Reading Time: < 1 min

క Movie Title Announcement Poster Launched – Tel

హీరో కిరణ్ అబ్బవరం భారీ పీరియాడిక్ థ్రిల్లర్ చిత్రానికి క టైటిల్ అనౌన్స్ మెంట్

యంగ్ టాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం భారీ పీరియాడిక్ థ్రిల్లర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ రోజు ఈ సినిమాకు క అనే ఇంట్రెస్టింగ్ టైటిల్ అనౌన్స్ చేశారు. టైటిల్ అనౌన్స్ మెంట్ పోస్టర్ లో కిరణ్ అబ్బవరం మేకోవర్ ఆసక్తి కలిగిస్తోంది. ఈ సినిమాను శ్రీచక్రాస్ ఎంటర్ టైన్ మెంట్స్ తో బ్యానర్ పై చింతా గోపాలకృష్ణ రెడ్డి భారీ ప్రొడక్షన్ వ్యాల్యూస్ తో నిర్మిస్తున్నారు.

దర్శక ద్వయం సుజీత్, సందీప్ విలేజ్ బ్యాక్ డ్రాప్ యాక్షన్ థ్రిల్లర్ కథతో ‌రూపొందిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ పూర్తయ్యింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. త్వరలో క సినిమాను తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడలో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు తీసుకురాబోతున్నారు. కిరణ్ అబ్బవరం కొంత విరామం తర్వాత చేస్తున్న క సినిమా అనౌన్స్ మెంట్ నుంచే క్యూరియాసిటీ క్రియేట్ చేస్తోంది.

నటీనటులు :

కిరణ్ అబ్బవరం

టెక్నికల్ టీమ్ :

సినిమాటోగ్రఫీ : విశ్వాస్ డానియేల్
మ్యూజిక్ : సామ్ సీఎస్
బ్యానర్ : శ్రీచక్రాస్ ఎంటర్‌టైన్‌మెంట్స్
నిర్మాత : చింతా గోపాలకృష్ణ రెడ్డి
దర్శకత్వం : సుజీత్, సందీప్