ప్రేమ విమానం వెబ్ సిరీస్ అక్టోబర్ 13 నుంచి జీ5లో స్ట్రీమింగ్
ఆకట్టుకుంటోన్న ప్రేమ విమానం ట్రైలర్ జీ5లో అక్టోబర్ 13 నుంచి స్ట్రీమింగ్
భావోద్వేగాలు మనిషిని ముందుకు నడిపిస్తాయి. ఒక్కొక్కరి జీవితంలో ఒక్కో ఎమోషన్ ఉంటుంది. అది సాధిస్తే చాలు అనుకుంటారు వాళ్లు. బయట నుంచి చూసే వారికి ఇదేంటని అనిపించినా వారికి మాత్రం అదే ముఖ్యమనిపిస్తుంది. అలాంటి ఎమోషన్స్ ఉన్న కొందరి మనుషుల కథతో రూపొందుతోన్న వెబ్ ఫిల్మ్ పేమ విమానం. సంతోష్ కటా దర్శకత్వం వహిస్తున్నారు. అక్టోబర్ 13న జీ 5 ద్వారా ప్రేక్షకుల ముందుకు రానుంది. భారీ బడ్జెట్స్‌తో వైవిధ్యమైన సినిమాలను నిర్మిస్తోన్న ప్రముఖ నిర్మాణ సంస్థ అభిషేక్ పిక్చర్స్, జీ 5 బ్యానర్స్ దీన్ని రూపొందిస్తున్నాయి. ఈ సందర్భంగా మేకర్స్ ఈ వెబ్ ఫిల్మ్ ట్రైలర్‌ను విడుదల చేశారు.
ట్రైలర్‌ను గమనిస్తే సంగీత్ శోభన్, శాన్వీ మేఘన మధ్య ఉండే అనే ప్రేమ అనే ఎమోషన్‌ను దర్శకుడు ఆవిష్కరించారు. అమ్మాయేమో ధనవంతుల పిల్ల కుర్రాడేమో పేదింటి కుర్రాడు. చాటు మాటుగా మాట్లాడుకోవటం, కలుసుకోవటం వంటి పనులు చేస్తుంటారు. అయితే తమ ప్రేమను బతికించుకోవటానికి పారిపోవాలనుకుంటారు. అప్పుడు వారేం చేశారనే కథ ఓ వైపు
మరో కథలో ఇద్దరు చిన్న పిల్లలకు విమానం ఎక్కాలనే కోరిక పుడుతుంది. వారిదేమో పేద కుటుంబం, పల్లెటూరు దాంతో ఎలాగైనా పట్నం వెళ్లి విమానం ఎక్కాలనుకుంటారు. తమ ఊరి నుంచి పారిపోయి పట్నం వచ్చేస్తారు.
ఓ వైపు పిల్లలు, మరో వైపు ప్రేమ జంట సిటీ వచ్చిన తర్వాత వారి జీవితాలు మలుపు తిరిగే సమస్యలు ఎదురవుతాయి. మరి ఆ సమస్యలను వారు అధిగమించారా? వారి కలలను నేరవేర్చుకున్నారా? అనే విషయం తెలియాలంటే అక్టోబర్ 13న రిలీజ్ కాబోయే ప్రేమ విమానం సినిమా చూడాలని అంటున్నారు మేకర్స్. వీరి ప్రయాణంలో వచ్చే మలుపులు, సంతోషాలు, బాధలు, నవ్వులు ఇలా అన్నీ కూడా ప్రేక్షకులను మెప్పించేలా ఉంటాయి.
సంగీత్ శోభన్, శాన్వీ మేఘన హీరో హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రంలో చిన్న పిల్లలుగా నిర్మాత అభిషేక్ నామా తనయులు దేవాన్ష్ నామా, అనిరుధ్ నామా నటించారు. వెన్నెల కిషోర్, అనసూయ భరద్వాజ్ ఇతర కీలక పాత్రల్లో నటించారు. అనూప్ రూబెన్స్ సంగీతాన్ని అందించారు. జగదీష్ చీకటి కెమెరామెన్‌గా పని చేశారు.
నటీనటులు :
సంగీత్ శోభన్, శాన్వీ మేఘన, అనసూయ భరద్వాజ్, వెన్నెల కిషోర్, దేవాన్ష్ నామా, అనిరుధ్ నామా తదితరులు
సాంకేతిక బృందం :
సమర్పణ : దేవాన్ష్ నామా
నిర్మాత : అభిషేక్ నామా
దర్శకత్వం : సంతోష్ కటా
సంగీత దర్శకుడు : అనూప్ రూబెన్స్
సినిమాటోగ్రాఫర్ : జగదీష్ చీకటి
ఎడిటర్ : అమర్ రెడ్డి