Producer Chaitanya Reddy Interview – Tel
డార్లింగ్ కంప్లీట్ ఫ్యామిలీ అండ్ లవ్ ఎంటర్ టైనర్. కంటెంట్ అందరికీ కనెక్ట్ అవుతుంది: ప్రొడ్యూసర్ చైతన్య రెడ్డి
ప్రియదర్శి, నభా నటేష్ లీడ్ రోల్స్ లో నటిస్తున్న యూనిక్ రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ డార్లింగ్. అశ్విన్ రామ్ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రైమ్‌షో ఎంటర్టైన్మెంట్ కె నిరంజన్ రెడ్డి, శ్రీమతి చైతన్య నిర్మించిన ఈ చిత్రం ఎంటర్టైనింగ్ ప్రమోషనల్ కంటెంట్ తో హ్యుజ్ బజ్‌ని క్రియేట్ చేస్తోంది. డార్లింగ్ జూలై 19న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ నేపధ్యంలో నిర్మాత చైతన్య రెడ్డి విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలని పంచుకున్నారు.
ముందుగా మీకు కంగ్రాట్స్. హనుమాన్ తో పెద్ద సక్సెస్ ని అందుకున్నారు. నిర్మాతగా జర్నీ ఎలా వుంది?
థాంక్ యూ. హనుమాన్ పీపుల్ సక్సెస్. మేము ఫలితం ఆశించకుండా మా ప్రయత్నం చేశాం. ప్రేక్షకులు గొప్ప విజయాన్ని ఇచ్చారు. ఈ రోజుకి కూడా చాలా మంది సన్డేస్ వస్తే మా పిల్లలు హనుమాన్ తప్పకుండా చూస్తారు అని చెబుతుంటారు. ఇది దేవుడు మాకు ఇచ్చిన వరంగా భావిస్తున్నాం.
హనుమాన్ తర్వాత డార్లింగ్ లాంటి స్క్రిప్ట్ చేయడం ఎలా అనిపించింది ?
ఇది హనుమాన్ రిలీజ్ కి ముందే షూట్ కూడా స్టార్ట్ అయిపొయింది. ఈ సబ్జెక్ట్ కి డైరెక్టర్, ప్రొడ్యూసర్ ముందు కనెక్ట్ అయ్యారు. వాళ్ళది లవ్ మ్యారేజ్, మాది లవ్ మ్యారేజ్. మ్యారేజ్ అయి పద్నాలుగేళ్ళ తర్వాత లైఫ్ చాలా రొటీన్ అయిపోతుంది. సినిమాకి వెళ్ళడం కూడా ఒక పనిగా చూస్తాం. మొదట్లో ఎలా వున్నాం.. పిల్లలు వచ్చాక జీవితంలో బిజీ అయిపోయిన తర్వాత ఎలా ఉంటున్నాం.. ఈ పాయింట్ డైరెక్టర్ అశ్విన్ చెప్పినప్పుడు చాలా కనెక్ట్ అయ్యాం. కంటెంట్ విన్న వెంటనే ఓకే అన్నాం. ఈ జనరేష్ కి అర్ధమేయ్యేలాగ హ్యుమర్, ఫన్ ఎలిమెంట్స్ తో ఫ్యామిలీ, యూత్ ఆడియన్స్ అందరికీ కనెక్ట్ అయ్యేలా ఈ సినిమా తీర్చిదిద్దాం. డార్లింగ్ అందరికీ కనెక్ట్ అయ్యే ఎంటర్ టైనర్.
ఈ కథకు ప్రియదర్శి, నభా నటేష్ తీసుకోవడానికి కారణం?
హీరోకి చాలా ఇన్నోసెంట్, సింపుల్ బ్యాక్ గ్రౌండ్ వుండాలి. హీరోయిన్ హైఫై, సోషల్ లైఫ్ యాక్టివ్ గా వుండాలి. హీరో హీరోయిన్ కి ఈక్వెల్ ఇంపార్ట్టెన్స్ వుండే క్యారెక్టర్స్. ఈ పాత్రలకు ప్రియదర్శి, నభా పెర్ఫెక్ట్ యాప్ట్ ని భావించాం. ఈ పాత్రలలో లీనమావ్వడానికి రిహర్శల్స్ కూడా చేశారు. చాలా హార్డ్ వర్క్ చేశారు.
డార్లింగ్ చాలా క్యాచి టైటిల్ కదా ?
మొదట వైదిస్ కొలవరి అనే టైటిల్ అనుకున్నాం. అయితే హనుమాన్ సక్సెస్ తర్వాత మాకు టైటిల్ ప్రాముఖ్యత తెలిసింది. వైదిస్ కొలవరి అంటే కేవలం యూత్ కే అర్ధమౌతుంది. తర్వాత కొన్ని టైటిల్స్ అనుకున్నాం. చివరికి డార్లింగ్ కి ఫిక్స్ అయ్యాం. అయితే డార్లింగ్ పేరుతో ఇప్పటికే సినిమా వుంది. అప్పుడు వై దిస్ కొలవరి ని ట్యాగ్ లైన్ గా పెట్టాం.
ఎమోషన్, ఎంటర్ టైన్మెంట్ బ్లెండ్ అయిన మూవీ ఇది. ఇది కంప్లీట్ ఫ్యామిలీ అండ్ లవ్ ఎంటర్ టైనర్.
నభా గారికి యాక్సిడెంట్ అయ్యింది కదా. దాని వలన ఈ ప్రాజెక్ట్ ఏదైనా ఎఫెక్ట్ అయ్యిందా ?
లేదు. తను మళ్ళీ యాక్టింగ్ కి బ్యాక్ అయినప్పుడే మేము అప్రోచ్ అయ్యాం. ఈ సినిమాకి తను పెద్ద ఎసెట్. తను చాలా సపోర్టివ్. చాలా స్వీట్. తనది చాలా పాజిటివ్ రోల్. విమెన్ రెస్పెక్ట్ పెంచేలా ఆ పాత్ర వుంటుంది.
డార్లింగ్ సబ్జెక్ట్ కి యూనివర్సల్ అప్పీల్ వుంది. హనుమాన్ నిర్మాతలుగా మీరు పాన్ ఇండియా పరిచయం అయ్యారు. ఈ సినిమాని కేవలం తెలుగుకే పరిమితం చేయడానికి కారణం ?
మొదట తెలుగులో రిలీజ్ చేస్తున్నాం. ప్రేక్షకులకు నచ్చి ఆదరిస్తే.. ఇంకా పెద్ద కాస్ట్ తో రీమేక్ చేయాలనే ఆలోచన వుంది.
డార్లింగ్ అనే పేరు పెట్టారు.. ప్రమోషన్స్ కి ప్రభాస్ గారిని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారా ?
మేము ఆల్రెడీ అప్రోచ్ అవ్వడానికి ప్రయత్నించాం. కానీ ఆయన కల్కి తో చాలా బిజీగా వున్నారు. ఆయన టీంకి చాలా సపోర్ట్ గా వుంటారు.
మ్యూజిక్ డైరెక్టర్ గురించి ?
వివేక్ చాలా సపోర్ట్ చేశారు. సూపర్ సాంగ్స్ ఇచ్చారు. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా అద్భుతంగా చేశారు.
సినిమా అనేది ఆర్ట్ ఫారం. మీరు సినిమా, బిజినెస్ ఈ రెండిలో వున్నారు.. ఇందులో ఏది ఎక్కువ ఎంజాయ్ చేస్తారు ?
లైఫ్ లో సినిమా చూడకుండా, ఎంటర్ టైన్మెంట్ లేకుండా గడిచిన రోజు లేదు. యూఎస్ లో వున్నప్పుడు రోజుకి నాలుగు గంటలు ఎదో కంటెంట్ ని బ్రౌజ్ చేస్తూనే వుండేవాళ్ళం. సినిమా ఎంటర్ టైన్మెంట్ లైఫ్ లో ఒక భాగం అయిపొయింది. ఇప్పుడు అదే ఫీల్డ్ లో వర్క్ చేయడం ఆనందంగా వుంది. సినిమాతో పోలిస్తే బిజినెస్ మోర్ ఎంజాయ్ చేస్తాను. బిజినెస్ అంతా నేనే చూసుకుంటా. నేను బిజినెస్ లో క్యాలిఫైడ్. రెండు మాస్టర్స్ చేశాను. టెక్నికల్ బ్యాక్ గ్రౌండ్ వుంది. బిజినెస్ ని చాలా జాగ్రత్తగా చూసుకుంటాను. రెండు రంగాల్లో సక్సెస్ అవ్వడం ఆనందం వుంది. ఈ క్రెడిబిలిటీ అంతా దేవుడికి మా పేరెంట్స్ కి ఇస్తాను. నాకు ఫ్యామిలీ సపోర్ట్ వుంది. నిరంజన్ గారు చాలా సపోర్ట్ చేస్తారు.
జై హనుమాన్ ఎంత వరకూ వచ్చింది ? సంక్రాంతికి వచ్చే పాజిబుల్ అవుతుందా ?
జై హనుమాన్ ప్రీ ప్రొడక్షన్ స్టార్ట్ అయ్యింది. సంక్రాంతికి పాజిబుల్ అయ్యేలా లేదు. హనుమాన్ కి ఈ రేంజ్ రీచ్ ని ఊహించలేదు. ఒక మార్వల్ లాంటి స్టొరీ తీసుకోస్తునప్పుడు ఆ రీచ్ వుండాలి కాబట్టి కొంచెం టైం తీసుకుని చేద్దామనేది మా ఆలోచన.
హనుమాన్ పాత్రలో ఏ హీరో కనిపించే అవకాశం వుంది ? మీ పర్శనల్ ప్రిఫరెన్స్ ఎవరు ?
ఇంకా లేదండీ. అది హనుమంతుడే డిసైడ్ చేస్తారు. ఆ పాత్రలో ఎవరు కనిపిస్తారనేది హనుమంతుల వారికే వదిలేశాం.
నా పర్శనల్ ప్రిఫరెన్స్ అయితే రామ్ చరణ్ గారు, చిరంజీవి గారు. మేము సినిమా కంటే దేవుడి కథ చెప్పాలని అనుకుంటున్నాం. ఆయన ఎలా చెప్పించుకుంటారనేది ఆయన ఇష్టం.
హనుమాన్ సినిమా విషయంలో చిరంజీవి గారి సపోర్ట్ ని మర్చిపోలేం.
స్టొరీ ఫైనల్ జడ్జిమెంట్ ఎవరిది ?
నిరంజన్ గారిదే. ఆయన నాకంటే చాలా క్రియేటివ్. ఆయన సబ్జెక్ట్ సెలెక్షన్ చాలా బావుటుంది. ప్రొడక్షన్ సైడ్ నా ఇన్వాల్మెంట్ వుంటుంది.
నెక్స్ట్ లైనప్ లో ఉన్న సినిమాలు ?
చాలా సినిమాలు వున్నాయి. సాయి ధరమ తేజ్ సినిమా అనౌన్స్ చేశాం. ఇంకో పది సినిమాలు ప్రీప్రొడక్షన్ లో వున్నాయి. దాదపు మూడేళ్ళలో ఈ పది సినిమాలు రిలీజ్ కి వచ్చేస్తాయి.
ఆల్ ది బెస్ట్
థాంక్ యూ