Reading Time: 2 mins

తలకోన మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్

తలకోన పెద్ద విజయం సాధించాలి : రామ్‌ గోపాల్‌ వర్మ

అక్షర క్రియేషన్‌ పతాకంపై శ్రీమతి స్వప్న శ్రీధర్ రెడ్డి సమర్పణలో, నగేష్‌ నారదాసి దర్శకత్వంలో దేవర శ్రీధర్‌ రెడ్డి (చేవెళ్ల) నిర్మాతగా , అప్సరా రాణి ప్రధాన పాత్రలో రూపొందిన సస్పెన్స్‌ థ్రిల్లర్‌ చిత్రం తలకోన నవంబర్‌ రెండో వారంలో విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా బుధవారం హైదరాబాద్‌లోని ప్రసాద్‌ ల్యాబ్‌లో ప్రీ రిలీజ్‌ వేడుక నిర్వహించారు. ఈ వేడుకకు ముఖ్య అతిథులుగా సంచలన దర్శకుడు రామ్‌ గోపాల్‌వర్మ, నటుడు శివాజీరాజా ప్రముఖ నిర్మాత రామారావు విచ్చేసి పాటలు, ట్రైలర్‌ను విడుదల చేశారు.

రామ్ గోపాల్ వర్మ మాట్లాడుతూ
నాకు అందమంటే మహా ఇష్టం. అడవి కూడా చాలా అందంగా ఉంటుంది. మరి అందమైన అడవిలో అందమైన అప్సర రాణి డాన్స్‌లు చేస్తూ.. ఫైట్స్‌ చేస్తుంటే చూడటానికి చాలా అద్భుతంగా ఉంది. ప్రొడక్షన్‌ వ్యాల్యూస్‌ కూడా బాగున్నాయి. ఈ సినిమా మంచి విజయం సాధించి యూనిట్‌ అందరికీ మంచి పేరు తీసుకు రావాలని కోరుకుంటున్నా అన్నారు.

శివాజీరాజా మాట్లాడుతూ
తలకోన అడవిలో నేను కూడా కొన్ని సినిమాల షూటింగ్‌ల్లో పాల్గొన్నాను. ఫారెస్ట్‌ బ్యాక్‌డ్రాప్‌లో సినిమా అంటే చాలా చాలా కష్టం ఉంటుంది. వాటన్నింటినీ అధిగమించి షూటింగ్‌ పూర్తి చేశారు అంటేనే యూనిట్‌ సంకల్పం అర్ధమౌతోంది. ఈ సినిమా చక్కటి విజయం సాధించాలి అన్నారు.

అజయ్‌ ఘోష్‌ మాట్లాడుతూ
తలకోన అనే టైటిల్‌లోనే ఉంది ఇది అడవిలో జరిగే కథ అని. అడవిలో షూటింగ్‌ చేయడం అంటే మాటలు కాదు. చాలా ఇబ్బందులు ఉంటాయి. అన్నింటినీ అధిగమించి నిర్మాత అన్‌ కాంప్రమైజ్డ్‌గా నిర్మించారు. అప్సర రాణి మంచి ఫ్యూచర్‌ ఉన్న నటి. ఈ మధ్య కాలంలో ఇటువంటి ఆర్టిస్ట్‌లు అరుదుగా ఉంటున్నారు. అందరం చాలా కష్టపడ్డాం. తప్పకుండా విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది అన్నారు.

నిర్మాత దేవర శ్రీధర్‌రెడ్డి (చేవెళ్ల) మాట్లాడుతూ
మా ఈ ఈవెంట్‌కు విచ్చేసి మాకు శుభాకాంక్షలు తెలిపిన రామ్‌గోపాల్‌ వర్మ గారికి, శివాజీ రాజా గారికి కృతజ్ఞతలు. దర్శకుడు ఈ కథను చెప్పగానే మంచి థ్రిల్లింగ్‌గా అనిపించింది. ఈ సినిమా కోసం యూనిట్‌ మొత్తం చాలా రిస్క్‌ లొకేషన్స్‌లో కూడా పనిచేశారు. ఎక్కువగా ఫారెస్ట్‌లో షూటింగ్‌ చేయడం వల్ల మరింత ఇబ్బంది అయింది. అయినా యూనిట్‌ అంతా సహకరించారు. దర్శకుడు నగేష్‌ గారు తాను చెప్పిన దానికన్నా బాగా తీశారు. ఈ సినిమా నిర్మాణంలో నాకు అండగా నిలిచిన నా మిత్రులకు, శ్రేయోభిలాషులకు పేరు పేరునా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఈ సినిమా ఖచ్చితంగా విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది. నవంబర్‌ రెండో వారంలో విడుదలకు ప్లాన్‌ చేస్తున్నాం. ఇక మీదట కూడా నిర్మాతగా ఇండస్ట్రీలో కొనసాగుతా అన్నారు.

దర్శకుడు నగేష్‌ నారదాసి మాట్లాడుతూ
నిర్మాత శ్రీధర్‌రెడ్డి గారు చెప్పినట్లు ఈ చిత్రం కోసం చాలా రిస్క్‌ చేశాం. యూనిట్‌ అందరూ గొప్పగా సహకారాన్ని అందించారు. ఇందుకు వారికి కృతజ్ఞతలు. శ్రీధర్‌రెడ్డిగారు కూడా మాకు ఏది కావాలంటే అది సమయానికి అరేంజ్‌ చేయడం ద్వారా తాను ఒక ప్యాషనేట్‌ ప్రొడ్యూసర్‌ అనిపించుకున్నారు. కైమ్‌ థ్రిల్లర్‌తో సాగే ఈ కథాంశం మొత్తం ఫారెస్ట్‌లో చిత్రీకరించాం. ప్రకృతిలో ఏమేమి జరుగుతాయో తెలిపే ప్రయత్నం కూడా చేసాము. హీరోయిన్‌ ఓరియెంటెడ్‌ మూవీ అయినా పూర్తి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌కు కావాల్సిన అన్ని అంశాలూ ఉన్నాయి. ప్రేక్షకుల్ని తప్పకుండా ఆకట్టుకుంటుంది. దయచేసి అందరూ థియేటర్స్‌లో ఈ సినిమా చూసి మమ్మల్ని ప్రోత్సహించండి అన్నారు.

హీరోయిన్‌ అప్సర రాణి మాట్లాడుతూ
మమ్మల్ని ఆశీర్వదించటానికి వచ్చిన వర్మ గారికి థ్యాంక్స్‌. అందరూ చెప్పినట్లు అడవిలో చాలా ఇబ్బందులు పడ్డాము. దర్శకుడు, నిర్మాత యూనిట్‌ అందర్నీ తమ స్వంత కుటుంబ సభ్యుల్లాగా చూసుకున్నారు. కెరీర్‌ ప్రారంభంలోనే నాకు ఇలాంటి యాక్షన్‌, అడ్వెంచర్‌, నటనకు స్కోప్‌ ఉన్న క్యారెక్టర్‌ రావడం అదృష్టంగా భావిస్తున్నాను. ఇతర నటీనటులు, టెక్నీషియన్స్‌ చాలా కోపరేటివ్‌గా ఉన్నారు. మంచి కథ, కథనాలతో వస్తున్న ఈ చిత్రం కూడా మంచి విజయంతో పాటు మంచి పేరును కూడా ఇస్తుందని ఆశిస్తున్నా అన్నారు.

ఇంకా ఈ కార్యక్రమంలో పాల్గొన్న చిత్ర యూనిట్‌ సభ్యులు తామెంతో కష్టపడి, ఇష్టపడి చేసిన ఈ సినిమా విజయవంతం అయి అందరికీ మంచి పేరును తీసుకు రావాలని కోరుకుంటూ ప్రసంగించారు.

నటీనటులు :

అప్సరా రాణి, అశోక్‌ కుమార్‌, అజయ్‌ ఘోష్‌, ఉగ్రం మంజు, దేవర శ్రీధర్ రెడ్డి, డెబోరా , కరణ్‌విజయ్ ,విజయ రంగరాజా, శ్రవణ్, రాజారాయ్‌, యోగి కత్రి , ఆజాద్, భువనేశ్వరి, చంద్రిక , అరుణ

సాంకేతికవర్గం :

ఎడిటర్: ఆవుల వెంకటేష్
నిర్వహణ: పరిటాల రాంబాబు
డిఓపి: ఈదర ప్రసాద్‌, మల్లికార్జున్
మ్యూజిక్‌: సుభాష్‌ ఆనంద్‌
నిర్మాత: దేవర శ్రీధర్‌ రెడ్డి (చేవెళ్ల)
కథ-స్క్రీన్‌ ప్లే-దర్శకత్వం: నగేష్‌ నారదాసి