భగీర సినిమా టీజర్ విడుదల
రోరింగ్ స్టార్ శ్రీమురళి, హోంబలే ఫిలిమ్స్ కాంబినేషన్‌లో భారీ బడ్జెట్ యాక్షన్ థ్రిల్లర్ భగీర
ఉగ్రం వంటి బ్లాక్‌బస్టర్ మూవీతో సెన్సేషన్ క్రియేట్ చేసిన రోరింగ్ స్టార్ శ్రీమురళి లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ భగీర. ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబలే ఫిలిమ్స్ బ్యానర్‌పై డా.సూరి దర్శకత్వంలో విజయ్ కిరగందూర్ ఈ చిత్రాన్ని నిర్మించారు. కె.జి.యఫ్ ఫ్రాంచైజీ, కాంతార, సలార్ వంటి భారీ ఫ్రాంచైజీ చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తోన్న హోంబలే ఫిలిమ్స్ సంస్థ భగీర చిత్రాన్ని రూపొందిస్తోంది. ఆదివారం హీరో శ్రీమురళి పుట్టినరోజు..ఈ సందర్భంగా భగీర సినిమా నుంచి మేకర్స్ టీజర్‌ను విడుదల చేశారు.
భగీర టీజర్‌ను గమనిస్తే లోకంలో అన్యాయం పెరిగినప్పుడు న్యాయం జరిగినప్పుడు ఓ హీరో వస్తాడని చెప్పేలా ఉంది. శ్రీమురళి పవర్‌ఫుల్ పాత్రలో మెప్పించబోతున్నారు. ఎస్ఎస్ఇ ఫేమ్ రుక్మిణి వసంత్ హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ మూవీలో వెర్సటైల్ ఆర్టిస్ట్ ప్రకాష్ రాజ్ కీలక పాత్రలో మెప్పించబోతున్నారు. యంగ్ మ్యూజికల్ సెన్సేషనల్ అజనీష్ లోకనాథ్ ఈ సినిమాకు సంగీత సారథ్యాన్ని వహిస్తున్నారు.
పాన్ ఇండియా రేంజ్‌లో భగీర చిత్రాన్ని వచ్చే ఏడాదిలో విడుదల చేయటానికి హోంబలే ఫిలిమ్స్ సన్నాహాలు చేస్తోంది. శ్రీమురళి సినిమాను సరికొత్త ఆవిష్కరిస్తోన్న ఈ సినిమాపై టీజర్ ఎక్స్‌పెక్టేషన్స్ నెక్ట్స్ రేంజ్‌కు తీసుకెళ్లింది. సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని ఫ్యాన్స్, ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.