ కూడా కీలక పాత్రలు పోషిస్తున్నారు.
సాంకేతిక విభాగం:
రచన, దర్శకత్వం: లాల్ జూనియర్
నిర్మాతలు: నవీన్ యెర్నేని, వై రవిశంకర్, అలన్ ఆంటోని, అనూప్ వేణుగోపాల్
బ్యానర్లు: మైత్రీ మూవీ మేకర్స్, గాడ్‌స్పీడ్
డీవోపీ: ఆల్బీ
సంగీతం: యక్జాన్ గారి పెరీరా, నేహా నాయర్
ఎడిటింగ్: రతీష్ రాజ్