ఘనంగా ముగిసిన ఇండియా జాయ్ సినిమాటిక ఎక్స్పో
ఇండియా జాయ్, ఫ్లయింగ్ మౌంటెయిన్ కాన్సెప్ట్స్ సమర్పణలో సినిమాటిక ఎక్స్పో వేడుకల హైదరాబాదులోని హెచ్ఐసీసీ నోవాటెల్లో హోటల్లో ఘనంగా ముగిశాయి. ప్రముఖ కంపెనీలైన సోనీ జైస్ తోపాటు చాలా కంపెనీలు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన సినిమాటోగ్రఫీ ఫిలిం మేకింగ్ లోని 24 గ్రాఫ్స్ క్రాఫ్ట్స్ కి సంబంధించిన ఎక్విప్మెంట్ ని ప్రదర్శించాయి సినిమాటిక ఎక్స్పోకి ప్రముఖ దర్శకులు ఇంద్రగంటి మోహనకృష్ణ, మెహర్ రమేష్ మరింత మంది దర్శకులు మరియి కేకే సెంథిల్ కుమార్ గారు, ఎస్ గోపాల్ రెడ్డి, అజయ్ విన్సెంట్, ఎంవి రఘు మరియు చాలామంది సినిమా ఆటోగ్రాఫర్స్ టెక్నీషియన్స్ ప్రదర్శనను వీక్షించారు. సినిమాటిక ఎక్స్పో ముగింపు వేడుకలో భాగంగా ప్రముఖ సినిమాటోగ్రాఫర్స్ బయోగ్రఫీని తెలియజేస్తూ విజువల్ స్టోరీ టెల్లర్స్ అనే పుస్తకావిష్కరణ మామిడి హరికృష్ణ గారి, ఇంద్రగంటి మోహన కృష్ణ గారి చేతుల మీదుగా జరిగింది. మామిడి హరికృష్ణ గారు మాట్లాడుతూ మనిషి సామాజిక జీవన పరిణామంలో ఫోటోగ్రఫీ, సినిమాటోగ్రఫీ అత్యంత గొప్ప సాంకేతిక ఆవిష్కరణలుగా పరిగణించాలి అని చెప్పారు, విజువల్ స్టోరీ టెల్లర్స్ పుస్తకం గురించి మాట్లాడుతూ మన తెలుగు సినిమా హైదరాబాద్ వేదికగా ప్రపంచ స్థాయికి ఎదగడానికి మన సినిమాటోగ్రాఫర్స్ కృషి ఎంతో ఉంది అని చెప్పారు. వారి కృషిని, కళని మేళవించి ఈ విజువల్ స్టోరీ టెల్లర్స్ పుస్తకంలో ప్రముఖ సినిమాటోగ్రాఫర్స్ బయోగ్రఫీని వారి సినిమాలలోని గొప్ప షార్ట్స్ ని అన్వయించి కళాత్మకంగా తీర్చిదిద్దారు అని అన్నారు. ఈ సందర్భంగా..
ఇంద్రగంటి మోహన కృష్ణ గారు మాట్లాడుతూ ఈ పుస్తకం ఔత్సాహిక సినిమా ఆటోగ్రాఫర్స్ అందరికీ ఎంతో ప్రేరణగా నిలుస్తుందని అన్నారు. విజువల్ స్టోరీ టెల్లర్స్ పుస్తక రూపకల్పనను పీ.జీ విందా చేశారు. ఇల్యుుస్టేషన్ ఆర్ట్ సురేంద్ర చాచా, ఎడిటింగ్ అండ్ కంపైలింగ్ యం. కమల్ నాబ్ అందించారు. విజువల్ స్టోరీ టైలర్స్ పుస్తక ప్రచురణ లాంగ్వేజెస్ అండ్ కల్చర్ డిపార్ట్మెంట్ ఆఫ్ తెలంగాణ అండ్ సపోర్టింగ్ విందా ప్రొడక్షన్స్ కలిసి చేశాయి. పుస్తకావిష్కరణ తర్వాత సినిమాటిక అవార్డ్ వేడుక జరిగింది.
ముఖ్య అతిథులుగా ఎస్. గోపాల్ రెడ్డి, కే.కే. సెంథిల్ కుమార్, బైరాన్ జోషి, మైక్, అజయ్ విన్సెంట్ అవార్డులను ప్రధానం చేశారు. సినిమాటిక ఐకానిక్ విజనరీ అవార్డు కే.కే సెంథిల్ కుమార్, బీవీఎస్ఎన్ ప్రసాద్, కేయం. రాధాకృష్ణన్, ఎస్. రామకృష్ణ అందుకున్నారు. హానరరీ సినిమాటిక ఎక్స్లెన్స్ అవార్డు సి.వి రావు, తారక్ శ్రీనివాస్ అందుకున్నారు సినిమాటిక ఎక్స్లెన్స్ అవార్డు బివిఆర్. శివకుమార్ గారు అందుకున్నారు. సినిమాటిక గోల్డెన్ స్పార్కిల్ అవార్డు కార్తీక్ దండు, హన్సితా రెడ్డి హర్షితా రెడ్డి, బీమ్స్ సిసిరేలోయో, ఆచార్య వేణు, జస్విన్ ప్రభు, శ్రీ నాగేంద్ర తంగల, ఎం. రాజు రెడ్డి అందుకున్నారు. సినిమాటిక లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు ఎస్. గోపాల్ రెడ్డి, కమల్ కిషోర్ మోహన్ కద్వానీ, కే. బసిరెడ్డి అందుకున్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో దామోదర్ ప్రసాద్, కె.ఎస్.రామారావు, జెమినీ కిరణ్, శివ నిర్వాణ తదితరులు పాల్గొన్నారు.