హీరో కార్తికేయ గుమ్మకొండ ఇంటర్వ్యూ
భజే వాయు వేగం సరికొత్త ఎమోషనల్ డ్రైవ్ తో ఎంగేజ్ చేస్తుంది కార్తికేయ గుమ్మకొండ
ప్రతిష్ఠాత్మక నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ సమర్పణలో యూవీ కాన్సెప్ట్స్ బ్యానర్ పై హీరో కార్తికేయ గుమ్మకొండ హీరోగా నటిస్తున్న సినిమా భజే వాయు వేగం. ఐశ్వర్య మీనన్ హీరోయిన్ గా నటిస్తోంది. హ్యాపీ డేస్ ఫేమ్ రాహుల్ టైసన్ కీలక పాత్రను పోషిస్తున్నాడు. ఎమోషనల్ యాక్షన్ థ్రిల్లర్ కథతో దర్శకుడు ప్రశాంత్ రెడ్డి ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. అజయ్ కుమార్ రాజు.పి. కో ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు. ఈ నెల 31న భజే వాయు వేగం సినిమా వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తోంది. ఈ సందర్భంగా సినిమా హైలైట్స్ తో పాటు తన కెరీర్ విశేషాలను ఇవాళ్టి ఇంటర్వ్యూలో తెలిపారు హీరో కార్తికేయ గుమ్మకొండ.
లాక్ డౌన్ టైమ్ లో ప్రశాంత్ రెడ్డి కలిసి భజే వాయు వేగం కథ వినిపించాడు. కథ చెప్పడం ప్రారంభించిన కొద్దిసేపటికే నేను అందులోని ఎమోషన్స్ కు కనెక్ట్ అయ్యాను. ఈ సినిమా ఖచ్చితంగా చేయాలని నిర్ణయించుకున్నాను. క్యారెక్టర్ కోసం రెడీ అయ్యేందుకు కొంత టైమ్ అడిగాను. భజే వాయు వేగం సినిమా షూటింగ్ ప్రారంభించిన తర్వాత కథ మీద దర్శకుడు ప్రశాంత్ మీద మరింత నమ్మకం పెరిగింది. ముందు త్వరగా ఫినిష్ చేయాలనుకున్న ఈ సినిమాను ఇలా కాదు ఇంకాస్త టైమ్ కేటాయించి ఇంకా బెటర్ గా చేద్దామని అనుకున్నాం. నేను అప్పటికే బెదురులంక స్టార్ట్ చేశాను. ఆ సినిమా పూర్తి చేసి మళ్లీ భజే వాయు వేగంకు తిరిగి రావాలని టీమ్ తో డిస్కస్ చేసి వెళ్లాను. అందుకే ఈ సినిమాలో కొన్నిచోట్ల జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే నా హెయిర్ స్టైల్ మారినట్లు తెలుస్తుంది.
భజే వాయు వేగం సినిమా ఇప్పుడున్న నా ఇమేజ్ కు సరైన మూవీ. హీరో అంటే మనం పోల్చుకునేలా ఉండాలి. అతనికి ఎదురయ్యే సమస్యలు, వాటిని సాల్వ్ చేసుకునేందుకు ఎంచుకునే మార్గాలు..ఇవన్నీ ఇన్స్ పైరింగ్ ఉండాలని భావిస్తా. అప్పుడే ఐడియల్ అతన్ని ప్రేక్షకులు హీరోలా చూస్తారు. హీరోగా నాకు కొంచెం సోషల్ కన్సర్న్ ఉంది. అది నేను చేసే పాత్రల మీద రిఫ్లెక్ట్ అవుతుంటుంది. మంచి ఎంటర్ టైన్ మెంట్ కూడా భజే వాయు వేగంలో ఉంటుంది.
ఇలాంటి చిత్రంలోనే నేను నటించాలని కోరుకున్నాను. ఇందులో హీరోయిజం, యాక్షన్, సెంటిమెంట్, ఎమోషన్, లవ్ అన్నీ కుదిరాయి. ఈ కథ దర్శకుడు ప్రశాంత్ చెప్పినప్పుడు కార్తి హీరోగా నటించిన ఖైదీ టైపులో ఊహించుకున్నాను. ఖైదీలో ఉన్నంత యాక్షన్ ఈ మూవీలో ఉండదు కానీ అలాంటి ఎమోషనల్ డ్రైవ్, హీరోకు ఒక ప్రాబ్లమ్, అతనికుండే ధైర్యం ఇలాంటి ఫ్రేమ్ లో కథ ఉంటుంది. సెకండాఫ్ లో రేసీ స్క్రీన్ ప్లేతో మూవీ సాగుతుంది.
యూవీ క్రియేషన్స్ లో సినిమా చేస్తున్నానంటే హీరోగా నాకొక పెద్ద బ్యానర్ దొరికిందని సంతోషించాను. యూవీలో చేస్తే మేకింగ్, పోస్ట్ ప్రొడక్షన్, రిలీజ్ అన్నీ సరిగ్గా జరుగుతాయి అనే నమ్మకం ఉంటుంది. యూవీ కాన్సెప్ట్స్ నుంచి మా భజే వాయు వేగం టీమ్ కు కంప్లీట్ సపోర్ట్ దొరికింది.
భజే వాయు వేగం సినిమాలో రెగ్యులర్ టైప్ పాటలు ఉండవు. సీరియస్ గా కథ వెళ్తున్న టైమ్ లో పాట వస్తే ఆడియెన్స్ డిస్ట్రబెన్స్ గా ఫీలవుతారు. ఈ సినిమాలో సెట్టయ్యిందే పాట పాపులర్ అయ్యింది. అయితే ఈ పాట మీద మాకు పెద్దగా కాన్సన్ ట్రేషన్ లేదు. ఈ పాట కథను ఎలా ముందుకు తీసుకెళ్తుంది అనేది మాత్రమే ప్లాన్ చేసుకున్నాం.
హీరోయిన్ ఐశ్వర్య మీనన్ కు సంబంధించిన ట్విస్టులేవీ భజే వాయు వేగం సినిమాలో ఉండవు. ఆమెది ఇంపార్టెంట్ రోల్. కథను ముందుకు తీసుకెళ్తుంటుంది. ట్రైలర్ లో ఐశ్వర్య మీనన్ కు సంబంధించిన షాట్స్ తక్కువగా ఉన్నాయంటే కారణం ఆమెకు సంబంధించిన షాట్స్ పెడితే కథ రివీల్ అవుతుంది. ట్రైలర్ హీరో అడాప్ట్ చేసుకున్నకొడుకుగా చూపించాం. అక్కడే కథ మొదలవుతుంది. నా దృష్టిలో ఫైట్స్ చేయడం, విలన్ ను ఎదిరించడం ఎలా హీరోయిజమో. తండ్రి కోసం నిలబడటం, నా అనుకున్న వాళ్ల కోసం ఎక్కడిదాకా అయినా వెళ్లడం, ప్రేమించిన అమ్మాయి కోసం పోరాటం చేయడం కూడా హీరోయిజమే. భజే వాయు వేగం ఫస్టాఫ్ లో ఎమోషన్ ఉన్న హీరోను చూస్తారు. సెకండాఫ్ లో ఆ ఎమోషన్ వల్ల ఎలాంటి స్టెప్స్ తీసుకున్నాడు అనేది చూపిస్తున్నాం.
నేను స్క్రిప్ట్ లో ఇంటర్ ఫియర్ కాను. కానీ నాకు అనిపించిన అంశాలలో డిస్కస్ చేస్తుంటాను. క్యారెక్టర్ కు రెడీ అయ్యేందుకు మాత్రం టైమ్ కావాల్సి వస్తే తీసుకుంటా. భజే వాయు వేగం సినిమా క్రెడిట్ అంతా వందశాతం దర్శకుడిదే. రాహుల్ ను స్క్రీన్ మీద హ్యాపీడేస్ సినిమాలో చూశా. ఆ రెస్పెక్ట్ నాకు తన మీద ఇప్పటికీ ఉంది. రాహుల్ ఈ సినిమా చేసేందుకు ఇంట్రెస్ట్ చూపించాడు. మేము కలిసి హ్యాపీగా షూటింగ్ చేశాం. రాహుల్ తక్కువ టైమ్ లో నాకు మంచి మిత్రుడు అయ్యారు. అతని బ్రదర్ రోల్ చేస్తున్నాడు. మా కాంబినేషన్ కొత్తగా ఉండబోతోంది.
హీరోగా చేస్తున్న టైమ్ లో విలన్ గా గ్యాంగ్ లీడర్, వాలిమై చిత్రాల్లో నటించడం రిగ్రెట్ గా ఫీలవడం లేదు. అప్పటిదాకా నా సినిమాల రేంజ్ వేరు, గ్యాంగ్ లీడర్ సినిమా రేంజ్ వేరు. నేను అమెరికా సహా చాలా మంది ప్రేక్షకులకు గ్యాంగ్ లీడర్ ద్వారా గుర్తుండిపోయాను. అజిత్ తో వలిమై సినిమాలో నటించాక..తమిళనాట గుర్తింపు దక్కింది. ఈ సినిమాల తర్వాతే నేను స్టైలిష్ మేకోవర్ లో సినిమాలు చేయడం ప్రారంభించా. అప్పటిదాకా మాస్ లుక్ లో ఆర్ఎక్స్ 100, గుణ వంటి మూవీస్ లో నటించాను. గ్యాంగ్ లీడర్ లో నటించడం నా కెరీర్ కు ఎంతో అడ్వాంటేజ్ అయ్యింది. ఆ సినిమా తర్వాత విలన్ ఆఫర్స్ తెలుగులో వచ్చినా నాకు నచ్చేలా రాలేదు. తమిళంలో మాత్రం విలన్ గా ఆఫర్స్ వచ్చినా తెలుగులో హీరోగా చేస్తున్నందు వల్ల కమిట్ కాలేదు. దర్శకుడు ప్రశాంత్ తో నెక్ట్ మూవీ కూడా చేయాలనుకుంటున్నా.