మంత్ ఆఫ్ మధు మూవీ సక్సెస్ మీట్
మంత్ ఆఫ్ మధు ప్రేక్షకులకు సరికొత్త సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ ఇవ్వడం ఆనందాన్ని ఇచ్చింది: సక్సెస్ మీట్ లో చిత్ర యూనిట్
నవీన్ చంద్ర, స్వాతిరెడ్డి ప్రధాన పాత్రలలో నటించిన న్యూ ఏజ్ లైఫ్ డ్రామా మంత్ ఆఫ్ మధు. భానుమతి & రామకృష్ణ ఫేమ్ శ్రీకాంత్ నాగోతి దర్శకత్వంలో, యశ్వంత్ ములుకుట్ల క్రిషివ్ ప్రొడక్షన్స్, హ్యాండ్పిక్డ్ స్టోరీస్ బ్యానర్‌పై నిర్మించారు. అక్టోబర్ 6న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం అన్ని వైపుల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ తో మంచి విజయాన్ని అందుకొని సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఈ నేపధ్యంలో చిత్ర యూనిట్ సక్సెస్ మీట్ ని నిర్వహించారు.
సక్సెస్ మీట్ లో హీరో నవీన్ చంద్ర మాట్లాడుతూ మంత్ ఆఫ్ మధుకు ప్రేక్షకుల నుంచి వస్తున్న స్పందన అద్భుతంగా వుంది. చాలా మంచి రివ్యూస్ వస్తున్నాయి. ప్రతి ఒక్కరూ క్రాఫ్ట్ గురించి ప్రత్యేకంగా మాట్లాడుతున్నారు. మధు పాత్రకు చాలా మంచి రెస్పాన్స్ వస్తోంది. థియేటర్స్ విజిట్ చేసినప్పుడు ప్రేక్షకులు దగ్గరికి వచ్చి హత్తుకున్నారు. ఇప్పటివరకూ సినిమాని చూసిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు. సినిమా చూసిన ప్రేక్షకులు వర్డ్ ఆఫ్ మౌత్ స్ప్రెడ్ చేయాలని కోరుతున్నాను. తమిళ్ మలయాళంలోనే ఇలాంటి సినిమాలు వస్తున్నాయి తెలుగులో రావడం లేదనేవారికి సమాధానంగా మంత్ ఆఫ్ మధు వచ్చింది. చాలా నిజాయితీగా ప్రయత్నించిన సినిమా ఇది. చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది. ఇంకా మీ ఆదరణ కావాలి అని కోరారు.
స్వాతి రెడ్డి మాట్లాడుతూ మధు, లేఖ పాత్రలు ప్రేక్షకుల మనసుని హత్తుకున్నాయి. ఒక లైఫ్ డ్రామాని కొత్తగా ప్రజెంట్ చేసే ప్రయత్నం ఈ చిత్రంతో చేశాం. సినిమా చూసిన చాలా మంది ప్రేక్షకులకు ఇది నచ్చింది. మంత్ ఆఫ్ మధులో చేసిన లేఖా పాత్ర గురించి నేను గర్వంగా చెప్పుకుంటాను. నా కెరీర్ లో సుబ్రమణ్యపురం, అష్టా చెమ్మా చిత్రాలు సాధారణంగా మొదలై అద్భుతమై విజయాలు సాధించాయి. మంత్ ఆఫ్ మధు కూడా అలానే గొప్ప విజయం సాధిస్తుంది అన్నారు
దర్శకుడు శ్రీకాంత్ నాగోతి మాట్లాడుతూ మంత్ ఆఫ్ మధుకి వస్తున్న రెస్పాన్స్ బాగుంది. సినిమా చూసిన ప్రేక్షకులు చాలా పాజిటివ్ గా సినిమా గురించి చెబుతున్నారు. లిమిటెడ్ స్క్రీన్ లో సినిమాని విడుదల చేశాం. చాలా మంది సినిమాని చూడాలని అడుగుతున్నారు. వారందరి దగ్గరకి సినిమాని తీసుకెళ్ళే ఏర్పాట్లు చేస్తున్నాం. చాలా మంచి రివ్యూస్ వస్తునాయి. ఇందులో ప్రతి సీన్ కి ఒక లాజిక్ వుంటుంది. ప్రతి రంగం ముందుకు వెళుతున్నపుడు సినిమాని కూడా ముందుకు తీసుకువెళ్ళాలి. కథ చెప్పడంలో న్యూ ఏజ్ స్టొరీ టెల్లింగ్ ఏమిటనేది మేమూ ప్రయత్నిస్తున్నాం. అందులో భాగంగానే మంత్ ఆఫ్ మధు ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చాం. సినిమా చూసిన ప్రేక్షకులు చాలా మంది కొత్తగా ఫీలౌతున్నారు. కథ చెప్పడంలో కొత్త ప్రయత్నం చేశామని చెబుతున్నారు. మౌత్ టాక్ తో సినిమా మరింతగా జనాల్లోకి వెళుతుందనే నమ్మకం వుంది. ప్రేక్షకులు కొత్త సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ ఇవ్వాలనే ప్రయత్నంలో మంత్ ఆఫ్ మధు తీశాం. సినిమా చూసిన చాలా మంది ఆడియన్స్ కొత్తదనం ఫీలవ్వడం ఆనందాన్ని ఇచ్చింది అన్నారు.
నిర్మాత యశ్వంత్ ములుకుట్ల మాట్లాడుతూ మంత్ ఆఫ్ మధుకి చాలా మంచి రెస్పాన్స్ వస్తోంది. యూఎస్ లో కూడా షోస్ హౌస్ ఫుల్ అవుతున్నాయి. మా డిస్ట్రిబ్యూటర్స్ చాలా సపోర్ట్ చేస్తున్నారు. ప్రేక్షకుల నుంచి మరింత ఆదరణ కావాలని కోరుతున్నాం అన్నారు.