జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో సాయిధరమ్ తేజ్
ట్రాఫిక్ రూల్స్‌ను అందరూ విధిగా పాటించాలి:సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ్
నేటి యువతతో పాటు అందరూ ట్రాఫిక్ రూల్స్ విధిగా పాటించాలని, రోడ్డు ప్రమాదాలు జరగకుండా అవేర్నెస్తో వుండాలని అన్నారు. సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ్.
జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా సోమవారం హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ (వెస్ట్ జోన్) ఆధ్వర్యంలో బంజరా హిల్స్‌లోని సుల్తాన్
ఉల్ ఉలూమ్ ఎడ్యుకేషనల్ సోసైటీ ఆడిటోరియంలో రహదారి భద్రతా చైతన్య సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా హాజరయ్యారు కథానాయకుడు సాయిధరమ్ తేజ్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోడ్డు ప్రమాదం నుంచి కోలుకున్న తనకు ఇది రెండో జీవితమని తెలిపారు. ప్రమాదం నుంచి బయపడటానికి హెల్మెట్ కారణమైందని, అభిమానులు, మీలాంటి వాళ్లు, ప్రేక్షకుల ఆశ్సీస్సులతో ఈ రోజు మీ ముందు ఇలా నిలబడ్డానికి కారణమని చెప్పారు. తప్పకుండా టూవీలర్ డ్రైవ్ చేసే వాళ్లంతా హెల్మెట్‌ను తప్పక ధరించాలని, కార్లు డ్రైవ్ చేసే వారు సీటు బెల్డ్‌లు విధిగా ధరించాలని,
ఈ సందర్భంగా ఆయన కోరారు. చాలా మంది ట్రాఫిక్ రూల్స్ పాటించడంలో నిర్లక్ష్యంగా వుంటున్నారని, డ్రైవింగ్‌లో వున్నప్పుడు సేఫిటిని మరిచిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తప్పకుండా అందరూ ట్రాఫిక్స్ రూల్స్ పాటించాలని కోరారు. అలాగే మద్యం తాగినప్పుడు డ్రైవింగ్ చేయడం చాలా ప్రమాదకరమని తెలిపారు. అందరూ ట్రాఫిక్ పోలీసులకు సహకరిస్తూ, ట్రాఫిక్స్ నిబంధనలు పాటించాలని తెలిపారు సాయిధరమ్ తేజ్.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హైదరబాద్ నగర పోలీసు కమిషనర్ కొత్తకోట శ్రీనివాస రెడ్డితో పాటు ట్రాఫిక్ అదనపు పోలీసు కమిషనర్ విశ్వప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.