డైరెక్టర్ అనీల్ రావిపూడి పొలిటీషియన్ గెటప్
ఆయన యాక్టింగ్ చేయబోతున్నారా లేక ఆహా లో చేయబోతున్న పొలిటికల్ మూవీకి సంబంధించిన స్నీక్ పీక్నా అనేలా ఆకట్టుకుంటోన్న వీడియో
నవంబర్ 16 హైదరాబాద్ టాలీవుడ్లో తనదైన గుర్తింపు సంపాదించుకున్న యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ అనీల్ రావిపూడి. ఇప్పుడు ఆయనకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అనుకోని విధంగా అనీల్ రావిపూడి తీసుకున్న ఈ నిర్ణయం ఆయన అభిమానులను, సినీ ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఆయన సీక్రెట్‌గా సినిమా ఏమైనా డైరెక్ట్ చేస్తున్నారా? దానికి సంబంధించిన టీజర్ అదేనా లేక అనీల్ రావిపూడి యాక్టింగ్ వైపు మొగ్గు చూపుతున్నారా అనేలా ఆ వీడియో ఉంది. అసలు డైరెక్టర్ ఏం చెప్పాలనుకుంటున్నారు?
వీడియో చాలా గ్రాండ్‌గా ఉంది. ఇప్పుడు నెట్టింట తెగ హల్ చల్ చేస్తోంది. కెమెరాను చూస్తూ అనీల్ రావిపూడి చాలా గంభీరంగా మాట్లాడుతున్నారు. మేకింగ్‌కి సంబంధించిన సలహానిస్తున్నారు. ఈ వీడియోలో ఆయనొక రాజకీయ పార్టీ గురించి ప్రస్తావించారు. ఇది అందరిలో గందరగోళాన్ని కలిగిస్తూనే నెట్టింట చాలా వేగంగా వైరల్ అవుతుంది.
ఉద్దేశపూర్వకంగా చేసిన ఈ వీడియోలో దర్శకుడు ఏం చెప్పాలనుకున్నారనే దానిపై స్పష్టత లేదు. అయితే ప్రేఓకులు ఈ వీడియో వెనుకున్న రహస్యాన్ని కనుగొనాలనే ఆసక్తితో ఉన్నారు. తెలుగు ఓటీటీ మాధ్యమం ఆహాతో అనీల్ రావిపూడి పొలిటికల్ మూవీని చేస్తున్నారా లేక ఆహా నిర్మాణంలో అనీల్ రావిపూడి నటించబోతున్నారా? అంటూ సోషల్ మీడియాలో ఈ వీడియో స్ప్రెడ్ అవుతుంది.