మస్తు షేడ్స్ వున్నాయ్ రా చిత్రం ప్రీరిలీజ్ వేడుక
మెగా ప్రిన్స్ వరుణ్‌తేజ్ ముఖ్య అతిథిగా ఘనంగా జరిగిన మస్తు షేడ్స్ వున్నాయ్ రా ప్రీరిలీజ్ వేడుక
ఈ నగరానికి ఏమైంది, మీకు మాత్రమే చెబుతా, సేవ్ టైగర్ చిత్రాల్లో కమెడియన్‌గా పాపులారిటీ సంపాందించుకుని, తనకంటూ ఓ మార్క్‌ను క్రియేట్ చేసుకున్న నటుడు అభినవ్ గోమఠం.
అయితే తాజాగా ఈ నగరానికి ఏమైంది చిత్రంలో అతని పాపులర్ డైలాగ్ అయిన మస్తు షేడ్స్ ఉన్నాయ్ రా టైటిల్‌తోనే అభినవ్ హీరోగా ఓ చిత్రం రూపొందుతుంది.
వైశాలి రాజ్ హీరోయిన్. కాసుల క్రియేటివ్ వర్క్స్ పతాకపంపై తిరుపతి రావు ఇండ్ల దర్శకత్వంలో భవాని కాసుల, ఆరెమ్ రెడ్డి, ప్రశాంత్.వి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ఫిబ్రవరి 23న చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నారు. మంగళవారం ఈ చిత్రం ప్రీ రిలీజ్ వేడుక హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది.
ఈ వేడుకకు మెగా ప్రిన్స్ వరుణ్‌తేజ్ ముఖ్య అతిథిగా హాజరై చిత్ర బిగ్‌టికెట్‌ను విడుదల చేశారు.
ఈ సందర్భంగా వరుణ్ తేజ్ మాట్లాడుతూ అభినవ్ తొలిసారిగా లీడ్ రోల్ చేస్తున్నాడు. విభిన్న పాత్రల ద్వారా ప్రేక్షకుల మనసులు గెలుచుకున్నాడు. ఈచిత్రంతో అభినవ్‌కు మంచి సక్సెస్ రావాలని కోరుకుంటున్నాను. కంటెంట్‌ను నమ్మి చేసిన సినిమాలా అనిపిస్తుంది. టీమ్ అంతా కాన్ఫిడెంట్‌గా వున్నారు. అభినవ్‌లో నటన పరంగా మంచి షేడ్స్ వున్నాయి. చిత్రంలో అన్ని భావోద్వేగాలు వున్నాయని తెలసింది. అందరూ ఈ సినిమాను థియేటర్లో చూడాలని కోరుకుంటున్నాను.
ఈ చిత్రం విజయం సాధించి చిత్ర దర్శక, నిర్మాతలకు కూడా మంచి బ్రేక్ రావాలని ఆశిస్తున్నాను. అన్నారు.
అభినవ్ గోమఠం మాట్లాడుతూ ఈ వేడుకకు వరుణ్తేజ్రావడం ఎంతో హ్యపీగా వుంది. విభిన్న కథలను ఎంచుకుంటూ సక్సెస్‌ఫుల్‌గా కెరీర్‌ను కొనసాగిస్తున్న వరుణ్‌తేజ్ అంటే నాకు ఎంతో ఇష్టం. ఆయన ఈ వేడుకకు రావడం ఎంతో పాజిటివ్ వైబ్ వుంది. ఈ సినిమా కోసం టీమ్ అందరూ ఎంతో కష్టపడ్డారు. ఈ సినిమా నా కెరీర్లో ఎంతో స్పెషల్. ఈ సినిమా కోసం నా కెరీర్లో ఒడిదుడుకులు ఎదుర్కొన్నాను. ఈ సినిమాలో నటించడం లక్కీగా ఫీలవతున్నాను. ఈ కథ నచ్చి ఈ సినిమా చేశాను. నా సినిమా కంటెంట్ చూడండి. మీకు నచ్చితే సినిమా చూడండి. తప్పకుండా అందరి అభిమానంతో సినిమా తప్పకుండా విజయం సాధిస్తుందని అనుకుంటున్నాను అన్నారు.
దర్శకుడు తిరుపతి రావు మాట్లాడుతూ ఈ రోజు నేను ఇక్కడ దర్శకుడిగా వుండటానికి కారణమైన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్. నాకు దర్శకుడిగా అవకాశం ఇచ్చిన హీరో, అభినవ్‌కు నిర్మాతలకు జీవితాంతం బుణపడి వుంటాను. అభినవ్ నాకు మొదట్నుంచి ఎంతో సపోర్ట్ చేసేవాడు. అందరి సహకారంతో సినిమా సక్సెస్‌ఫుల్‌గా పూర్తిచేశాం. తప్పకుండా చిత్రం అందరికి నచ్చుతుందని నమ్ముతున్నాను అన్నారు.
నిర్మాతల్లో ఒకరైన భవాని కాసుల మాట్లాడుతూ సినిమా బాగా వచ్చింది. సినిమాలోని ప్రతి పాత్రం అందరికి రిలేట్‌గా వుంటుంది. ఈ సినిమాకు అన్ని సమపాళ్లలో కుదిరాయి. ప్రేక్షకులకు నచ్చే అన్ని అంశాలు వున్నాయి. తప్పకుండా చిత్రం విజయం సాధిస్తుంది అన్నారు.
ఈ వేడుకలో నిర్మాతలు ఆరెమ్ రెడ్డి, ప్రశాంత్.వితో పాటు అలీ రైజా, రాధామోహన్, కార్తికేయ, మెహిన్, సంజీవ్, లావణ్య, సిద్దార్థ్ స్వయంభూ తదితరులు పాల్గొన్నారు.