Reading Time: 2 mins

ష‌ర‌తులు వ‌ర్తిస్తాయి మూవీ సెన్సార్ పూర్తి 

చైత‌న్య రావ్ “ష‌ర‌తులు వ‌ర్తిస్తాయి” మూవీకి సెన్సార్ ప్రశంసలు, క్లీన్ యు సర్టిఫికెట్ జారీ

చైత‌న్య రావ్, భూమి శెట్టి జంట‌గా న‌టించిన “ష‌ర‌తులు వ‌ర్తిస్తాయి” సినిమాకు సెన్సార్ ప్రశంసలు దక్కాయి. కుమార‌స్వామి(అక్ష‌ర‌) ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రాన్ని స్టార్ లైట్ స్టూడియోస్ బ్యాన‌ర్‌పై శ్రీలత – నాగార్జున సామ‌ల‌, శారదా – శ్రీష్ కుమార్ గుండా, విజయ – డాక్ట‌ర్ కృష్ణ‌కాంత్ చిత్త‌జ‌ల్లు నిర్మించారు. “ష‌ర‌తులు వ‌ర్తిస్తాయి”ఈ నెల 15న థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. తాజాగా సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. “ష‌ర‌తులు వ‌ర్తిస్తాయి” సినిమాకు సెన్సార్ సభ్యులు క్లీ యు సర్టిఫికెట్ జారీ చేశారు. ఈ సందర్భంగా మానవీయ విలువలు ఉన్న ఒక మంచి సినిమా రూపొందించారంటూ దర్శకుడు కుమారస్వామికి ప్రశంసలు అందజేశారు. ఈ చిత్ర దర్శకుడు కుమారస్వామి కూడా సెన్సార్ బోర్డ్ సభ్యుడు అన్న విషయం తెలియకుండానే బోర్డ్ మెంబర్స్ సినిమాను చూశారు. తర్వాత తమ సభ్యుడే ఇంత గొప్ప సినిమా తీయడం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేశారు.

సెన్సార్ బృందం స్పందిస్తూ – తెలంగాణ సినిమా అనగానే కొన్నాళ్లుగా కనిపిస్తోన్న విపరీతమైన మద్యం సన్నివేశాలు, నిర్లక్ష్యపు ధోరణులకు భిన్నంగా “ష‌ర‌తులు వ‌ర్తిస్తాయి”లో ఒక గొప్ప మానవీయ విలువలు చూపించారు. మానవ సంబంధాలతో నిండి ఉన్న ఇలాంటి సినిమాను ప్రతి ఒక్కరూ చూడాలని, తెలంగాణ నేపథ్యంలోనే కనిపించినా.. ఒక యూనిక్ కంటెంట్ ఈ చిత్రంలో ఉంది. అని పేర్కొన్నారు.

“ష‌ర‌తులు వ‌ర్తిస్తాయి” సినిమా నుంచి ఇప్పటిదాకా రిలీజ్ చేసిన టీజర్, ట్రైలర్, సాంగ్స్ కు మంచి స్పందన వస్తోంది. ముఖ్యంగా పన్నెండు గుంజలా పెళ్లి పందిరి అనే పాట ప్రస్తుతం తెలంగాణలోని అన్ని పెళ్లి వేడుకల్లోనూ వినిపిస్తోంది. ఇప్పుడు సెన్సార్ బోర్డ్ నుంచి ప్రశంసలు దక్కడం సినిమా విజయం పట్ల మరింత నమ్మకాన్ని పెంచుతోంది.

నటీనటులు – చైతన్య రావ్, భూమి శెట్టి, నంద కిషోర్, సంతోష్ యాదవ్, దేవరాజ్ పాలమూరు, పద్మావతి, వెంకీ మంకీ, శివ కల్యాణ్, మల్లేష్ బలాస్త్, సీతా మహాలక్ష్మి, పెద్దింటి అశోక్ కుమార్, సుజాత తదితరులు

టెక్నికల్ టీమ్

ఆర్ట్ డైరెక్టర్ – గాంధీ నడికుడికర్
ఎడిటింగ్ – సీహెచ్ వంశీ కృష్ణ, గజ్జల రక్షిత్ కుమార్
సినిమాటోగ్రఫీ – ప్రవీణ్ వనమాలి, శేఖర్ పోచంపల్లి
బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ – ప్రిన్స్ హెన్రీ
మ్యూజిక్ – అరుణ్ చిలువేరు, సరేష్ బొబ్బిలి (పన్నెండు గుంజల)
డైలాగ్స్ – పెద్దింటి అశోక్ కుమార్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్ – రాజేశ్ స్వర్ణ, సంపత్ భీమారి, అశ్వత్థామ
పీఆర్ ఓ – జీఎస్ కే మీడియా
బ్యానర్ – స్టార్ లైట్ స్టూడియోస్ ప్రైవేట్ లిమిటెడ్
ప్రొడ్యూసర్స్ – శ్రీలత, నాగార్జున సామల, శారద, శ్రీష్ కుమార్ గుండా, విజయ, డా.కృష్ణకాంత్ చిత్తజల్లు
రచన దర్శకత్వం – కుమారస్వామి (అక్షర)