మంజుమ్మల్ బాయ్స్ మూవీ రివ్యూ
Emotional Engagement Emoji
స్టోరీ లైన్ :
కేరళలోని కొచ్చి కి చెందినా మంజుమ్మల్ బాయ్స్ చిన్నప్పటినుంచి స్నేహితులు. కుట్టన్ (సోబిన్ షాహిర్), సుభాష్ (శ్రీనాథ్) మరియు వీరి మిత్రులందరూ చిన్నచిన్న పనులు చేసుకుంటూ సరదాగా ఉంటారు. ఒకరోజు మంజుమ్మల్ బ్యాచ్ కొడైకెనాల్ ట్రిప్ కు వెళ్తారు. మంజుమ్మల్ బాయ్స్ అందరూ గుణ కేవ్ అనే లోతైన లోయ ప్రాంతానికి వెళ్తారు. గుణ కేవ్ డేంజర్ అని కేవ్ లోపలికి వెళ్లడాన్ని నిషేధించి ఉంటారు. కానీ, మంజుమ్మల్ బాయ్స్ మాత్రం సెక్యూరిటీ సిబ్బందికి కళ్లుగప్పి ఆ గుణ కేవ్ లోపలికి వెళ్తారు. అలా అనుకోకుండా సుభాష్ ఓ ఇరుకైన లోయ లోపలకి పడిపోతాడు. ఆ తర్వాత ఏం జరిగింది ?, సుభాష్ ప్రాణాలతో బయటపడ్డాడా ? లేదా ?, సుభాష్‌ను కాపాడటానికి కుట్టన్ ఎలాంటి సాహసం చేశాడు ?చివరికి ఏం జరిగింది ? అనేది మిగిలిన సినిమా .
ఎనాలసిస్ :
మంజుమ్మల్ బాయ్స్ కొడైకెనాల్ విహారయాత్ర కి వెళ్తే ..అందులో ఒక ఫ్రెండ్ లోయలో పడితే..మిగిలిన ఫ్రెండ్స్ అందరు కలిసి అతనిని కాపాడటం
ఆర్టిస్ట్ ల ఫెరఫార్మెన్స్ :
సోబిన్ షాహిర్, శ్రీనాథ్ లతో పాటు మిగిలిన నటీనటులందరూ చాలా బాగా నటించారు. రియల్ లైఫ్ లో యూత్ గ్యాంగ్ ఎలా ఉంటారో, వాళ్ల అల్లరి కూడా అలాగే సాగింది. రియల్ మంజుమ్మెల్ బాయ్స్ లా వారి నటన ఆకట్టుకుంది.
టెక్నికల్ గా :
చిన్న పాయింట్ చుట్టూ రియలిస్టిక్ ఎమోషనల్ డ్రామాను దర్శకుడు చిదంబరం చాలా బాగా బిల్డ్ చేశాడు.చిదంబరం రాసుకున్న స్క్రీన్ ప్లే బాగుంది.సంగీత దర్శకుడు సుశీన్ శ్యామ్ సంగీతం చాలా బాగుంది. షైజు ఖలీద్ సినిమాటోగ్రఫీ వర్క్ సినిమాకే ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.నిర్మాతలు బాబు షాహిర్, సౌబిన్ షాహిర్, షాన్ ఆంటోని ల నిర్మాణ విలువలు కూడా చాలా బాగున్నాయి.
చూడచ్చా :
చూడొచ్చు
ప్లస్ పాయింట్స్ :
నటీనటుల యాక్టింగ్,
సర్వైవల్ థ్రిల్లర్‌లలోని ఎమోషన్స్
విజువల్స్,
బీజీఎమ్.
మైనస్ పాయింట్స్ :
కొన్నిచోట్ల స్క్రీన్ ప్లే స్లో గా ఉంటుంది
తీర్పు :
ఫ్రెండ్స్ అంటే మంజుమ్మల్ బాయ్స్..
నటీనటులు:
సోబిన్ షాహిర్, శ్రీనాథ్,జీన్ పాల్ లాల్, దీపక్ పరంబోల్, అభిరామ్ రాధాకృష్ణన్, బాలు వర్గీస్, గణపతి ఎస్ పొదువల్ మరియు అర్జున్ కురియన్ తదితరులు
సాంకేతికవర్గం :
సినిమా టైటిల్ : మంజుమ్మల్ బాయ్స్
బ్యానర్: పరవ ఫిలిమ్స్
విడుదల తేదీ: 06-04-2024
సెన్సార్ రేటింగ్: “ U “
దర్శకత్వం: చిదంబరం
సంగీతం: సుశీన్ శ్యామ్
సినిమాటోగ్రఫీ: షైజు ఖలీద్
ఎడిటింగ్:వివేక్ హర్షన్
నిర్మాత: బాబు షాహిర్, సౌబిన్ షాహిర్, షాన్ ఆంటోని
రన్టైమ్: 135 నిమిషాలు
మూవీ రివ్యూ :
రావ్ సాన్ ఫిలిమ్స్ టీమ్